Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Rocketry OTT Release: మాధవన్ అద్భుత ప్రయోగం.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఒకప్పుడు ప్రేమ కథలతో అలాగే ఫ్యామిలీ కామెడీ సినిమాలతో ఎంతగానో కట్టుకున్న టాలెంటెడ్ నటుడు మాధవన్ ఇప్పుడు మాత్రం ఎక్కువగా ప్రయోగాత్మకమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా మాధవన్ ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త జీవిత ఆధారంగా ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు అదే సినిమాను ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ ప్రఖ్యత ఇస్త్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత ఆధారంగా నటుడు మాధవన్ స్వీయ ద్శకత్వంలో తెరపైకి తీసుకు వచ్చిన సినిమా 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. ఈ సినిమా జులై1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు పెద్దగా హైప్ లేని ఈ సినిమాను 25 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందించారు. అయితే సినిమా కేవలం మౌత్ టాక్ ద్వారానే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమా దాదాపు 40 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD
— amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022

ఈ సినిమాలో తమిళ హీరో సూర్య అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ప్రత్యేకమైన అతిధి పాత్రలో నటించడంతో సినిమాకు మరి కొంత హైప్ కూడా క్రియేట్ అయింది. ఇక మొత్తానికి విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమయింది.
ఈ నెల 26వ తేదీన తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషల్లో 'రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా ఆ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టర్ను విడుదల చేసింది. థియేటర్లో మిస్ అయిన చాలామంది ఈ సినిమాను ఓటీటీ లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా అర్థమవుతోంది. మరి సినిమా ఇంకా ఇలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.