Thamma OTT Release: థామా ఓటీటీ రిలీజ్.. రష్మిక మందన్న మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన హార్రర్ కామెడీ చిత్రం థామా. బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహిలు గెస్ట్ రోల్స్ చేశారు. థామా సినిమాకు సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ సంగీత దర్శకత్వం వహించారు. అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు పరిశీలిస్తే..
థామా బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో థామా చిత్రంపై బాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి థామా చిత్రానికి సుమారుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్న మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో థామాను వరల్డ్ వైడ్‌గా 3500 స్క్రీన్స్‌లో ప్రదర్శించారు. తొలి రోజు ఏకంగా 12000 షోలు ప్రదర్శితమైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

థామా కలెక్షన్స్
థామాకు ఇండియా వైడ్‌గా తొలిరోజున 24 కోట్ల రూపాయలు, రెండో రోజున 18.6 కోట్ల రూపాయలు, మూడో రోజున 13 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10 కోట్ల రూపాయలు, ఐదో రోజున 13 కోట్ల రూపాయలు చొప్పున వసూళ్లు వచ్చాయి. దాంతో ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఇండియాలో 78.6 కోట్ల రూపాయల నికర వసూళ్లు... 94.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు నార్త్ అమెరికా సహా గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్ నుంచి 11.3 కోట్ల రూపాయలు వచ్చాయి. దాంతో కేవలం 5 రోజుల్లోనే థామా చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. 5 రోజుల్లోనే థామా సినిమాకు వరల్డ్ వైడ్‌గా 105 కోట్ల రూపాయలు వచ్చాయి.
తెలుగులో థామా కలెక్షన్స్.. పరిశీలిస్తే ఈ సినిమాకు తొలి రోజున 25 లక్షల రూపాయలు, రెండో రోజున 10 లక్షల రూపాయలు, మూడో రోజున 10 లక్షల రూపాయలు, నాలుగో రోజున 10 లక్షల రూపాయలు, ఐదో రోజున 10 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. కేవలం హిందీ నుంచి మాత్రమే థామాకు చెప్పుకోదగ్గ ఆదరణ లభిస్తోంది. థామాతో రష్మిక మందన్న మరోసారి 100 కోట్ల మూవీని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆయుష్మాన్ కెరీర్‌లో తన అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 6వ స్థానంలో నిలిచింది థామా. అలాగే మదోక్ హార్రర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన వాటిలో థామా నాలుగో స్థానంలో నిలిచింది. 800 కోట్లకు పైగా వసూళ్లతో స్త్రీ 2 ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
థామా ఏ ఓటీటీలో అంటే?
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానాల సినిమాను దక్కించుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ కళ్లు చెదిరే ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలనే ఒప్పందం మీద డీల్ కుదిరింది. దీనిని బట్టి థామా చిత్రం డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ కానుంది. థామా ఓటీటీ రిలీజ్‌పై అమెజాన్ ప్రైమ్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











