Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2లో ప్రభాస్ తో రామ్ చరణ్?.. డేటింగ్ రూమర్స్ పై రియాక్షన్!
మెగాస్టార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో తన కాలిబర్ చూపించాడు. ఇక ఇటీవల వచ్చిన RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ కనిపించిన తీరు యావత్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్, పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్ ను విజిల్స్ వేయించాయి. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపీచంద్ పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. ఇదే ఎపిసోడ్ లో చెర్రీ కూడా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎంతో ఎనర్జిటిక్ గా..
సినిమాల్లోనే కాకుండా డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చింది తెలిసిన సంగతే. ఈ షోలో బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జిటిక్ గా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ ను ఇటీవలే ప్రారంభించారు.

ఆహా ప్రకటించిన తర్వాత..
అన్‌స్టాపబుల్ గా సాగుతున్న అన్‌స్టాపబుల్ 2 సీజన్ తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అతని అత్యంత సన్నిహితుడు గోపీచంద్ కూడా హాజరైనట్లు ఆహా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆహా ప్రకటించిన తర్వాత ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ ను బాలకృష్ణ సరదాగా నవ్వించే మాటలు ఉన్నాయి. ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అయింది.

బాలకృష్ణ సరదా మాటలు..
లీకైన ఆ వీడియోలో ప్రభాస్ డ్రెస్సింగ్, సైజ్ లపై బాలకృష్ణ మాట్లాడారు. "నీ షర్టులు అన్నీ 3XL, 4XL యేనా" అని బాలకృష్ణ అడిగితే.. "నాకు షూలు దొరకడం కష్టం. నా షూ సైజ్ 13" అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. దీనికి బాలకృష్ణ "వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని" అని చెప్పారు. దీంతో ప్రభాస్ తో పాటు అక్కడున్న ప్రేక్షకులందరూ నవ్వేశారు. ఈ ఎపిసోడ్ ను న్యూ ఇయర్ సందర్భంగా ఆహాలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

రామ్ చరణ్ సందడి..
ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే అది ఫిజికల్ అప్పీరియన్స్ కాదు. కేవలం రామ్ చరణ్ తన గాత్రాన్ని వినిపించనున్నాడట. అంటే ఫోన్ కాల్ ద్వారా అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ లో వినిపించనున్నాడట రామ్ చరణ్. టాక్ షోలో భాగంగా రామ్ చరణ్ కు బాలకృష్ణ కాల్ చేసి ప్రభాస్ కి ఆశ్చర్యం కలిగించాడని టాక్ వినిపిస్తోంది.

డేటింగ్ రూమర్స్ పై..
వాయిస్ కాల్ లో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్టుల పట్ల రామ్ చరణ్ అభినందించాడని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అంతేకాకుండా తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పై కూడా ప్రభాస్ స్పందిస్తాడని, వీరిద్దరి సంభాషణ చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాలకృష్ణతో ప్రభాస్, రామ్ చరణ్ మధ్య చాటింగ్ సరదాగా సాగిందని సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజముందే ఎపిసోడ్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

వరుస ఎపిసోడ్స్ తో..
'Unstoppable with NBK 2' షో మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసి సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఈ ప్రముఖ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హాజరైన ఈ ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో వరుసగా ఎపిసోడ్స్ ను వదిలారు. అందులో యంగ్ హీరోల నుంచి సీనియర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పొలిటిషియన్స్ ఇలా ఎంతోమంది వచ్చి అలరించారు.