For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sushmita Sen Taali Biopic లో పవర్‌‌పుల్ ట్రాన్స్‌జెండర్‌గా.. ఎవరీ శ్రీగౌరీ సావంత్ ఎవరు?

  |

  అందం, అభినయంతో మెప్పించిన విశ్వసుందరి సుస్మితా సేన్ నటనపరంగా ఆచితూచి చిత్రాలను చేస్తున్నది. గత కొన్నేళ్లుగా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌కు అంటిముట్టనట్టు ఉంటున్నది. అయితే ఇటీవల ఎమోషనల్ కంటెంట్, పవర్ ఫుల్ పాత్రతో వెబ్ సిరీస్ ద్వారా సుస్మితసేన్ ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చింది. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ బయోపిక్‌లో నటించేందుకు సిద్దమవుతున్నది. ట్రాన్స్‌జెండర్‌ ఎవరు? ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

  ఆర్య వెబ్ సిరీస్ తర్వాత

  ఆర్య వెబ్ సిరీస్ తర్వాత

  సుస్మితాసేన్ నటించిన ఆర్య వెబ్ సిరీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో ముందుకు తీసుకెళ్లింది. వన్ ఉమెన్ షోతో ప్రేక్షకుల మనసులను దోచుకొన్నది. ఈ వెబ్ సిరీస్‌లో ఆమె పెర్ఫార్మెన్స్‌ను ఇంకా మరిచిపోకముందే.. బయోపిక్‌గా రూపొందుతున్న మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దమవుతున్నారు.

  శ్రీగౌరీ సావంత్ బయోపిక్‌లో

  శ్రీగౌరీ సావంత్ బయోపిక్‌లో


  శ్రీగౌరీ సావంత్ జీవితం ఆధారంగా రూపొందే తాలి బయోపిక్‌లో సుస్మితాసేన్ నటిస్తున్నది. ఈ సినిమా పేరును తాలిగా ఖరారు చేశారు. బలమైన కథతో రూపొందుతున్న చిత్రానికి రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ సింగ్ బారన్, కార్తీక్ ది నిషాన్‌దార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే షూట్‌ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అఫీఫా నడియావాలా నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాను వాయాకామ్ మోషన్ పిక్చర్స్ సమర్పిస్తున్నది.

  ఎవరీ శ్రీగౌరి సావంత్

  ఎవరీ శ్రీగౌరి సావంత్


  శ్రీగౌరీ సావంత్ పుణేలో గణేష్‌గా జన్మించింది. ఏడో ఏట తన తల్లిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తన జీవితంలో విషాదం నుంచి బయటపడుతున్న సమయంలోనే ట్రాన్స్‌జెండర్‌గా మారాలని నిర్ణయం తీసుకొన్నది. పోలీస్ ఆఫీసరైన తండ్రిని ఇబ్బంది పెట్టుకుండా ఉండేలా ఇంటి నుంచి పారిపోయి ట్రాన్స్ జెండర్‌గా మారింది.

  ట్రాన్స్‌జెండర్లకు దత్తత హక్కులు

  ట్రాన్స్‌జెండర్లకు దత్తత హక్కులు


  అయితే గణేష్ అనే యువకుడిగా పుట్టి శ్రీగౌరీ సావంత్ అనే ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఆమె.. 2018లో ఒక అనాథను దత్తత చేసుకొనే హక్కులను ట్రాన్స్‌జెండర్లకు కల్పించాలనే పోరాటం చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత గాయత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకొన్నది. సఖి అనే స్వచ్చంద సంస్థతో కలిసి సేఫ్ సెక్స్‌ను ప్రమోట్ చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.

  కౌన్ బనేగా కరోడ్‌పతిలో భారీగా

  కౌన్ బనేగా కరోడ్‌పతిలో భారీగా


  శ్రీగౌరీ సావంత్ తన పోరాటాన్ని అంతటితో ఆపలేదు. ట్రాన్స్‌జెండర్లను మూడో జెండర్‌గా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీలో కేసు వేసిన వారిలో ఆమె కూడా ఒకరు. అంతేకాకుండా సఖీ చార్ చౌగీ ట్రస్ట్‌ను స్థాపించారు ఇటీవల అమితాబ్ హోస్టుగా సాగే కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్నారు. అందులో గెలిచిన మొత్తాన్ని సెక్స్ వర్కర్ల ఇళ్ల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం శ్రీగౌరీ జీవితాన్ని తెర మీద పండించేందుకు సుస్మితా సేన్ రెడీ అవుతున్నారు.

  English summary
  Sushmita Sen to star in Shreegauri sawant biopic... #SushmitaSen will head the cast of #Taali, the biopic on #ShreegauriSawant... The web series is directed by #RaviJadhav... The show is created by #ArjunSingghBaran and #KartkDNishandar... Shoot has commenced... First glimpse...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X