Madharaasi OTT Business: రికార్డ్ ధరకు మదరాసి ఓటీటీ రైట్స్, శివకార్తీకేయన్ మూవీ బిజినెస్ ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ వరుస హిట్స్‌తో తన క్రేజ్, మార్కెట్ పెంచుకుంటున్నారు. ప్రేమకథలు, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో అలరిస్తున్నారు ఎస్కే. గతేడాది అమరన్‌తో కలెక్షన్ల వర్షం కురిపించిన శివకార్తీకేయన్.. తాను ప్రేమకథలే కాదు, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించుకున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న మూవీ మదరాసి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శివకార్తీకేయన్ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఏ సంస్థ దక్కించుకుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 5న మదరాసి రిలీజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం మదరాసి. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్ 5న మదరాసి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Madharaasi OTT Release Amazon Prime Video has secured Sivakarthikeyan s Film digital streaming rights

అమరన్‌తో కలెక్షన్ల వర్షం
అమరన్‌తో శివకార్తీకేయన్‌కు దక్షిణాదితో పాటు హిందీలోనూ మంచి మార్కెట్ వచ్చింది. అక్టోబర్ 31, 2024న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రికార్డులు నెలకొల్పింది. ఇండియా వైడ్‌గా 220 కోట్ల రూపాయల నికర వసూళ్లు రాబట్టిన శివకార్తీకేయన్.. 260 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ఓవర్సీస్‌‌లో 82 కోట్ల వసూళ్లతో కలిపి థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్‌గా ఏకంగా 342 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఆర్జించి నిర్మాతలకు భారీ లాభాలను అందించాడు అమరన్.

మదరాసికి రికార్డ్ బిజినెస్
అమరన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తీకేయన్ నటిస్తోన్న సినిమా కావడంతో పాటు ఏఆర్ మురుగదాస్ దర్శకుడు కావడంతో తాజాగా వస్తోన్న మదరాసి సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మదరాసి రిలీజ్ కానుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పార్శ్ ఫిల్మ్స్ దక్కించుకోగా.. అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్, యూరప్‌లో 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థలు మదరాసి సినిమాను విడుదల చేయనున్నాయి.

ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఎవరికంటే?
ఇక మదరాసి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను పరిశీలిస్తే.. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మదరాసి డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ డీల్ వాల్యూ ఎన్ని కోట్లు అనేది మాత్రం తెలియరాలేదు. ఇక మదరాసి శాటిలైట్ రైట్స్‌ను జీ సినిమాలు ఛానెల్ భారీ ధరకు దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X