For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable with NBK 2: ప్రభాస్‌కు బాలయ్య వార్నింగ్.. అందరి ముందే ఆ పని చేసి షాకిచ్చిన స్టార్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ తిరుగులేని హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హిట్లు ఫ్లాపులను ఏమాత్రం పట్టించుకోని ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇలా వరుస మూవీలతో బిజీగా ఉన్న బాలయ్య.. ఆహా ఓటీటీ సంస్థ కోసం 'Unstoppable with NBK' అనే టాక్ షోను చేస్తోన్నారు. తాజా సీజన్‌లో కొత్త ఎపిసోడ్‌ కోసం వచ్చిన ప్రభాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  చంద్రబాబుతో గ్రాండ్‌గా మొదలు

  చంద్రబాబుతో గ్రాండ్‌గా మొదలు

  టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' రెండో సీజన్‌కు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టారు. అక్టోబర్ 14న స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కినట్లు అయింది.

  మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!

  తర్వాత సీజన్లు కూడా భారీ హిట్టే

  తర్వాత సీజన్లు కూడా భారీ హిట్టే

  'Unstoppable with NBK' రెండో సీజన్‌లో రెండో ఎపిసోడ్‌కు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ.. మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడివి శేష్.. నాలుగో ఎపిసోడ్‌కు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధికలు.. ఐదో ఎపిసోడ్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావులు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లు అన్నింటికీ భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇవన్నీ భారీ హిట్ అయ్యాయి.

  ఆరో ఎపిసోడ్‌ కోసం ప్రభాస్ రాక

  ఆరో ఎపిసోడ్‌ కోసం ప్రభాస్ రాక


  'Unstoppable with NBK 2' షోలో భాగంగా 6వ ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు గానూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అతడి స్నేహితుడు హీరో గోపీచంద్ గెస్టులుగా వచ్చారు. వీళ్లిద్దరికీ నటసింహా నందమూరి బాలకృష్ణ సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరినీ ఆప్యాయంగా కౌగిలించుకుని స్టేజ్ మీదకు ఆహ్వానించారు.

  హీరోయిన్ శ్రీయ అందాల ఊచకోత: బట్టలున్నా లేనట్లే యమ ఘోరంగా!

  అదిరిపోయే పంచ్‌లతో ఇరికించి


  బాలయ్య 'Unstoppable with NBK 2' షోలోకి గెస్టులుగా వచ్చిన ప్రభాస్, గోపీచంద్ తమ స్నేహం గురించి, ప్రాజెక్టులు గురించి ఎన్నో విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. అలాగే, వీళ్లిద్దరూ కొన్ని గేమ్స్ కూడా ఆడారాని సమాచారం. ఇందులో ప్రభాస్‌ను బాలయ్య తనదైన ప్రశ్నలతో ఇరికించే ప్రయత్నం చేయగా.. వాటికి అతడు కూడా సరిగానే బదులిచ్చాడని తెలిసింది.

  గ్లింప్స్ వీడియో.. ఏం చెప్తున్నావ్

  గ్లింప్స్ వీడియో.. ఏం చెప్తున్నావ్

  బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'Unstoppable with NBK 2' షోలోకి గెస్టులుగా వచ్చిన ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇందులో బాలయ్య వాళ్లిద్దరితో కలిసి సరదాగా గడిపిన విజువల్స్‌ను చూపించారు. ఇక, ఈ వీడియోలో ప్రభాస్ 'ఏయ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్' అంటూ చెప్పిన ఓ డైలాగ్ హైలైట్ అయిపోతోంది.

  Bigg Boss Winner: రేవంత్‌కు బిగ్ షాక్.. ఫినాలేలో ఊహించని ఎలిమినేషన్.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

  బాలయ్య వార్నింగ్.. దండంతో

  బాలయ్య వార్నింగ్.. దండంతో

  తాజాగా వచ్చిన గ్లింప్స్ వీడియోలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అతడు అందరి ముందే దండం పెట్టినట్లు కూడా చూపించారు. దీంతో ఈ వీడియోకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రాబడుతూ వైరల్‌గా మారిపోయింది.

  English summary
  Nandamuri Balakrishna Doing Unstoppable with NBK Show Season 2 For Aha. Now Prabhas and Gopichand Episode Glimpse Gets Huge Response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X