Don't Miss!
- Finance
pak crisis: పాక్ బడ్జెట్ లో అంకెల గారడీ.. IMF బెయిలౌట్ అందుతుందా..?
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Unstoppable 2: బొడ్డు మీద యాపిల్ సంగతిపై బాలయ్య ప్రశ్నలు.. కె.రాఘవేంద్రరావు సీరియస్ డైలాగ్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ పేరుకు తగ్గట్టుగానే ముందుకు సాగుతోంది. మొదటి సీజన్ కంటే కూడా రెండవ సీజన్ మరింత ఆసక్తికరంగా డిఫరెంట్ గెస్టులతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే 5వ ఎపిసోడ్ లో ఈసారి టాప్ టాలీవుడ్ లెజెండ్స్ కనిపించబోతున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, అలాగే సురేష్ బాబు, సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు కూడా వచ్చారు. ఇక ఆ ప్రోమో విడుదలవగా అందులో కె.రాఘవేంద్రరావు బొడ్డు మీద యాపిల్ గురించి ఒక వివరణ ఇచ్చారు.

థియేటర్స్ విషయాలపై..
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఎప్పటికప్పుడు సరికొత్త గెస్టులతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక మొదటిసారి బాలయ్య ఈ షోలో ఒకేసారి నలుగురు గెస్టులను ఇంటర్వ్యూ చేయడం విశేషం. ముఖ్యంగా అల్లు అరవింద్ తో థియేటర్స్ విషయాలపై అలాగే సురేష్ తో బిజినెస్ వ్యవహారాలపై బాలయ్య ప్రశ్నలు వేయబోతున్నారు.

గెస్ట్ గా దర్శకేంద్రుడు
ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా 5వ ఎపిసోడ్ కు గెస్ట్ గా రావడం విశేషం. అసలైతే గత సీజన్ లోనే ఆయనను రప్పించాలని అనుకున్నారు. కానీ ఈసారి పట్టుబట్టి బాలయ్య ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఇక డిసెంబర్ 2వ తేదీన ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ లో ఆయన హైలెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రోమో లోని మరికొన్ని హైలెట్స్ లోకి వెళితే.

40 ఏళ్ళ నుంచి వీరి ఇద్దరి మద్యే
అల్లు అరవింద్, సురేష్ బాబు ముందు షోలోకి రాగా ఆ తరువాత కె.రాఘవేంద్రరావు ఎంట్రీ ఇచ్చారు. జీవితమంతా 40 ఏళ్ళ నుంచి వీరి ఇద్దరి మద్యే సాండ్ విచ్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనా అని రాఘవేంద్రరావు సరదాగా జోక్ చేశారు. దీంతో బాలయ్యతో పాటు మిగతా వాళ్ళు నవ్వుకున్నారు.

బిఏ అంటే బొడ్డు మీద యాపిల్
అయితే అల్లు అరవింద్ కె.రాఘవేంద్రరావు తో పాటు BA ట్యాగ్ గురించి కూడా వివరణ ఇచ్చారు. బిఏ అంటే బొడ్డు మీద యాపిల్ అని వివరణ ఇచ్చారు. ఇక రాఘవేంద్రరావు మరో సమాధానం ఇస్తూ.. న్యూటన్ యాపిల్ పడేటప్పుడు గ్రావిటీ కనిపెట్టారు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను అని రాఘవేంద్రరావు మరో ఆన్సర్ ఇచ్చారు.

ఏమిటి ఈ పక్షపాతం
ఇక పళ్ళు వాళ్ళకే, పువ్వులు వాళ్ళకే అందమైన కాస్ట్యూమ్స్ వాళ్ళకే.. ఏమిటండి హీరోయిన్స్ మీద మక్కువ? ఏమిటి ఈ పక్షపాతం అని బాలయ్య అడగడంతో ఏమంటివి ఏమంటివి అని రాఘవేంద్రరావు సమాధానం ఇచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో బాలయ్య నెపోటీజమ్ గురించి కూడా అల్లు అరవింద్ ను ప్రశ్నించారు.

ఇండస్ట్రీలో ఆ నలుగురు
ఇక అల్లు అరవింద్ తోనే థియేటర్స్ గొడవ గురించి అడిగిన బాలకృష్ణ ఇండస్ట్రీలో ఆ నలుగురు అనే విషయంపై కూడా కొన్ని సందేహాలు తీర్చబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక అల్లు అరవింద్ కూడా ఈ వివాదాల పై స్ట్రైట్ గా కొన్ని ఆన్సర్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఇక ఇదే షోలో బాలయ్య తన తండ్రి గొప్పతనం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రోమో అయితే అదిరింది. మరి పూర్తి ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలి.