Don't Miss!
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Unstoppable 2 షోపై రోజా కామెంట్.. బాలకృష్ణ పిలిచినా ఎందుకు వెళ్ళలేదంటే?
అన్ స్టాపబుల్ షో ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాబోయే రోజుల్లో మరి కొంతమంది స్టార్ హీరోలు అలాగే రాజకీయ ప్రముఖులు సినిమా టెక్నీషియన్స్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ కేవలం తన పార్టీకి చెందిన రాజకీయ నాయకులను మాత్రమే కాకుండా ప్రత్యర్థి రాజకీయ నాయకులను కూడా షోలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రోజా కూడా రావచ్చు అని ఆ మధ్య టాక్ వచ్చింది. ఇక అది నిజమే అని ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా.. ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నకు కూడా ఆమె సమాధానం తెలియజేశారు..

ఫస్ట్ ఎపిసోడ్ లోనే..
అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ కంటే ఇప్పుడు రెండో సీజన్ పై అంచనాలు మరింత పెరిగాయి. రెండవ సీజన్ లోని మొదటి ఎపిసోడ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు కూడా బాలయ్య బాబుతో సందడి చేసిన విధానం అన్ని వర్గాల వారిని కూడా ఇంత ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహాలో కాంట్రవర్సీ కామెంట్స్ కూడా వెలువడ్డాయి.

రోజా రాబోతున్నట్లు
ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆ మధ్యలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ వైసీపీ నాయకురాలు రోజా కూడా బాలయ్య బాబు షోలో సందడి చేసే అవకాశం ఉన్నట్లు బలమైన టాక్ వినిపించింది. బాలయ్య బాబు స్వయంగా ఆమెను కాల్ చేసి షోలోకి రావాలి అని కూడా అడిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ విషయం పై రోజా క్లారిటీ ఇచ్చారు.

రోజా మాట్లాడుతూ..
సినిమా ఇండస్ట్రీలో అందరితోనూ కూడా నాకు చాలా మంచి అనుబంధాలు ఉన్నాయి. సీనియర్ హీరోలు అలాగే నేను వర్క్ చేసిన హీరోలు అందరూ కూడా ఎప్పుడు కలిసినా చాలా స్నేహంగా మాట్లాడుతారు. అంతే కాకుండా బాలకృష్ణ కూడా అసెంబ్లీలో కలిసిన చాలా సందర్భాలలో నాతో మాట్లాడారు. ఇక ఆయన వ్యక్తిగతంగా మాత్రం తనను ఎప్పుడూ కూడా మెచ్చుకుంటారుని.. కూడా రోజా చెప్పారు.

ఎప్పుడో పిలిచారు
బాలకృష్ణ గారు ఇప్పుడు నాతో ఒక మాట అనేవారు. మీ ముక్కు మీ కళ్ళు బట్టి మీరు దేవత గెటప్ అలాగే మహారాణి గెటప్ వేసిన కూడా అద్భుతంగా సెట్ అవుతుంది అని కరెక్ట్ గా దేవుడు మీకు అలా ఇచ్చేసాడు అని ఆయన ఎన్నోసార్లు అన్నారు. ఆయన నన్ను అన్ స్టాపబుల్ షోలోకి రమ్మని ఎప్పుడో పిలిచారు కానీ నేనే వెళ్లలేదు.

సినిమా వేరు పాలిటిక్స్ వేరు
ఎందుకంటే సినిమా వేరు పాలిటిక్స్ వేరు అని బాలకృష్ణ గారు కూడా నాతో ఇప్పుడు అదే అంటారు. నాకు మొన్న పుట్టినరోజున కూడా ఫోన్ చేసి విష్ చేశారు. చాలా బాగా మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నాతో బాగుండేవారు. కానీ పార్టీ మారిన తర్వాత నేనే కొంచెం వారితో మాట్లాడడానికి మొహమాట పడుతుంటాను.

భయపడి చేయట్లేదు..
వీలైతే అన్ స్టాపబుల్ చేద్దామని అన్నారు. కానీ దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి జగన్ సార్ దగ్గర ఏదైనా చెప్తారేమో.. నెగిటివ్ గా తీసుకుంటారేమో అని భయపడి నేను చేయలేదు.. అని రోజా అన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఒక మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను అంటూ.. జగన్ సార్ కూడా ఎప్పుడు ఎవరికీ ఇలాంటి కండిషన్స్ పెట్టింది లేదు. నేను వెళతాను అన్నా కూడా ఆయన దేనికి అడ్డు చెప్పరు. నా మీద వారికి చాలా నమ్మకం.. అని రోజా తెలియజేశారు.