Don't Miss!
- News
నేటి నుండే రేవంత్ రెడ్డి పాదయాత్ర: సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో.. షెడ్యూల్ ఇలా!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సంక్రాంతికి నాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు.. అల్లు అరవింద్ మొహం మీదే ఆడిగేసిన బాలయ్య!
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కు కూడా మంచి క్రేజ్ డక్కడంతో బాలయ్య ప్రతీ ఎపిసోడ్ లో ఎవరు ఊహించని విధంగా విభిన్నమైన సెలబ్రిటీలను తీసుకు వస్తున్నారు. ఇక 5వ ఎపిసోడ్ లో ఈసారి ప్రముఖ దర్శక నిర్మాతలు సందడి చేశారు. ఈ నెల 4న ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న ఆ ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల చేశారు. అందులో బాలకృష్ణ సంక్రాంతి థియేటర్స్ విషయం కూడా ప్రస్తావనకు తీసుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్
ఈసారి సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా కూడా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అదే ఫెస్టివల్ కు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా రాబోతోంది. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ వారసుడు సినిమా కూడా వస్తోంది. అయితే ఈ సినిమాలకు సంబంధించిన థియేటర్స్ లెక్కలపై కూడా ఇప్పుడు వివాదం నడుస్తున్నట్లు టాక్ వస్తోంది. హీరోల మధ్యలో కూడా చర్చలు కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి ఇబ్బందులు లేవని
ఇక దిల్ రాజు ఇదివరకే ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రెండు సినిమాలను నిర్మించింది కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే. అయితే ఆ నిర్మాణ సంస్థతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని కేవలం ఇతర నిర్మాతల మండలి వారే అభ్యంతరం చెబుతున్నట్లు దిల్ రాజు చాలా క్లారిటీగా చెప్పారు. ఫైనల్ గా వారసుడు సినిమా సంక్రాంతికి భారీ స్థాయిలోనే విడుదల కానుంది.

అన్ స్టాపబుల్ షోలో..
ఇక సంక్రాంతి ఫైట్ లో నందమూరి బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఏ విధంగా మాట్లాడుకున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే అన్ స్టాపబుల్ షోలో అల్లు అరవింద్ పాల్గొనగా ఆయనను బాలయ్య మొహం మీదే ఈ విషయం గురించి తెల్చినట్లు అనిపిస్తోంది. ఇక 5వ ఎపిసోడ్ లో ఈసారి టాప్ టాలీవుడ్ లెజెండ్స్ కనిపించబోతున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, అలాగే సురేష్ బాబు, సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు కూడా వచ్చారు. ఇక ఆ ప్రోమో విడుదలవగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

నాకు ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారు
ఇక సంక్రాంతి ఫైట్ గురించి నందమూరి బాలకృష్ణ స్ట్రైట్ గా అల్లు అరవింద్ ను అడిగిన విధానం వైరల్ గా మారింది. సంక్రాంతికి నాకు ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారు అని బాలయ్య అల్లు అరవింద్ ను మొహం మీదే అడగడంతో ఆయన ఎలాంటి సమాధామం ఇచ్చి ఉంటారు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తం ప్రోమోలో కూడా ఇదే ప్రశ్న ఎక్కువగా హైలెట్ అయ్యింది.

బాలయ్య ఎందుకు అడిగాడాంటే?
బాలకృష్ణ ఆ విధంగా ప్రశ్నించడం వెనుక ఒక కారణం అయితే ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆ నలుగురు శాసిస్తున్నారు అని అందులో అల్లు అరవింద్ ఒకరని అందరికి తెలిసిందే. అయితే అల్లు అరవింద్ దగ్గర చాలా మల్టీప్లెక్స్ సింగిల్ థియేటర్స్ రెంట్స్ పద్ధతుల్లో నడుస్తున్నాయి. ఇక దిల్ రాజు, సురేష్ బాబు ఆధీనంలో కూడా కొన్ని థియేటర్స్ ఉన్నాయి. మరి బాలయ్య అడిగిన ప్రశ్నకు వీరి నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి.