Madharaasi OTT Release: ఓటీటీలోకి మదరాసి.. శివకార్తీకేయన్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడంటే?
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ నటించిన చిత్రం మదరాసి. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో శివకార్తీకేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 5న మదరాసి సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది? మదరాసి ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? అనే వివరాలు పరిశీలిస్తే..
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైంది. నిర్మాణ విలువలు, టెక్నికల్ అంశాల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా సినిమాను నిర్మించారు నిర్మాత లక్ష్మీ ప్రసాద్. చెన్నైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మదరాసి సినిమా షూటింగ్ జరుపుకుంది.

మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్
అమరన్‌తో శివకార్తీకేయన్ మార్కెట్ భారీగా పెరిగింది. ఏఆర్ మురుగదాస్‌తో శివకార్తీకేయన్ తొలిసారిగా జట్టు కట్టడంతో పాటు టీజర్,ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తగినట్లుగానే మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి మూవీకి 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక్కడ శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రం 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పార్శ్ ఫిల్మ్స్ దక్కించుకోగా.. అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్, యూరప్‌లో 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థలు శివకార్తీకేయన్ మూవీని విడుదల చేయనున్నాయి.
మదరాసి ఏ ఓటీటీలో?
మదరాసి విడుదల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి శివకార్తీకేయన్ అభిమానులు అప్పుడే చర్చ మొదలు పెట్టేశారు. ఈ వివరాలు పరిశీలిస్తే.. మదరాసి డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ వాల్యూ ఎన్ని కోట్లు అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అక్టోబర్ చివరి వారంలో మదరాసి చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ అనేది ఆలస్యం కావొచ్చు.. షెడ్యూల్ కంటే ముందే రావొచ్చు. దీనిపై త్వరలోనే అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇవ్వనుంది. ఇక మదరాసి శాటిలైట్ రైట్స్‌ను జీ సినిమాలు ఛానెల్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











