Kantara 2 OTT Price: కాంతార 2 ఓటీటీ ధర.. రికార్డ్ ప్రైజ్‌కు రిషబ్ శెట్టి మూవీ
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి చివరిగా కాంతార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ పౌరాణిక చిత్రంగా ఈ మూవీ విడుదలైంది. తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో విడుదల చేశారు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.14 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.450 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
దేశ వ్యాప్తంగా కాంతార చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇక సీక్వెల్ ను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ కన్నడ స్టార్ రిషబ్ షెట్టి మాత్రం వినూత్నంగా ప్రీక్వెల్ ను ప్రకటించారు. ఇప్పటి వరకు చూపించిన కథకు ముందు ఏం జరిగిందనే విషయాలను మరింత వివరంగా ప్రేక్షకులకు తెలియజేయబోతున్నారు. ఈ సందర్భంగా కాంతారా : చాప్టర్ 1 గా కాంతార పార్ట్ 2ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోలోకి వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటికే కాంతార : చాప్టర్ 1 చిత్రం షూటింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ సంస్థ విడుదలకు సిద్ధం చేస్తోంది. ఈమూవీని రూ.125 కోట్లతో నిర్మాతలు విజయ్ కిరగందుర్, చలువే గౌడ్ నిర్మించారు. దసరా సందర్భంగా, గాంధీతాత పుట్టిన రోజున 2 అక్టోబర్ 2025న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. కన్నడ భాషతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఇందుకు థియేట్రికల్ రైట్స్ ను అన్ని రాష్ట్రాల వారీగా డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతూ గ్రాండ్ రిలీజ్ కు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో నాన్ థియేట్రికల్ హక్కుల్లో ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఏకంగా రూ.125 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుండటంతో సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సప్తమి గౌడ్ హీరోయిన్ గా అలరించనుంది. ఇక రిషబ్ శెట్టినే దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 20న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని 2,500+ థియేటర్లలో గ్రాండ్ పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించబోతుండటం విశేషం. దీంతో బాక్సాఫీస్ వద్ద కాంతార ఛాప్టర్ 1 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, వారాహి చలన చిత్రం వంటి టాప్ డిస్ట్రీబ్యూషన్ సంస్థలు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











