For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  18 Pages OTT: ఓటీటీలోకి '18 పేజీస్', సంక్రాంతి కానుకగా అప్పుడే!.. ఎందులో అంటే?

  |

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా కలిసి మరోసారి నటించిన చిత్రం 18 పేజీస్. కరెంట్, కుమార్ 21F వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలైంది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అని పొగుడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ తెరపై ఎప్పుడూ వస్తుందా అని అప్పుడే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. 18 పేజీస్ సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంలోకి వెళితే..

  ఇటీవలే పాన్ ఇండియా సినిమాతో..

  ఇటీవలే పాన్ ఇండియా సినిమాతో..

  విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల చేస్తూ వచ్చాడు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో విజయం సాధించాడు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే.

  కొత్త టెక్నాలజీ వైపు..

  కొత్త టెక్నాలజీ వైపు..

  తాజాగా మరోసారి నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటించిన చిత్రం 18 పేజీస్. ఒక అందమైన లవ్ స్టోరిగా డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంటోంది. సినిమా కథ కొత్తగా ఉన్న దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ టేకింగ్ కొంచెం మిస్ అయిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. నేటి సమాజంలో యువత ఫోన్ కు అడిక్ట్ అయి, విర్చువల్ అంటూ కొత్త టెక్నాలజీకి మొగ్గు చూపుతోంది. అలా కాకుండా ఒక మనిషికి మరొ మనిషికి ఇంటరాక్షన్ ఉంటే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూపించారు.

  ఇతర సినిమాలను తలపించినా..

  ఇతర సినిమాలను తలపించినా..

  ఒక డైరీ ఆధారంగా పల్లెటూరు అమ్మాయిని హీరో ప్రేమించడం, ఆమె మొహాన్ని చూడకుండా కేవలం ఆమే క్యారెక్టర్ చూసి ఇంప్రెస్ అవ్వడం వంటి సన్నివేశాలు ఇతర సినిమాలను తలపించినా 18 పేజీస్ సినిమాలో కొత్తదనం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటన సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని కూడా భావిస్తున్నారు.

  ఆహాలో 18 పేజీస్ మూవీ..

  ఆహాలో 18 పేజీస్ మూవీ..

  నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ జోడీగా మరోసారి వచ్చిన ఈ 18 పేజీస్ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ తెరపైకి ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఫీల్ గుడ్ లవ్ గా వచ్చిన 18 పేజీస్ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే జనవరి నెల మధ్యలో సంక్రాంతి కానుకగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా తీసుకురానున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే జనవరి 10 నుంచి 15వ తేదిలో ఏదో ఒక్క రోజు రిలీజ్ చేయనున్నారని టాక్.

  బెస్ట్ ఫ్రెండ్ గా సరయు..

  బెస్ట్ ఫ్రెండ్ గా సరయు..

  సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన మరో చిత్రమే ఈ 18 పేజీస్. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ కు బెస్ట్ ఫ్రెండ్ బాగీగా బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ సరయు నటించి ఆకట్టుకుంది. అలాగే మరి కొన్ని పాత్రల్లో సూర్య వెబ్ సిరీస్ ఫేమ్ మౌనిక రెడ్డి, నటుడు అజయ్, అర్జున్ కల్యాణ్, గోపరాజు రమణ, శత్రు తదితరులు నటించారు.

  English summary
  Karthikeya 2 Hit Pair Nikhil Siddharth Anupama Parameswaran Love And Romantic Entertainer Movie 18 Pages OTT Rights To Aha And Streaming From January.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X