Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నేరుగా ఓటీటీలోకి రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ సినిమా.. తొలిసారిగా అలాంటి పాత్రలో!
తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసిన కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందచందాలతో గ్లామర్ షో చేసి ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. కానీ ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ అవ్వట్లేదు. అయినా అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన గ్లామర్ తో నార్త్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ఈ కూల్ బ్యూటి. అయితే ఇప్పటికే అక్షయ్ కుమార్ సరసన నటించిన కట్ పుట్లి తర్వాత మరో సినిమాను నేరుగా ఓటీటీలోకి తీసుకురానుంది ఈ ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్.

అనుకున్నంత స్థాయిలో..
తెలుగులో అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాందించుకున్న కూల్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడ అనేక సినిమాలు చేసిన అనంతరం చివరిగా తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపై పయనించింది. ప్రస్తుతం హిందీలో చేతినిండా ఫుల్ సినిమాలతో యమ బిజీగా ఉంది ఈ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇదివరకే ఆమె నటించిన రన్ వే 34, అటాక్, థ్యాంక్ గాడ్ విడుదలైన అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకాదరణను పొందలేకపోయాయి.

నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి..
ఈ సినిమాల అనంతరం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కట్ పుట్లి చిత్రంతో నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరో సినిమాతో నేరుగా ఓటీటీలోకి రానుంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ నటించిన బోల్డ్ మూవీ ఛత్రీవాలి. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే అందులో రకుల్ చేసే పాత్ర మాత్రం కాస్తా నోరేళ్లబెట్టేలా చేసింది. ఛత్రీవాలితో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటిస్తోంది. అంటే కండోమ్ క్వాలిటీని చెక్ చేసే యవతిగా కనిపించబోతోంది. అయితే ఇలాంటి పాత్రలో ఒక హీరోయిన్ కనిపించడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు.
ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా
ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించిన బోల్డ్ కంటెంట్ మూవీ ఛత్రీవాలను నేరుగా జీ5 ఓటీటీలో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. అయితే ఎప్పుడు విడుదల అవుతుందనే విషయం వెల్లడించలేదు. తేజస్ ప్రభ, విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2) మూవీలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా చందమామ కాజల్ అగర్వాల్ కూడా అట్రాక్ట్ చేయనుంది.