For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhamaka OTT: ఆ ఓటీటీలో ధమాకా స్ట్రీమింగ్.. థియేటర్‌కు మించిన సర్‌ప్రైజ్‌లతో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. గత ఏడాది అతడు వరుసగా 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి భారీ పరాజయాలను చవి చూసిన తర్వాత కూడా అస్సలు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే 'ధమాకా' అనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే భారీ స్థాయిలో రిలీజ్ అయింది.

  శృతి మించిన హీరోయిన్ హాట్ షో: బట్టలున్నా లేనట్లే.. మొత్తం కనిపించేలా!

  పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన 'ధమాకా' మూవీ గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దానికి అస్సలు సంబంధమే లేకుండా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో రవితేజ నటించిన ఈ మూవీకి దాదాపు రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను వారం లోపులోనే చేరుకోవడంతో పాటు వంద కోట్ల గ్రాస్‌ను కూడా వసూలు చేసింది. తద్వారా రవితేజ కెరీర్‌లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

  Ravi Teja Dhamaka Movie Streaming Starts on Netflix

  థియేటర్లలో దాదాపు మూడు వారాల పాట పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. దీన్ని నేటి (జవనరి 22వ తేదీ) నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో కొన్ని డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేసినట్లు తెలిసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నట్లు తెలిసింది.

  హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!

  రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సినిమానే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు.

  English summary
  Ravi Teja Did Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. This Movie Streaming Starts on Netflix.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X