Don't Miss!
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: హీరో గోపిచంద్ జీవితంలో కూడా విషాధాలు.. రియల్ హీరోలా తట్టుకొని..
అన్ స్టాపబుల్ షో లో ఇటీవల ప్రభాస్ ప్రత్యేక అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక అతనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ కు భారి స్థాయిలో స్పందన వచ్చింది. ఇక రెండో భాగం ఎపిసోడ్ కూడా ఇప్పుడు ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్ లో గోపీచంద్ కు సంబంధించిన సీన్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. అయితే గోపీచంద్ చూడడానికి పైకి చాలా నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా అతను గతంలో ఎన్నో విషాదకరమైన చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు.
వాటి గురించి అన్ స్టాపబుల్ లో బాలయ్య బాబుతో షేర్ చేసుకున్నాడు. గోపీచంద్ తండ్రి T.కృష్ణ ఒకప్పుడు మంచి విప్లవాత్మకమైన సినిమాలను తెరపైకి తీసుకువచ్చారు. నేటి భారతం, ప్రతిఘటన లాంటి ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించడంతో గోపీచంద్ ఫ్యామిలీ ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.

తండ్రి చనిపోయినప్పుడు గోపీచంద్ వయసు కేవలం 9 సంవత్సరాలు. ఇక ఆయనతో తాను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయాను అని ఒక విధంగా మొదట్లో తండ్రి అంటే చాలా భయంగా ఉండేది అని గోపీచంద్ చెప్పాడు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత కాలేజ్ డేస్ లో ఉండగా సోదరుడు కూడా చనిపోయినట్లుగా గోపీచంద్ వివరణ ఇచ్చాడు. గోపీచంద్ సోదరుడు దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకున్నాడు కానీ అనుకోకుండా అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు.
ఆ విషయాన్ని కూడా చెప్పుకొని గోపీచంద్ ఎమోషనల్ అయ్యాడు ఇక ఇండస్ట్రీలోనే ఉండాలి అని మొదట హీరోగా సినిమా చేయగా అది ఫ్లాప్ అయింది అని ఇక తర్వాత ఒక ఏడు ఎనిమిది నెలల గ్యాప్ తీసుకొని మళ్లీ విలన్ గా ట్రై చేసే సక్సెస్ అయినట్లుగా గోపీచంద్ తన రియల్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య గోపిచంద్ గురించి మాట్లాడుతూ.. నిజంగా అన్ స్టాపబుల్ అని ప్రశంసలు కురిపించారు.