Netflix బిజినెస్ షాకింగ్‌గా.. గత మూడు నెలల్లో ఆదాయం ఎంతంటే?

గత రెండు, మూడు సంవత్సరాల కాలంగా ఓటీటీ ఫాట్‌ఫామ్స్ హవా కొనసాగుతున్నది. లాక్‌డౌన్ కాలంలో థియేటర్లు మూత పడటంతో ఓటీటీ వైపు ప్రేక్షకులకు మొగ్గు చూపారు. దాంతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సంస్థలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా సినిమాలు, వెబ్ సిరీస్ లాంటివి రావడంతో ఈ సంస్థలకు ఖాతాదారులు భారీగా పెరిగారు. తాజాగా గతేడాది నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ ఖాతాదారులను గణనీయంగా పెంచుకొన్నట్టు తాజా వెల్లడించింది.

ప్రస్తుత ఏడాదిలో నెట్‌ఫ్లిక్స్ 221.6 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ను సొంతం చేసుకొన్నది. గత ఏడాది చివరి మూడు నెలల పోల్చుకొంటే.. స్వల్పంగా తగ్గినప్పటికీ.. పోటీదారుల కంటే ముందు ఉన్నట్టు తెలుస్తున్నది. తాజా సమాచారం ప్రకారం.. 222 మిలియన్ల గృహాలకు నెట్‌ఫ్లిక్స్ సేవలు అందుతున్నాయి.

 Slight dip in Netflix Revenue and Subscribers count in year 2022

నెట్‌ఫ్లిక్స్ నికర ఆదాయం విషయానికి వ్తే.. గతేడాది చివరి త్రైమాసికంలో 1.6 బిలయన్ డాలర్లను రాబట్టింది. గతేడాది చివరి త్రైమాసికంలో 1.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. తమ ఆదాయ రాబడిపై నెటిఫ్లిక్స్ స్పందిస్తూ.. మేము ఊహించినట్టుగా మా రెవెన్యూ వనరులు పెరగడం లేదు అంటూ కామెంట్ చేసింది. కోవిడ్ కారణంగా 2020లో మా బిజినెస్ భారీగా పెరిగింది. అదే కోవిడ్ కారణంగా 2021లో గణనీయంగా మా వృద్దిరేటు తగ్గింది అని పేర్కొన్నది. క్వాలిటీ ఇంటర్నెట్ అందలేకపోవడం, కోవిడ్ సమయంలో తమ సొంత ఇంటికి ప్రజలు దూరంగా ఉండటం లాంటి అంశాలు మా ఆదాయంపై భారీగా ప్రభావం చూపాయి అని నెట్‌ఫ్లిక్స్ రెప్పింది.

ఖాతాదారులను పెంచుకోవడం, మంచి కంటెంట్‌తో నెటిజన్లను ఆకర్షించే పనిలో ఉన్నాం. ముఖ్యంగా క్వాలిటీతో కూడిన కార్యక్రమాలను, సినిమాలను, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అనేక రకాల ప్లాన్స్ మా ముందు ఉన్నాయి అని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X