Mahavatar Narsimha On OTT: ఓటీటీలోకి మహావతార్ నర్సింహా.. ఎక్కడ స్ట్రీమింగ్? ఎప్పటి నుంచి అంటే?

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా రూపొందించిన చిత్రం మహావతార్ నర్సింహా. యానిమేటెడ్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు అశ్వినీ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ ఎడిటింగ్, జయపూర్ణ దాస్ రచన సహకారం అందించారు.

కేజీఎఫ్, కాంతారా లాంటి పాపులర్ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో పూర్తి యానిమేటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. లేటేస్ట్ టెక్నాలజీ, సౌండ్, వీఎఫ్ఎక్స్ అంశాలు ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఈ కథలో ఎమోషన్స్ లేకపోయినా.. సాంకేతిక విభాగాల పనితీరు అద్బుతంగా ఉండటంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురవుతున్నారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకొని రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడూ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాల్లోకి వెళితే...

Mahavatar Narsimha into OTT

మహావతార్ నర్సింహా చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్లింది. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా కొనసాగించని విధంగా థియేట్రికల్ రన్‌ను దాదాపు 55 రోజులకుపైగా కొనసాగించింది. ఈ చిత్రం కన్నడలో 10 కోట్లకుపైగా నెట్, తెలుగులో 50 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లు, హిందీలో 190 కోట్ల రూపాయల నెట్, తమిళంలో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 250 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.

వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఆధారితంగా రూపొందిన ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు సుమారుగా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా ఇండియాలో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

అయితే థియేట్రికల్ రన్ ముగించుకొన్న ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ రేటు చెల్లించి రైట్స్‌ను సొంతం చేసుకొన్నది. నిర్మాతలతో జరిగిన ఒప్పందం ప్రకారం.. 8 వారాల గడువు పూర్తయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఇప్పటికే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఓటీటీలో ఏ రేంజ్ హిట్ అవుతుందో అని తెలుసుకోవడానికి వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: Mahavatar Narsimha netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X