Little Hearts OTT Release: లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్.. ఇక్కడ చూసేయండి!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం మంచి కంటెంట్ ఉంటున్న చిత్రాలు థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో భారీ బడ్జెట్ చిత్రాలకు పోటీ చిన్న బడ్జెట్ సినిమాలు కూడా వస్తున్నాయి. అతి తక్కవ బడ్జెట్ తో కంటెంట్ నే నమ్ముకున్న చిన్న సిన్మాలు ఎలాంటి ప్రమోషన్స్, బజ్ లేకున్నా థియేటర్లలో విడుదలైన తర్వాత సంచలనంగా మారుతున్నాయి. ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ చిత్రం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి నెంబర్స్ దక్కాయి. పాజిటివ్ టాక్ రావడంతోపాటు యూత్ కు బాగా కనెక్ట్ అయిన చిత్రం కావడంతో ఈ మూవీ ఇప్పటికీ థియేట్రికల్ రన్ ను కొసాగిస్తోంది.

Little Heats OTT Release Date Confirmed by Streaming Partner

అయితే ఈ చిత్రం ఓటీటీలోకి కూడా ఎప్పుడు వస్తుందా? అని ఆడియెన్స్ ను ఎదురు చూస్తున్నారు. ఓటీటీ ఆడియెన్స్ చూపు మొత్తం ప్రస్తుతం ఈ సినిమాపైనే ఉండటం విశేషం. కాగా తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన అందించింది. ఈ చిత్రం అక్టోబర్ 1న ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఓటీటీ ఆడియెన్స్ కోసం మేకర్స్ మరిన్ని సన్నివేశాలను సినిమాకు జోడించి రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే లిటిల్ హార్ట్స్ చిత్రంలో ఉన్న ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఓటీటీ వెర్షన్ లో మరిన్ని సీన్లను జత చేస్తామని మేకర్స్ చెప్పడంతో మరోసారి ఈ మూవీకి ఓటీటీ ద్వారా క్రేజ్ రానుంది. థియేటర్లలో దుమ్ములేపిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందనేది వేచి చూడాలి. ఆడియెన్స్ మాత్రం లిటిల్ హార్ట్స్ చిత్రం ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మరో 3 రోజుల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ చిత్రంలో 90's మిడిల్ క్లాస్ సిరీస్ ఫేమ్ మౌలి తనుజ్, అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివానీ నాగారం జంటగా నటించారు. డెబ్యూ డెరెక్టర్ సాయి మార్తాండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ లో 90's మిడిల్ క్లాస్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హసన్ నిర్మాతగా వ్యవహరించారు. చిత్రంలో రాజీవ్ కననకాల కీలక పాత్రలో నటించారు. కాగా సినిమాకు రూ.2.5 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ నుంచి ఈ చిత్రం రూ.39 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ అందుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సంయుక్తంగా గ్రాండ్ గా విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X