For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  OTT: ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ మీరు చూశారా?

  |

  కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు అందరి ఆలోచన ధోరణి మారిపోయింది. ముఖ్యంగా సినీ ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు మూస ధోరణిలో ఉండే సినిమాలకంటే విభిన్నమైన కథా కథనాలతో తెరకెక్కించే చిత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా చక్కని ప్లాట్ ఫామ్స్ గా ఎంటర్టైన్ మెంట్ కేరాఫ్ అడ్డగా మారాయి ఓటీటీలు. ఈ ఓటీటీ వేదికల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లపై ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఆసక్తిని గమనించిన ప్రముఖ సర్వే మీడియా ఓర్మాక్స్ తాజాగా ఓ జాబితా విడుదల చేసింది.

  దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రథమ స్థానాల్లో ట్రెండ్ అయ్యే హీరోలు, హీరోయిన్ల పేర్లను స్థానాలతో సహా ప్రకటిస్తుంది ఓర్మాక్స్ మీడియా సంస్థ. ఎక్కువగా ట్రెండ్ అయ్యే హీరోలు, హీరోయిన్లు ఎవరా అనే సర్వే చేసి ఎప్పటికప్పుడు ఈ జాబితాను రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దేశంలో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్యలో ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన టాప్ 10 ఓటీటీ ఒరిజినల్స్ జాబితాను పోస్ట్ చేసింది. మరి అవేంటో ఓ లుక్కేద్దామా!

  టాప్ 1 లో ది రింగ్స్ ఆఫ్ పవర్ (The Rings Of Power)

  టాప్ 1 లో ది రింగ్స్ ఆఫ్ పవర్ (The Rings Of Power)

  అత్యంత ప్రజాధారణ పొందిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా ఆధారంగా తెరకెక్కింది ఈ వెబ్ సిరీస్. ది హాబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాల్లోని కథకు సుమారు 1000 సంవత్సరాల ముందు ఏం జరిగిందనేది ఈ ది రింగ్స్ ఆఫ్ ది పవర్ స్టోరి. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 14 వరకు మొత్తంగా 8 ఎపిసోడ్ లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాయి.

   రెండో స్థానంలో క్రిమినల్ జస్టీస్: అధుర సచ్ (Criminal Justice: Adhura Sach)

  రెండో స్థానంలో క్రిమినల్ జస్టీస్: అధుర సచ్ (Criminal Justice: Adhura Sach)

  బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి, కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ప్రధానా తారగణంగా ఈ క్రిమినల్ జస్టీస్: అధుర సచ్ తెరకెక్కింది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ క్రిమినల్ జస్టీస్ కు కొనసాగింపుగా మూడో సీజన్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 26 నుంచి ప్రసారం అవుతోంది.

  థర్డ్ ప్లేస్ లో హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్ (House Of The Dragon)

  థర్డ్ ప్లేస్ లో హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్ (House Of The Dragon)

  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సూపర్ పాపులర్ వెబ్ సిరీస్ కు 200 ఏళ్లకు ముందు జరిగిన కథగా హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్ రూపొందింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్ వెబ్ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్నాయి. ఒక్కో ఎపిసోడ్ ను ఆగస్టు 21 నుంచి అక్టోబర్ 23 వరకు విడుదల కానున్నాయి.

  టాప్ 4లో దహన్ (Dahan)

  టాప్ 4లో దహన్ (Dahan)

  శిలాస్ పుర అనే గ్రామానికి వెళ్లిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ కు విభిన్నమైన సంఘటనలు ఎదురవతుంటాయి. థ్రిల్లర్ అండ్ జాంబీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్ గా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోం

  ఐదో స్థానంలో జామ్తారా సీజన్ 2 (Jamtara S2)

  ఐదో స్థానంలో జామ్తారా సీజన్ 2 (Jamtara S2)

  సైబర్ క్రైమ థ్రిల్లర్ గా జామ్తారా వెబ్ సిరీస్ రెండో సీజన్ తెరకెక్కింది. ఒకప్పుడు దోపిడి, దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే చంబల్ లోయ ప్రాంతం వాసులు ఈ డిజిటల్ యుగంలో ఎలా దోపిడి చేశారనేదే కథ. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో 8 ఎపిసోడ్ లుగా స్ట్రీమింగ్ అవుతోంది.

  6, 7, 8 స్థానాల్లో ఇలా..

  6, 7, 8 స్థానాల్లో ఇలా..

  అలాగే టాప్ 6 ప్లేస్ లో ఉన్న మజా మా (Maja Ma) అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తర్వాత ఏడో స్థానంలోని మిస్ మ్యాచ్ డ్ సీజన్ 2 (Mismatched S2) నెట్ ఫ్లిక్స్ లో.. 8వ స్థానంలోని కాలేజ్ రొమాన్స్ సీజన్ 3 (College Romance S3) సోనీ లివ్ ఓటీటీలో ప్రదర్శించబడుతున్నాయి.

  చివరిగా పదో స్థానంలో షి హల్క్..

  చివరిగా పదో స్థానంలో షి హల్క్..

  ఇక లేడీ హల్క్ గా వచ్చిన షి హల్క్: అటార్నీ ఎట్ లా (She Hulk: Attorney At Law) వెబ్ సిరీస్ తొమ్మిదో స్థానాన్ని సంపాందించుకుంది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతోంది. చివరిగా పదో స్థానంలో మిల్కీ బ్యూటి లేడీ బౌన్సర్ గా నటించిన బబ్లీ బౌన్సర్ (Babli Bouncer) కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇందులో మీరు ఎన్ని చూశారు? చూడనివి ఉంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే చూసి ఆనందించండి.

  English summary
  Top 10 OTT Originals In India From October 7 To 13 2022 Those Who Created Buzz By Ormax Stream Track
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X