Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2 ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాలకృష్ణతో బాహుబలి ఎపిసోడ్ ఇవాళే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ఇక ప్రభాస్ తాజాగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షోలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. అయితే రెండు పార్టులుగా రానున్న ఈ ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఇవాళే టెలీకాస్ట్ చేయనున్నారు.

ప్రోమోలు కూడా..
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ గోపీచంద్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆహా నుంచి అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన వరుస ప్రోమోలు కూడా విడుదలవుతున్నాయి. ఇక పార్ట్ వన్ ప్రీమియర్స్ డిసెంబర్ 30న, రెండో పార్ట్ ను జనవరి 6న విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించారు.

ఇవాళే త్వరగా..
కానీ ఇప్పుడు మొదటి పార్ట్ ను ఇవాళే అంటే డిసెంబర్ 29నే రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది ఆహా. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలిపింది తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. "డార్లింగ్ ఫ్యాన్స్ మీ కోరిక మేరకు.. మన బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ఈరోజే రిలీజ్ చేస్తున్నాం. ఇవాళే త్వరగా న్యూ ఇయర్ సంబురాలను ప్రారంభించేద్దాం. రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది" అని ట్విటర్ వేదికగా తెలిపారు.

మహారాజును ఆహ్వానిస్తూ..
ఇక అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ పాల్గొననున్నాడని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అందుకు అనుగుణంగానే ఎపిసోడ్ కు సంబంధించినన ఫొటోలు, గ్లింప్స్, ప్రోమో వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభించింది. మొదటి ప్రోమోలో మహారాజును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రభాస్ ని షోలోకి స్వాగతం పలికాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రభాస్ ఎంట్రీతో సెట్ మొత్తం ప్రేక్షకుల అరుపులు, కీకలతో మారుమోగిపోయింది.
|
పెళ్లి ఎప్పుడు..
సభాముఖంగా ప్రేమగా అడుగుతున్నాను.. నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య అంటే సరే డార్లింగ్ సార్ అని ప్రభాస్ అన్నాడు. మొన్న శర్వానంద్ వచ్చాడు. పెళ్లెప్పుడని అడిగా.. ప్రభాస్ తర్వాత అన్నాడు అని బాలకృష్ణ అంటే.. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనాలేమో అని అందరినీ నవ్వించాడు ప్రభాస్. నిన్ను ఒక స్పాట్ లో పెట్టి గేమ్ ఆడతాను అని బాలకృష్ణ అంటే ఎలాగు పెడతారని డిసైడ్ అయి వచ్చాను సార్ అని ప్రభాస్ అన్నాడు.