For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhamaka OTT: రవితేజ ధమాకా డిజిటల్ రైట్స్ వారికే.. ఓటీటీలో రిలీజ్ ఎప్పుడంటే?

  |

  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు రవితేజ. హిట్లు, ప్లాప్ లు అనే తేడా ఏం లేకుండా వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ వెనువెంటనే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరిచాడు. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కోరికతో తాజాగా ధమాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డబుల్ ఇంపాక్ట్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

  కమెడియన్ తో కామెడీ స్కిట్స్..

  కమెడియన్ తో కామెడీ స్కిట్స్..


  మాస్ మహరాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పెళ్లి సందD సినిమాతో గుర్తింపు తెచ్చుకున్ శ్రీలీలా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది. జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ ను జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదితో రాయించారని తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో కూడా హైపర్ ఆది గురించి రవితేజ బాగా మాట్లాడారు.

   కలెక్షన్ల పరంగా అలా..

  కలెక్షన్ల పరంగా అలా..

  ఇక డైరెక్టర్ త్రినాథ రావు, హైపర్ ఆది మంచి ఫ్రెండ్స్ అని టాక్. అందుకే హైపర్ ఆదికి ఈ సినిమాలో త్రినాథ రావు నక్కిన అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రవితేజ సినిమాలు అంటేనే అన్ని హంగులు ఉంటాయి. 'ధమాకా'లోనూ ఇదే ఫాలో అయ్యారు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఓ బడా కంపెనీకి సీఈవోగా మారి కార్పోరేట్ దిగ్గజాలను ఎలా ఎదుర్కొన్నాడు? అసలు అతడు ఎందుకలా రెండు పాత్రలు చేయాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది. అనేక అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదనిపిస్తోంది.

  ఓటీటీలోకి ఎప్పుడంటే..

  ఓటీటీలోకి ఎప్పుడంటే..


  రవితేజ మాస్ ధమాకా సినిమా థియేటర్ల పరంగా ఎలా ఉన్నా.. దీనికోసం ఓటీటీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల థియేటర్ల కంటే ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు అలవాటు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు రవితేజ ధమాకా సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఓటీటీ అభిమానులు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ అందుకుందని సమాచారం. సినిమా విడుదలైన నాలుగు వారాలకు అంటే నెలకు నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆహా కూడా ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. జనవరి చివరి వారంలో డిజిటల్ తెరపైకి రానున్న రవితేజ ధమాకా ఓటీటీ విడుదల పార్టనర్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

  English summary
  Ravi Teja And Director Trinadha Rao Nakkina Combination Movie Dhamaka Digital Rights To Netflix And Aha. Dhamaka OTT Release After 4 Weeks Of Theater Release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X