Bigg Boss Telugu 6 శ్రీహాన్‌ను ముద్దులు, హగ్గులతో ముంచేసిన సిరి హన్మంతు.. బిగ్‌బాస్ ఇంటిలో ఓ రేంజ్‌లో రొమాన్స్

బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. ఇంకా రెండు, మూడు వారాల్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ షో, అత్యధిక రేటింగ్ సొంతం చేసుకొన్న ఈ రియాలిటీ షోలోకి కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ రావడంతో ఎమోషనల్‌గా మారిపోయింది. గత రెండు రోజులుగా ఆదిరెడ్డి ఫ్యామిలీ, ఫైమా తల్లి ఇంటిలోకి వచ్చి షోను ఎమోషనల్‌గా మార్చారు. అయితే బుధవారం అంటే నవంబర్ 23వ తేదీన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, శ్రీహాన్ ప్రేయసి సిరి హన్మంతు ఇంటిలో అడుగపెట్టి రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా శ్రీహాన్, సిరి హన్మంతు చేసిన రొమాన్స్ విషయంలోకి వెళితే..

 సిరి హన్మంతును చూసి శ్రీహాన్ కంటతడి

సిరి హన్మంతును చూసి శ్రీహాన్ కంటతడి


ఇంటి సభ్యులు బిగ్‌బాస్ కోచింగ్ సెంటర్ గేమ్ ఆడుతున్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహాన్ కోసం సిరి హన్మంతు వచ్చింది. ఆ సమయంలోనే శ్రీహాన్‌ను బిగ్‌బాస్ ఫ్రీజ్ చేశాడు. దాంతో అక్కడికి వచ్చిన సిరి హన్మంతును చూసి శ్రీహాన్ కంటతడి పెట్టాడు. శ్రీహాన్‌ను ఏడవడం చూసి సిరి హన్మంతు స్పందిస్తూ.. ఏంటి? ఎందుకు ఎడుస్తున్నావు అంటూ గట్టిగా కౌగిలించుకొన్నది.

 శ్రీహాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన సిరి

శ్రీహాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన సిరి


శ్రీహాన్ ఫ్రీజ్‌లో ఉండగానే.. సిరి హన్మంతు గట్టిగా వాటేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. గాఢంగా కౌగిలించుకొని.. నుదుడిపై ముద్దులు పెట్టింది. ఫ్రీజ్‌లో ఉండి.. కదలకుండా ఉండటంతో శ్రీహాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత బిగ్‌బాస్ శ్రీహాన్‌ను అన్ ఫ్రీజ్ చేసి.. సిరిని ఫ్రీజ్ చేశాడు. దాంతో శ్రీహాన్ రెచ్చిపోయాడు. చీరను ఆమెకు చుట్టేస్తుంటే.. రెండు గంటలు మేకప్ కోసం కష్టపడ్డాను అని సిరి హన్మంతు చెప్పింది.

సిరి హన్మంతు కొడుకు హల్‌చల్

సిరి హన్మంతు కొడుకు హల్‌చల్


ఇక శ్రీహాన్ కోసం సిరి హన్ముంతుతోపాటు తను పెంచుకొన్న అబ్బాయి కూడా బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చాడు. ఇంటిలోకి వచ్చిన సిరి హన్మంతు కొడుకు రచ్చ రచ్చ చేశాడు. శ్రీ సత్య, రోహిత్, రేవంత్, ఆదిరెడ్డితో ఆడుకొన్నాడు. ఇంటి సభ్యులను సిరి హన్మంతు కొడుకు ఆటపట్టించడం ఫీల్‌గుడ్‌గా కనిపించింది. సిరి హన్మంతు కొడుకు మాటలు, చేతలు వీక్షకులకు మంచి వినోదం పంచాడు.

సీతారామం పాటకు సిరి, శ్రీహన్ స్టెప్పులు

సీతారామం పాటకు సిరి, శ్రీహన్ స్టెప్పులు


ఇక బిగ్‌బాస్ ఒక పాట ప్లే చేయండి.. నేను శ్రీహాన్ డ్యాన్స్ చేస్తామని సిరి హన్మంతు కోరింది. దాంతో సీతారామం సినిమాలోని పాటను ప్లే చేయగా.. సిరి, శ్రీహాన్ రొమాంటిక్ స్టెప్పులతో రెచ్చిపోయారు. సిరిని ఎత్తుకొని శ్రీహాన్ గిరగిరా తిప్పేశాడు. ముద్దులు, కౌగిలింతతో ఇంటిని వేడెక్కించారు.

శ్రీహాన్‌కు గిఫ్గుగా ఉంగరం.. వేలికి తొడిగి

శ్రీహాన్‌కు గిఫ్గుగా ఉంగరం.. వేలికి తొడిగి


శ్రీహాన్‌తోపాటు ఇంటి సభ్యులందరితోను సిరి హన్మంతు చాలా సేపు మాట్లాడింది. చాలా సమయం గడిపిన తర్వాత సిరి హన్మంతు ఇంటిని విడిచి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు. దాంతో తన కొడుకుతోపాటు సిరి ఇంటిని విడిచి వెళ్లూ.. శ్రీహాన్‌కు ఓ రింగును వేలికి తొడిగింది. ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిన ఉంగరం.. ఎవరికీ ఇవ్వలేదు.. నీకు ఇస్తున్నాను అంటూ చెప్పి.. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయలుదేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X