Madharaasi OTT Release: నెల రోజులకే ఓటీటీలోకి శివకార్తీకేయన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ నటించిన చిత్రం మదరాసి. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించగా.. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మదరాసికి సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 5న మదరాసి మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది? మదరాసి ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? అనే వివరాలు పరిశీలిస్తే..

మదరాసి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైంది. అమరన్‌ తర్వాత శివకార్తీకేయన్ నటిస్తోన్న సినిమా కావడంతో పాటు ఏఆర్ మురుగదాస్‌ డైరెక్టర్ కావడంతో మదరాసిపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తగినట్లుగానే మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి మూవీకి 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక్కడ శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

Madharaasi OTT Release Siva Karthikeyan s Movie ready to stream Online this Platform

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రం 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పార్శ్ ఫిల్మ్స్ దక్కించుకోగా.. అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్, యూరప్‌లో 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థలు శివకార్తీకేయన్ మూవీని పంపిణీ హక్కులు సాధించాయి.

మదరాసి కలెక్సన్స్:
మదరాసికి ఇండియా వైడ్ తొలిరోజున 15 కోట్ల రూపాయలు, 2వ రోజున 13 కోట్ల రూపాయలు, 3వ రోజున 12 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున 3.5 కోట్ల రూపాయలు, 6వ రోజున 3 కోట్ల రూపాయలు, 7వ రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున 2 కోట్ల రూపాయలు, 9వ రోజున 3 కోట్ల రూపాయలు, 10వ రోజున 3.5 కోట్ల రూపాయలు, 11వ రోజున కోటి రూపాయలు, 12వ రోజున కోటి 10 లక్షల రూపాయలు, 13వ రోజున కోటి రూపాయలు వసూలు చేసింది. రెండో వారం నుంచి క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోయిన మదరాసి థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియా వైడ్ 62 కోట్ల రూపాయల నెట్, 73 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇక మదరాసి ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తే.. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్‌ తదితర దేశాలలో శివకార్తీకేయన్ మూవీకి 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి మదరాసి చిత్రానికి 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో మదరాసి కలెక్షన్స్ చూస్తే.. తొలి రోజు 2 కోట్ల రూపాయలు, 2వ రోజు కోటి 20 లక్షల రూపాయలు, 3వ రోజున కోటి రూపాయలు, 4వ రోజున 50 లక్షల రూపాయలు, 5వ రోజున 50 లక్షల రూపాయలు, 6వ రోజున 40 లక్షల రూపాయలు, 7వ రోజున 30 లక్షల రూపాయలు, 8వ రోజున 5 లక్షల రూపాయలు, 9వ రోజున 5 లక్షల రూపాయలు, 10వ రోజున 3 లక్షల రూపాయలు, 11వ రోజున 2 లక్షల రూపాయలు, 12వ రోజున 2 లక్షల రూపాయలు, 13వ రోజున 3 లక్షల రూపాయలు చొప్పున 6 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో మదరాసి కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళనాడులో57 కోట్ల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, కన్నడ+ కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. ఓవరాల్‌గా శివకార్తీకేయన్ మూవీ 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ ప్రకారం మదరాసి మూవీ 100 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టినట్లుగా కోలీవుడ్ టాక్.

మదరాసి ఓటీ రిలీజ్
థియేట్రికల్ బిజినెస్ ముగియడంతో మదరాసి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి శివకార్తీకేయన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్ వీడియోస్ సోషల్ మీడియాలో ప్రకటించింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X