Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: మాస్ పండగ లోడింగ్.. వీరసింహారెడ్డి టీమ్ తో బాలయ్య డిఫరెంట్ ఎపిసోడ్!
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన మరొక ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతోంది. ఇదివరకే ప్రభాస్ గోపీచంద్ ఇద్దరితో కూడా బాలయ్య బాబు చేసిన సందడికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు వీరసింహారెడ్డి టీమ్ తో ప్రత్యేకంగా బాలకృష్ణ చేసిన హంగామా కూడా రెడీ అవుతోంది. ఇక ఆ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది షోకు ఎవరెవరు వస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..

ఆహా రేంజ్ పెరిగేలా..
ఆహా అన్ స్టాపబుల్ షోకు మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి సీజన్ భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో సెకండ్ సీజన్ కూడా అంతకుమించి అనేలా క్రీజ్ అయితే అందుకుంటోంది. ఇక ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన విషయం తెలిసిందే. అలాగే ఆహాకు సబ్ స్క్రైబర్స్ సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.

అందుకే పవన్ ఎపిసోడ్ వాయిదా
అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎపిసోడ్ కూడా పూర్తి చేశారు. ఈ ఎపిసోడ్ ను సంక్రాంతికి విడుదల చేయాలి అని రెడీ అవుతున్న తరుణంలో ఊహించని విధంగా మధ్యలోకి మరొక ఎపిసోడ్ తీసుకువచ్చారు. వీర సింహారెడ్డి టీమ్ తో ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ నిర్వహించాలని బాలయ్య డిసైడ్ అయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వాయిదా పడింది.

వీర లెవల్ మాస్
పండగ సందర్భంగా ఆహా లో ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర సింహారెడ్డి టీమ్ అడుగుపెడితే వీర లెవల్ మాస్ పండగ.. ఎపిసోడ్ లోడింగ్ అని ఆహా నుంచి అధికారికంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక సంక్రాంతికి పండగ సందర్భంగా ఈ ఎపిసోడ్ రిలీజ్ కాబోతోంది.

ఫొటోలు వైరల్
ఈ ఎపిసోడ్లో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవి శంకర్ పాల్గనబోతున్నారు. అలాగే దర్శకుడు గోపీచంద్ నటీనటులు కూడా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ ఎపిసోడ్లో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆహా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

బాలయ్యతో బ్యూటీఫుల్ హీరోయిన్
అలాగే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్న బ్యూటిఫుల్ హీరోయిన్ హాని రోస్ కూడా కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే మేయిన్ హీరోయిన్ శృతిహాసన్ మాత్రం ఈ షోలో పాల్గొంటుందా లేదా అనే విషయంలో కొంత సస్పెన్స్ క్రియేట్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీ గ్రాండ్ గా విడుదల కానుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.