Masooda OTT Release: బాక్సాఫీస్ వద్ద బెస్ట్ ప్రాఫిట్స్ అందించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తున్న సినిమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. జనాలు స్టార్స్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటేనే సినిమాను చూడడానికి థియేటర్ల వరకు వస్తున్నారు. ఇక పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మసూద సినిమా కూడా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టీజర్ ట్రైలర్ తోనే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక సినిమా విడుదల తర్వాత పర్ఫెక్ట్ హారర్ మూవీ అని తెలియడంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. పెట్టిన పెట్టుబడికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డబుల్ ప్రాఫిట్ అందించింది. మొదట లిమిటెడ్ థియేటర్లులోనే విడుదల చేశారు. ఇక ఆ తరువాత మెల్లగా థియేటర్స్ సంఖ్యను కూడా పెంచారు. ఇక ఈ సినిమాలో పెద్దగా క్యాస్ట్ కూడా లేదు. సీనియర్ నటి సంగీతం ప్రధాన పాత్రలో నటించగా కావ్య కళ్యాణ్ రామ్, తిరువీర్ ముఖ్యమైన పాత్రలో నటించారు.

Tollywood horror movie Masooda ott release date streaming platform

ఈ సినిమా హారర్ ప్రేక్షకులకు అయితే చాలా బాగా నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రాహుల్ యాదవ్ ఈ సినిమాలో నిర్మించగా కొత్త దర్శకుడు సాయికిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక మసూద సినిమా ఓడిటీలో ఎప్పుడు వస్తుందా అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అసలైతే ఈ వారమే రిలీజ్ అవుతుందని కొన్ని డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tollywood horror movie Masooda ott release date streaming platform

ఇక మొత్తానికి ఇటీవల అధికారికంగా ఒక క్లారిటీ వచ్చింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో డిసెంబర్ 21 నుంచి మసూద స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికి కూడా ఈ సినిమా థియేటర్స్ లో కొనసాగుతోంది. అలాగే ఓటీటీలో కూడా ఈ సినిమాను చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి అక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X