Don't Miss!
- Sports
IND W vs SA W: ప్చ్.. ఫైనల్లో భారత్ ఓటమి.. సౌతాఫ్రికాదే ట్రై సిరీస్!
- News
Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
పవన్ కల్యాణ్ సీఎం..సీఎం అంటూ నినాదాలు.. బాలకృష్ణతో క్రేజీగా పవర్ స్టార్
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 క్రేజీగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాబోతున్న ఎపిసోడ్‌ను ఆహా ఓటీటీ గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా మారింది. NBK With PSPK ఎపిసోడ్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

బాలయ్య ముందుగానే అన్నపూర్ణకు
పవన్ కల్యాణ్‌తో ప్రారంభించబోయే ఎపిసోడ్ కోసం నందమూరి బాలకృష్ణ చాలా ముందుగానే అన్నపూర్ణ స్టూడియోకు చేరుకొన్నారు. అక్కడ ఆహా సిబ్బంది, తన వ్యక్తిగత సిబ్బందితో ఉల్లాసంగా మాట్లాడుతూ బాలయ్య హుషారుగా కనిపించారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఆనందంగా కనిపించారు. బాలకృష్ణ తన కూతురుతో రావడం విశేషంగా మారింది.

బిగ్గెస్ట్ టాక్ షోగా అన్ స్టాపబుల్
ఇక నిర్మాత అల్లు అరవింద్ అన్నపూర్థ స్టూడియోకు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా అన్ స్టాపబుల్ మారింది. ఈ షో ప్రారంభించడానికి ముందు మంచి టాక్ షో అవుతుందని భావించాం. కానీ ఇది ఇండియాలోనే అతిపెద్ద షో కావడం ఆనందంగా ఉంది. ఇండియాలోనే క్రేజీ షోగా రికార్డు క్రియేట్ చేసింది. తదుపరి ఎపిసోడ్ పవన్ కల్యాణ్‌తో ఉంటుంది. ఈ షోకు వస్తున్న పవర్ స్టార్‌కు నా థ్యాంక్స్ అని అరవింద్ అన్నారు.

పవన్ కల్యాణ్ రాగానే. .
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 11 గంటల ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోకు చేరుకొన్నారు. ఆయనను చూడగానే అభిమానుల కేరింతలతో అన్నపూర్ణ స్టూడియో దద్దరిల్లింది. పవన్ కోసం వేచి ఉన్న అరవింద్ అల్లు, నందమూరి బాలకృష్ణ సాదారంగా ఆహ్వానించారు. కారు దిగగానే బాలకృష్ణను చూసి ఆనందంతో పవన్ కౌగిలించుకొన్నాడు. అల్లు అరవింద్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉత్సాహంగా కనిపించారు. అభిమానులకు విష్ చేస్తూ పవన్ అందర్నీ ఉత్సాహ పరిచారు.

సీఎం సీఎం అంటూ నినాదాలు
పవన్ కల్యాణ్ వేదిక వద్దకు చేరుకోగానే.. అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. బాబులకే బాబు.. కల్యాణ్ బాబు.. బాబులకే బాబు కల్యాణ్ బాబు అంటూ గట్టిగా కేకలు పెట్టారు. పవన్ కల్యాణ్ చాక్లెట్ కలర్ హుడీ ధరించి కనిపించాడు. నీటుగా షేవ్ చేసుకొని మరింత క్రేజీగా కనిపించారు.
|
పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్, నాగవంశీ
పవన్ కల్యాణ్‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ కలిసి వచ్చారు. బాలయ్యతో త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఈ షోకు మాటలు, కంటెంట్ రాస్తున్న బీవీఎస్ రవి హడావిడిగా కనిపించారు. వీరందరిని అల్లు అరవింద్ ఉత్సాహంగా ఆహ్వానం పలికారు.

భారీ పోస్టర్ ఆవిష్కరణ
పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగానే.. అన్నపూర్ణ స్టూడియోలో భారీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అన్‌స్టాపబుల్ 2 షోలో NBK with PSPK అనే పోస్టర్‌ను ఇద్దరు ఫోటోలతో చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరించగానే అభిమానులు భారీగా కేకలు పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పవన్‌తో క్రిష్, సాయిధరమ్ తేజ్
బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించబోయే అన్‌స్టాపబుల్ 2 షోలో గెస్టుగా పవన్ కల్యాణ్ పాల్గొనడం తెలిసిందే. ఈ షోలో పవన్ కల్యాణ్‌తోపాటు దర్శకుడు క్రిష్ కూడా పాల్గొంటారు. అలాగే షో మధ్యలో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొంటారని తాజా సమాచారం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ షోలో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
|
పవన్ కల్యాణ్, బాలకృష్ణ కలయిక వీడియో
పవన్ కల్యాణ్, బాలకృష్ణ కలయిక గురించిన వీడియోపై ఓసారి లుక్కేయండి..