For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Telugu Indian Idol: పర్సనల్ లైఫ్‌పై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. తొలిసారి భార్యను లాగుతూ ఇలా!

  |

  ప్రస్తుతం పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రాధాన్యత భారీగా పెరుగుతోంది. గతంలో సినిమానో, సీరియల్‌నో చూడాలంటే టీవీలకు అతుక్కుపోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఓటీటీల వల్ల సెల్‌ఫోన్‌లోనే సమస్తం లభ్యం అవుతోంది. దీంతో వీటి వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.

  ఇందులో సరికొత్త కార్యక్రమాలు, జనాలు మెచ్చే సినిమాలు, స్పెషల్ వెబ్ సిరీస్‌లు, షోలు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే సింగింగ్ టాలెంట్‌ను వెలికి తీసేందుకు 'తెలుగు ఇండియన్ ఐడల్' అనే షోను పరిచయం చేశారు. దీనికి గెస్టుగా వచ్చిన నందమూరి బాలకృష్ణ రచ్చ రచ్చ చేశారు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  సింగింగ్ టాలెంట్‌ను తీసుకొచ్చి

  సింగింగ్ టాలెంట్‌ను తీసుకొచ్చి

  తెలుగు గడ్డపై సింగింగ్ టాలెంట్‌ను గుర్తించేందుకు ఆహా తీసుకొచ్చిన షోనే 'తెలుగు ఇండియన్ ఐడల్'. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యా మీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామచంద్ర హోస్ట్‌గా చేస్తున్నాడు. ఇది 32 ఎపిసోడ్ల పాటు సాగబోతున్నట్లు తెలిసింది. ఈ షో ఆడిషన్స్ కోసం కొన్ని వందల మంది వచ్చిన విషయం తెలిసిందే.

  మరోసారి రష్మిక మందన్నా హాట్ ట్రీట్: ఎద భాగం కనిపించేలా ఘాటుగా!

  మంచి రెస్పాన్స్.. సూపర్ హిట్

  మంచి రెస్పాన్స్.. సూపర్ హిట్

  ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే 'తెలుగు ఇండియన్ ఐడల్' షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఇప్పటి వరకూ దీనికి సంబంధించి 28 ఎపిసోడ్స్ పూర్తి అవగా.. అన్ని అదిరే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులోకి సెలెబ్రిటీలు గెస్టులుగా వచ్చిన ఎపిసోడ్స్ మరింత హిట్ అయ్యాయి. ఫలితంగా ఈ షో సూపర్ సక్సెస్ అయింది.

  సెమీ ఫైనల్స్‌కు బాలయ్య రాక

  సెమీ ఫైనల్స్‌కు బాలయ్య రాక

  దాదాపు పదిహేను వారాల పాటు సాగిన 'తెలుగు ఇండియన్ ఐడల్' షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు సెమీ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఇందులో ఆరుగురు కంటెస్టెంట్స్ శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవిలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లను ఫినాలేకు చేర్చేందుకు జూన్ 3 నుండి జూన్ 6 ఉదయం 7 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.

  డ్రెస్ విప్పేసి షాకిచ్చిన అమలా పాల్: ఎద అందాలు కనిపించేలా ఘోరంగా!

  స్టెప్పులు.. పాటలతో సందడిగా

  స్టెప్పులు.. పాటలతో సందడిగా

  'తెలుగు ఇండియన్ ఐడల్' సెమీ ఫైనల్ ఎపిసోడ్ జూన్ 10న సాయంత్రం 9 గంటలకు జరగబోతుంది. దీనికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు ఉష ఉత్తుప్ కూడా వచ్చారు. ఇందులో బాలయ్య 'క్యాజువల్‌గా రాలేదు.. కాంపిటీషన్‌కు వచ్చా.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ను' అన్నారు. అలాగే, తనదైన స్టెప్పులు, పాటలు, ఎనర్జీతో సందడి చేశారు.

  కంటెస్టెంట్లకు గిఫ్ట్‌లు ఇచ్చారు

  కంటెస్టెంట్లకు గిఫ్ట్‌లు ఇచ్చారు

  'తెలుగు ఇండియన్ ఐడల్' షోలో భాగంగా నందమూరి బాలకృష్ణ కంటెస్టెంట్లు పాడిన పాటలను తెగ ఎంజాయ్ చేశారు. శ్రీనివాస్ 'అఖండ' మూవీ టైటిల్ సాంగ్‌ను ఆలపించగా.. ఆయన పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. ఆ వెంటనే ఆ సింగర్‌కు ఓ బుక్ గిఫ్లుగా ఇచ్చారు. ఆ తర్వాత ఓ లేడీ కంటెస్టెంట్‌కు లౌడ్ స్పీకర్‌ను అందించారు. ఇలా ఆయన తెగ నవ్వించేశారు.

  Poorna Gets Engaged: కోటీశ్వరుడితో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!

  పర్సనల్ లైఫ్‌పై భార్యను లాగి

  అఖండ పాట పాడిన శ్రీనివాస్‌తో బాలయ్య 'పెళ్లి కాబోతుందంటగా.. పెళ్లి ఎప్పుడు అని అడగను. ఎందుకయ్యా పెళ్లి అంటాను. నీకో గిఫ్ట్ తెచ్చా చూడు' అని తాను రాసినట్లుగా ఉన్న 'భార్యను ఏమార్చడం ఎలా' అనే బుక్‌ను ఇచ్చారు. ఆ తర్వాత బాలయ్య 'ఈ ఒక్క బిట్ మా ఇంట్లో టెలికాస్ట్ కాకూడదు. వసుంధర గారు చూసిందనుకో దబ్బిడి దిబ్బిడే' అంటూ కామెంట్ చేశారు.

  పూజా హెగ్డే అంటూ.. గతలతో

  పూజా హెగ్డే అంటూ.. గతలతో

  మరో లేడీ కంటెస్టెంట్ స్టేజ్‌ మీదకు రాగానే బాలయ్య 'కంటెస్టెంట్లు అందరూ కొత్త వాళ్లు అన్నారు. మరి పూజా హెగ్డేను పిలిచారేంటి' అంటూ పంచ్ పేల్చారు. దీంతో అందరూ నవ్వుకున్నారు. ఇక, చివర్లో బాలయ్య కళ్లకు గంతలు కట్టి జడ్జ్‌లు అందరూ కలిసి ఒక సర్‌ప్రైజ్ ఉందంటూ స్టేజ్ మీదకు తీసుకుని వెళ్లారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

  English summary
  Famous OTT Platform Aha Conduting Telugu Indian Idol Show Successfully. Nandamuri Balakrishna Grace This Show for An Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X