This week OTT Movies:ఈ వారం ఓటీటీ లవర్స్ పండుగ.. ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయంటే..!

OTT releases this week: ప్రతి వారం సినిమా లవర్స్ థియేటర్ రిలీజ్ తో పాటు ఓటీటీ సినిమాలను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. గత నెల చివర్లో విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ', ఈ నెల ప్రారంభంలో 'కాంతార చాప్టర్ 1' సినిమాలు బాక్సాఫీస్‌లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఈ వారంలో కూడా వినోదాన్ని పంచేందుకు కొన్ని కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సాయి కుమార్, అనసూయ, వినోద్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'అరి' అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందిన 'శశివదనే' కూడా అదే రోజు థియేటర్లలో అందుబాటులోకి వస్తోంది.

అదే సమయంలో కొత్త బంగారు లోకం హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తరువాత 'కానిస్టేబుల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కూడా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నాయి. ఇక మొత్తం మీద, ఈ వారం థియేటర్ ప్రియుల కోసం వినోద పండుగగా మారబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకుల కోసం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో యాక్షన్, థ్రిల్లర్, మైథాలజికల్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ జానర్లలో ప్రాజెక్టులు విడుదలకానున్నాయి. ఈ కథనం ద్వారా వీటి పూర్తి వివరాలు మీ కోసం..

This Week s Theatrical and OTT Releases War 2 Mirai Madharaasi Lead the Lineup

వార్ 2 (War 2)

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ఓటీటీలోకి రాబోతుంది. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అయితే, అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళ్ వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ కు ముందే హృతిక్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ డిజిటల్ ప్రీమియర్ తో 'వార్ 2' ప్రేక్షకులను చేరబోతోంది, థియేటర్‌లో చూడని వారు నెట్‌ఫ్లిక్స్ వేదికలో చూడండి.

మిరాయ్ (Mirai)
తెలుగు హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ మిరాయ్. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఇలాంటి బ్లాక్ బాస్టర్ మూవీ ఈ వారంలో ఓటీటీలో సందడి చేయనుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్‌లో హిట్‌గా నిలిచింది. పురాణ నేపథ్యం, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, వీఎఫ్ఎక్స్ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిరాయ్ అక్టోబర్ 10న జియో హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మదరాసి (Madharaasi)
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'దర్బార్'సినిమాను తెరకెక్కిన ఎ.ఆర్. మురుగదాస్.. ఐదేండ్ల తరువాత మరో యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా పేరు 'మదరాసి' (Madharaasi). అలాగే.. హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన 'అమరన్' ఇటీవల 300 కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలోఈ సినిమాపై భారీఅంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన 'మదరాసి' ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ గా మారింది. ఇక అక్టోబర్ 1 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది.

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న వెబ్ సిరీస్‌లలో:

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ వారం:

డా. సెస్సూస్ హార్టన్ (Dr. Seuss's Horton!) పిల్లల కోసం యానిమేటెడ్‌ సిరీస్‌, అక్టోబర్‌ 6 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.
ట్రూ హాంటింగ్ (True Haunting) నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన హారర్‌ సిరీస్‌. ఈ సిరీస్ అక్టోబర్‌ 7న రాబోతోంది.
ఇజ్ ఇట్ కేక్? హాలోవీన్ (Is It Cake? Halloween) హాలోవీన్‌ థీమ్‌ క్రియేటివ్‌ బేకింగ్‌ షో, అక్టోబర్‌ 8న స్ట్రీమింగ్‌ కాబోతుంది.
ది రిసరెక్టెడ్ (The Resurrected) సైకాలజికల్‌ థ్రిల్లర్‌, రహస్యాలు, పునర్జన్మ అంశాలతో రూపొందించిన సిరీస్ ఇది, ఈ సిరీస్ అక్టోబర్‌ 8న విడుదల కాబోతుంది.
కురుక్షేత్ర (Kurukshetra) మహాభారతం 18 యోధుల దృష్టిలో చెప్పబడిన అనిమేటెడ్‌ సిరీస్‌, అక్టోబర్‌ 10న స్ట్రీమింగ్‌ కాబోతుంది.

డిస్నీ + హాట్ స్టార్ (Disney+ Hotstar)

సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (Search: The Naina Murder Case) రహస్య హత్యా కేసు ఆధారంగా రూపొందిన థ్రిల్లర్‌, అక్టోబర్‌ 10న స్ట్రీమింగ్‌ కానున్నది.జీ న్యూస్ ఈ వారంలో.. వెడువాన్ (Veduvan) ప్రేమ‌, మోసం‌, భావోద్వేగాలతో నిండిన డ్రామా సిరీస్‌, అక్టోబర్‌ 10న స్ట్రీమింగ్ కానున్నది.

More from Filmibeat

Read more about: ott movies mirai war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X