Don't Miss!
- News
నాకు హోం మంత్రి పదవి కావాలి - చంద్రబాబుకు సీనియర్ అల్టిమేటం..!!
- Lifestyle
Chanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దు
- Finance
Raghuram Rajan: భారత బ్యాంకులు జర జాగ్రత్తగ ఉండాలె.. రాజన్ హెచ్చరిక వెనుక..?
- Sports
ఏంటి ఈ పిల్ల చేష్టలు.. ఇషాన్ కిషన్ ప్రాంక్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్!
- Automobiles
ఒక్క ఛార్జ్‌తో 120 కిమీ రేంజ్ అందించే HOP LEO ఎలక్ట్రిక్ స్కూటర్: ధర లక్ష కంటే తక్కువే..
- Technology
ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్! వివరాలు!
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
Unstoppable 2: డైరెక్టర్లందరూ రాజమౌళిని తిడుతుంటారు, విశ్వనాథ్ కోప్పడ్డారు.. ప్రభాస్ షాకింగ్ గా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ఇక ప్రభాస్ తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో రాజమౌళిని మిగతా అందరూ డైరెక్టర్లు తిడతారని షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రభాస్.

ప్రభాస్ ను కౌగిలించుకుని..
'Unstoppable with NBK 2' షోలో భాగంగా కొత్త ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు గానూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా వచ్చారు. అతడికి భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చి మరీ హోస్ట్ నటసింహా నందమూరి బాలకృష్ణ షోలోకి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రభాస్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ప్రభాస్ ప్రాజెక్టులు, డేటింగ్ రూమర్స్, పెళ్లి సహా ఎన్నో విషయాల గురించి నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు.

సినిమాలోని డైలాగ్ లను..
అలాగే ప్రభాస్ తో అనేక గేమ్స్ ఆడించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఇందులో భాగంగానే బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని సినిమా డైలాగ్ లు వినిపిస్తుంటాయి. అవి ఓ మూవీలోని డైలాగ్ లో చెప్పి, ఆ సన్నివేశం ఏంటో చెప్పాలని బాలకృష్ణ అడిగాడు. ఈ క్రమంలో ఛత్రపతి సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ ను ప్లే చేశారు. అది గుర్తు పట్టిన ప్రభాస్.. రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు.

రెండు మూడు టేకుల్లో..
ఛత్రపతి నుంచి నువ్ నేర్చుకుంది ఏంటమ్మా అని బాలకృష్ణ అడిగితే.. అలా ఏం చెప్పలేను కానీ, నాలుగు రోజులకే రాజమౌళి గొప్ప మనిషి అని అర్థమైపోయింది. ఆయనకు అప్పటినుంచి బాగా క్లోజ్ అయిపోయి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. ఏ షాట్ అయినా రెండు మూడు టేక్ ల్లో అయిపోయేది. ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ లో.. అంత పెద్ద వర్షం.. అంత మంది జనాన్ని చూసి.. అమ్మో నేను పెద్దగా డైలాగ్ లు చెప్పలేను అని అన్నానని ప్రభాస్ తెలిపాడు.

జనం ముందు సైలెంటే..
డైలాగ్
లు
పెద్దగా
చెప్పలేను
సైలెంట్
గా
చెబుతాను
అని
అన్నాను
అంటే
సరే
చెప్పేయు
అని
రాజమౌళి
అన్నారు
అని
ప్రభాస్
చెప్పాడు.
ఆ
షాట్
లో
మీరు
చూసింది.
జస్ట్
పెదాలు
కదిలించింది
మాత్రమే
ఉంటుంది.
తర్వాత
డబ్బింగ్
లో
కవర్
చేశాం.
ఇక
అప్పటి
నుంచి
జనం
ముందు
అంతా
సైలెంటే..
అందరూ
డైరెక్టర్లు
రాజమౌళిని
తిడతా
ఉంటారు.
విశ్వనాథ్
గారితో
చేశా
మిస్టర్
పర్ఫెక్ట్.
ఆర్టిస్ట్
లు
ఉంటే
సైలెంట్
గా
చెప్పేస్తాను
అని
ప్రభాస్
అన్నాడు.

విశ్వనాథ్ గారు పిలిచి..
నేను సైలెంట్ గా డైలాగ్ లు చెప్పడం చూసి విశ్వనాథ్ గారు పిలిచి.. ఇలా అయితే ఎలా.. ఓపెన్ గా చెప్పాలి డైలాగ్ లు.. అలా సిగ్గు పడితే ఎలా అని అన్నారు. అందరూ డైరెక్టర్లు తిట్టడం.. రాజమౌళి వల్లే నువ్ ఇలా సైలెంట్ గా చెబుతున్నావ్ అని అనేవారు అని ప్రభాస్ తెలిపాడు. దీంతో బాలకృష్ణ, ప్రభాస్ ఇద్దరు నవ్వుకున్నారు. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని డైలాగ్ ప్లే చేశారు.

వర్షం సినిమాతో..
మిస్టర్
పర్ఫెక్ట్
క్లైమాక్స్
సీన్స్
అనుకున్నట్లు
రాకపోవడం..
చాలా
చోట్ల
ఎమోషన్
మిస్
అవడంతో
మళ్లీ
రీషూట్
చేశామని
ప్రభాస్
చెప్పాడు.
దిల్
రాజు
మంచి
సినిమాలే
విడుదల
చేద్దాం
అని
ఇచ్చిన
సపోర్ట్
తో
దశరథ్
కాల్
తీసుకుని
మళ్లీ
కొన్ని
సీన్లు
చిత్రీకరించాడని
ప్రభాస్
చెప్పుకొచ్చాడు.
ఇక
మిస్టర్
పర్ఫెక్ట్
సినిమాకు
వచ్చిన
పాజిటివ్
టాక్
వెనుక
చాలా
కథ
జరిగిందన్నాడు
ప్రభాస్.
ఫస్ట్
టైమ్
హీరోగా
సెట్
అయిపోయాం
అని
అనిపించింది
వర్షం
సినిమాతో
అని
పేర్కొన్నాడు
ప్రభాస్.