Don't Miss!
- News
ఫ్లెక్సీల నిషేధంపై జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ-హైకోర్టు కీలక ఆదేశాలు..!
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Sports
WPL:మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. బీసీసీఐకి రూ.4670 కోట్లు!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Unstoppable 2 పెళ్లయిన హీరోయిన్ ను తీసుకెళ్లిపోతానన్న ప్రభాస్.. నారీ నారీ నడుమ మురారీ అంటూ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభాస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల కోసం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 ద్వారా సూపర్ ట్రీట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగా తాజాగా రెండో పార్ట్ ప్రోమోను విడుదల చేశారు.

స్టార్ హీరోల సందడి..
నందమారి నటసింహం బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'Unstoppable with NBK' షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో స్టార్ హీరోలు, హీరోయిన్లు సందడి చేయగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అతని ఫ్రెండ్ మ్యాచో హీరో గోపిచంద్ గెస్టులుగా హాజరయ్యారు.

జనవరి 6న రెండో పార్ట్..
ఇటీవల షూటింగ్ జరుపుకున్న ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ ఇంటర్వ్యూ నిడివి భారీగా ఉండటంతో ఈ ఎపిసోడ్‌ను బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి బిగినింగ్‌గా, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి కన్‌క్లూజన్‌గా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి పార్ట్1ను డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు ప్రసారం చేశారు. ఇక రెండో పార్ట్ అయిన బాహుబలి 2 ను జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయాలని డేట్స్ ఫిక్స్ చేశారు.

చాలా స్టైలిష్ సినిమా అది..
అన్ స్టాపబుల్ 2 సీజన్ ప్రభాస్ కు సంబంధించిన ఎపిసోడ్ రెండో పార్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమోను గోపీచంద్ ఎంట్రీతో ప్రారంభించారు. తర్వాత బాలకృష్ణను, ప్రభాస్ ను కౌగిలించుకుని కూర్చున్నాడు గోపీచంద్. మీ సినిమాలన్నింటిలోకి చాలా స్టైలిష్ గా చూడటానికి బాగుండే సినిమా జిల్. మాములుగా ఉండదు ఆ లుక్ అని బాలకృష్ణ అన్నాడు. దీంతో ప్రేక్షకుల నుంచి అరుపులు, కేకలు వినిపించాయి.

ఫోన్ ఎక్స్చేంజ్ ఎవరితో..
నువ్వు ప్రభాస్ లాగే నవ్వుతుంటావా.. మాట్లాడుతుంటావా అని బాలకృష్ణ అడిగాడు. మాట్లాడతాను సర్ అని గోపిచంద్ అంటే.. అదే మీరిద్దరు ఏం మాట్లాడుకుంటారు అని బాలకృష్ణ కౌంటర్ వేశాడు. దీనికి ప్రభాస్ నవ్వేశాడు. తర్వాత మాళవిక మోహనన్, శ్రుతి హాసన్ ఫొటో ఫ్రేమ్స్ ఉంచారు. మీ ఫోన్ వీళ్లిద్దరితో ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఎవరితో చేసుకుంటారు అని బాలకృష్ణ అడగ్గా.. నాకు పెళ్లయిపోయింది కాబట్టి అని గోపిచంద్ అన్నాడు. దీనికి పెళ్లికి ముందు అని ప్రభాస్ నవ్వించాడు.

ఇద్దరినీ తీసుకెళ్లిపోతా..
2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారు అని బాలకృష్ణ అంటే.. చెప్పురా.. నేనైతే పడలేదు.. నీకేమైన ఉంటే చెప్పు అని ప్రభాస్ అటు తిరిగాడు. ఇప్పుడు ఫారెన్ షెడ్యూల్ అయిపోయాకా.. షాపింగ్ చేసుకోని వెళ్దాం అండి.. అని ఎవరితో అంటారు అని బాలకృష్ణ అడిగాడు. సరే సార్.. ఇద్దరిని తీసుకెళ్లిపోతా అంటూ నయనతార, తమన్నా ఫొటోలపై లవ్ హార్ట్ సింబల్ పెట్టాడు ప్రభాస్. దీంతో మా రెబల్ స్టార్ నారీ నారీ నడుమ మురారీ అని బాలకృష్ణ అనడంతో ప్రేక్షకులంతా అరిచారు. వారిలో నయనతారకు పెళ్లయిన విషయం తెలిసిందే.