For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీపీఐ నేత నారాయణపై నాగార్జున సెటైర్లు.. వాళ్లిద్దరికి పెళ్లైంది నారాయణ అంటూ కామెంట్

  |

  బిగ్‌బాస్ తెలుగు 6 మొదటి వారం ముగింపుకు రంగం సిద్దమైంది. శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున అక్కినేని ఆటవిడుపు కార్యక్రమం హంగామా సృష్టించిందనే విషయం తాజా ప్రోమోలో కనిపించింది. అయితే పొలిటిషియన్ నారాయణపై హోస్ట్ నాగార్జున పరోక్షంగా సెటైర్ వేశారనే విషయం స్పష్టంగా కనిపించింది. శనివారం ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమోలో నాగార్జున ఎలాంటి సందడి చేశారంటే..

   గీతూ రాయల్‌పై సెటైర్లు

  గీతూ రాయల్‌పై సెటైర్లు

  హ్యండ్సమ్ గెటప్‌తో నాగార్జున అక్కినేని వేదికపైకి రాగానే కంటెస్టెంట్ గీతూ రాయల్‌పై సెటైర్లు వేశాడు. మీ ఇల్లు ఎలా ఉందని నాగ్ అడిగితే.. మన ఇల్లు అంటూ కంటెస్టెంట్లు సమాధానం చెప్పారు. అయితే మన ఇల్లు అంటే గీతూ ఒప్పుకోదు అని నాగార్జున అన్నాడు. ఇల్లు మనది అయినప్పుడు ఫ్యామిలీ మనది కాదా అని నాగ్ ప్రశ్నించాడు. దాంతో అట్ట కాదు సార్ అంటే.. వద్దులే గీతూ.. నీతో నాకు గలాటా ఎందుకు అని టాపిక్‌ను కట్ చేశాడు.

  రేవంత్ బూతులు మాట్లాడకు అంటూ

  రేవంత్ బూతులు మాట్లాడకు అంటూ

  అయితే నాగ్, గీతూ మాట్లాడుకొంటుంటే.. సింగర్ రేవంత్ మధ్యలో దూరారు. మీకు తెలిసిపోయాందా అని రేవంత్ అంటే.. ఏం తెలిసిందని ప్రశ్న నాగ్ వేశాడు. దాంతో ఎందుకులే అని రేవంత్ ఊరుకొన్నాడు. నాకు తెలిసి ఒకటే.. నీవు ఇంటిలో బూతులు మాట్లాడుతున్నావు అని నాగ్ అంటే.. అవునా సార్ అని రేవంత్ ప్రశ్నార్థకంగా చూశాడు. దాంతో సాక్ష్యాలు కావాలా అంటూ రేవంత్ నోరును నాగ్ మూయించాడు.

  గీతూను ఆటపట్టించిన నాగ్

  గీతూను ఆటపట్టించిన నాగ్

  ఇక గీతూను ఆటపట్టించడాన్ని నాగార్జున కొనసాగించాడు. గీతూకు హగ్ ఇచ్చావు.. కానీ ఫ్యామిలీ అని చెప్పకు అని సుదీపకు సలహా ఇచ్చాడు. దాంతో ఫ్యామిలీ అంటే అని గీతూ ఏదో చెప్పబోతుండగా.. గీతూ నేను నీతో మాట్లాడలేదుగా.. నీవు మధ్యలో ఎందుకు వచ్చావు అంటూ నాగార్జున రాయలసీమ యాసలో సెటైర్ వేశాడు.

  ఆదిరెడ్డికి క్లాస్ పీకిన నాగ్

  ఆదిరెడ్డికి క్లాస్ పీకిన నాగ్

  ఇక సింగర్ రేవంత్‌ను నాగ్ ప్రశ్నిస్తూ.. ఆటలో ఓడిపోయిన బాధలో వెనుకకు వచ్చిన అరోహిని అవమానించడం సరైనదా అని అన్నాడు. క్షమించమని నీ వద్దకు సారీ చెప్పడానికి వస్తే..నీవు వింటున్నావు. కానీ మధ్యలో ఇద్దరు కామెంటేటర్లు దూరారు. వాళ్లకేమో రివ్యూలు చేసి చేసి... మధ్యలో దూరడం అలవాటు అనగానే.. ఆదిరెడ్డి లేచాడు. ఆట ఆడుతుంటే.. అంపైర్లు గ్రౌండ్‌లో తిరుగుతారా అంటూ ఆదిరెడ్డికి నాగ్ చురకలు అంటించారు.

  రోహిత్ నీకు లైసెన్స్ ఉందంటూ

  రోహిత్ నీకు లైసెన్స్ ఉందంటూ

  ఆ తర్వాత భార్య మెరినాను రోహిత్ పట్టించుకోవడం లేదనే విషయాన్ని నాగార్జున చర్చకు తెచ్చాడు. మెరినాను కాస్త పటించుకో రోహిత్ అని అన్నాడు. కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఆయనకు సిగ్గు అని మెరీనా చెప్పింది. అందరూ ఉన్నారని సిగ్గుపడకు. నీకు లైసెన్స్ ఉంది అంటూ నాగార్జున సలహా ఇచ్చాడు. దాంతో ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

  నారాయణ.. నారాయణ అంటూ కామెంట్

  నారాయణ.. నారాయణ అంటూ కామెంట్

  రోహిత్‌ను నాగార్జున ఆటపట్టిస్తూ.. మా అందరి కోసం ఒకసారి గట్టిగా కౌగిలించుకో అని నాగార్జున అన్నాడు. అలా వారిద్దరూ గాఢంగా కౌగిలించుకోగానే.. నారాయణ.. నారాయణ.. వాళ్లిద్దరికి పెళ్లి అయింది అంటూ నాగార్జున కామెంట్ చేశాడు. ఇటీవల బిగ్‌బాస్ బ్రోతల్ హౌస్ అంటూ విమర్శలు చేసిన నారాయణను ఉద్దేశించే ఈ కామెంట్ చేశారని చర్చ జరుగుతుంది.

  ఇంటి నుంచి అభినయశ్రీ అవుట్?

  ఇంటి నుంచి అభినయశ్రీ అవుట్?

  బిగ్‌బాస్ తెలుగు 6 ఇంటి నుంచి తొలి వారం బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యుల్లో ఏడుగురు ఉన్నారు. సింగర్ రేవంత్, చలాకీ చంటీ, శ్రీ సత్య, జబర్దస్త్ ఫైమా, ఇనయా సుల్తాన్, కొరియోగ్రాఫర్ అభినయ శ్రీ, యాంకర్ అరోహిరావు‌ను నామినేట్ అయ్యారు. తొలి వారం వీకెండ్ షోలలో ఇంటి నుంచి ఒకరిని పంపించేందుకు రంగం సిద్దమైంది. తొలి వారం ఇంటి నుంచి అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

  English summary
  Bigg Boss Telugu 6 first weekend show is on cards. Latest promo, Nagarjuna Akkineni satires on Political leader CPI Narayana in Bigg Boss Telugu 6 weekend promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X