For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్యాన్స్ షోలో బిగ్ బాస్ శ్రీసత్య, అతనికి పార్టనర్ గా.. ఇది ఫస్ట్ నైట్ కాదంటూ జడ్జ్ షాకింగ్ కామెంట్స్!

  |

  ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇటీవల పూర్తయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ తో పాటు ఓటీటీ రెండో సీజన్ ను కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్లు వచ్చే వరకు ఉన్న గ్యాప్ లో బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన చేసేందుకు రియాలిటీ డ్యాన్స్ షోతో ముందుకు వచ్చారు మేకర్స్. బీబీ జోడీ పేరుతో తీసుకొచ్చిన ఈ డ్యాన్స్ షోలో గత సీజన్లలోని కంటెస్టెంట్లు తమ హాట్ పర్ఫామెన్స్ లతో అదరగొడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ డ్యాన్స్ షోలోకి శ్రీసత్య ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీపై జడ్జ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

  హాట్ టాపిక్ గా శ్రీసత్య పార్టనర్..

  హాట్ టాపిక్ గా శ్రీసత్య పార్టనర్..

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కల్యాణ్ ఎంత పడినా తను మాత్రం హద్దుల్లో ఉంది. అలాగే అర్జున్ కల్యాణ్ ను గేమ్ పరంగా శ్రీసత్య బాగా వాడుకుందని విమర్శలు వినిపించాయి. అయిన శ్రీసత్య వెంట పడిన అబ్బాయిగా అర్జున్ కల్యాణ్ పేరు తెచ్చుకున్నాడు. దీంతో వీళ్ల ఇద్దరి రిలేషన్ పై ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో బీబీ జోడీకి శ్రీసత్య ఎవరి పార్టనర్ గా వెళ్లిందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.

  న్యాయనిర్ణేతలుగా హీరోయిన్స్..

  న్యాయనిర్ణేతలుగా హీరోయిన్స్..

  బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా ఉన్నారు. వీరందరికి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది. అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ జడ్జ్ లుగా ఉన్నారు.

  శ్రీసత్యపై కామెంట్..

  శ్రీసత్యపై కామెంట్..

  బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా తర్వాత వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎంట్రీ ఇచ్చిన శ్రీసత్యపై జడ్జ్ తరుణ్ మాస్టార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

  ఇది గంగిరెద్దు గెటప్పా..

  ఇది గంగిరెద్దు గెటప్పా..

  బీబీ జోడీ తాజా ఎపిసోడ్ ప్రోమోలో.. జోడీలందరూ తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. అయితే ఆర్జే చైతూ జినీ గెటప్ లో ఉన్నాడు. తన తలపై ఉన్న హెయిర్ చూసి ఏంటీ ఇది సంక్రాంతి పండుగకు గంగిరెద్దు గెటప్పా అని నవ్వించింది యాంకర్ శ్రీముఖి. తర్వాత ఈ గంగిరెద్దుకు ఒకటే కొమ్ము ఉంది అని తేజస్వి అంది. దీంతో అవును మొన్నటి మీ పర్ఫామెన్స్ తో సోషల్ మీడియాలో చాలా గట్టిగా ఉన్నట్లు ఉంది అని కౌంటర్ వేసింది యాంకర్ శ్రీముఖి.

  పండగ పూట కూడా పాత పార్టనరేనా..

  పండగ పూట కూడా పాత పార్టనరేనా..

  అవినాష్ తో మాట్లాడుతూ అదంతా పక్కన పెట్టు.. ఆ మెహబూబ్ గాడు ఇంకా ఒంటరిగా ఏకాకిలానే ఉన్నాడా వాడు అని యాంకర్ శ్రీముఖి అనగానే మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. అషు ఒప్పుకుందా అని యాంకర్ శ్రీముఖి అడిగితే.. పండగ పూట కూడా పాత పార్టనరే ఎందుకు అని మెహబాబ్ అన్నాడు. అప్పుడు సౌందర్య లహరి పాట తరహాలో మొహంపై చున్నీతో ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది.

  ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ లేదంటూ..

  అప్పుడు ఆ మొహం ఎవరిదా అని వంగి చూసేందుకు ప్రయత్నించాడు రవికృష్ణ. తర్వాత ఇది డ్యాన్స్ షో.. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ లేదు అని తరుణ్ మాస్టార్ షాకింగ్ కామెంట్ చేశాడు. దీంతో అందరూ తెగ నవ్వేశారు. అప్పుడు కంగారుగా చున్నీని పైకి తీసింది బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ శ్రీ సత్య. ఆమెను చూసి అంతా షాక్ అవ్వడంతో పాటు సంతోషించారు. తర్వాత మెహబూబ్ -శ్రీ సత్య కలిసి డ్యాన్స్ చేశారు. వాళ్ల డ్యాన్స్ చూసిన సదా.. నేను నిజంగా ఊహించలేదు అని కాంప్లిమెంట్ ఇచ్చింది. తర్వాత అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన డ్యాన్స్ తో అలరించారు.

  English summary
  Bigg Boss Telugu 6 Contestant Sri Satya Entry Into BB Jodi With Mahaboob Shaikh And Tarun Master Shocking Comments On Sri Satya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X