మిరాయ్ ఓటీటీ రైట్స్ కు భారీ ధర.. తేజా సజ్జా మూవీకి ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ ను కూడా ఆగస్టు28న గ్రాండ్ గా విడుదల చేశారు. ట్రైలర్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం విడుదల కావడానికి ఇంకా 15 రోజుల సమయం ఉంది. కాస్తా ముందుగానే ప్రమోషన్స్ ను ప్రారంభించారు.
అయితే, ఇప్పటికే తేజా సజ్జా సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. గతేడాది జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన హను-మ్యాన్ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సూపర్ హీరో ఫిల్మ్ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్ వైడ్ గా సంచలనంగా మారింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న హను-మ్యాన్ చిత్రం రూ.350 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా తేజా సజ్జా నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రానికి మరింతగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీవీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ మరింత క్వాలిటీగా మిరాయ్ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడం విశేషం. రూ.40 కోట్లకు పైగానే ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్, థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి ఎన్ని కోట్ల బిజినెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికంగా మారింది. కాగా మిరాయ్ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
మిరాయ్ చిత్రం క్వాలిటీ, విజువల్స్, యాక్షన్, కథ పరంగా ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. సినిమాపై మేకర్స్ ఆసక్తిని పెంచేలా అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మిరాయ్ చిత్రానికి నాన్ థియేట్రికల్ (డిజిటల్ + శాటిలైట్ + మ్యూజిక్) రైట్స్ ద్వారా రూ.50 కోట్లకు పైగా ధర పలుకుతోందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం సినిమాకు బజ్ మంచిగానే ఉండటంతో ఫైనల్ రేట్ ఎంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక మిరాయ్ చిత్రం 2025 సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో రూపుదిద్దుకున్న ఈచిత్రం తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో డబ్డ్ వెర్షన్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా మిరాయ్ సౌండ్ వినిపించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియా, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. గౌర హరి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











