Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Unstoppable 2: ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య డ్యాన్స్.. ట్రిపుల్ ధమాకాగా ఎపిసోడ్
సినిమాల్లోనే కాకుండా డిజిటల్ తెరపై కూడా అదరగొడుతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. సూపర్ సక్సెస్ అయిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'కు కొనసాగింపుగా సీజన్ 2ను తీసుకొచ్చింది తెలిసిన సంగతే. ఈ షోలో బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఎనర్జిటిక్ గా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ఎంతో సందడిగా కొనసాగుతోంది. సెలబ్రిటీ, పొలిటికల్ గెస్టులతో హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సందడి మాములుగా ఉండట్లేదు. ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటోంది. ఇప్పుడు మరో ఎపిసోడ్ కు ముగ్గురు హీరోయిన్లు హాజరై సందడి చేయనున్నారు.

హోస్ట్ గా అలరిస్తోన్న బాలయ్య..
అన్
స్టాపబుల్
మొదటి
సీజన్
భారీ
స్థాయిలో
రెస్పాన్స్
అందుకోవడంతో
ఇక
సెకండ్
సీజన్
కూడా
అంతకుమించి
అనేలా
ప్లాన్
చేశారు.
అందుకు
అనుగుణంగానే
ఈ
షో
రెండో
సీజన్
కు
రెస్పాన్స్
అందుకోవడం
విశేషం.
నందమూరి
బాలకృష్ణ
ఎలా
ఉంటారు
మరోసారి
ఫ్యాన్స్
అందరికీ
కూడా
క్లారిటీ
వచ్చేసింది.
ఆయన
హోస్ట్
గా
కూడా
ఎంతగానో
ఆకట్టుకుంటారు
అని
అన్
స్టాపబుల్
షో
రుజువు
చేసింది.

వరుస ఎపిసోడ్స్ తో..
'Unstoppable with NBK 2' షో మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసి సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఈ ప్రముఖ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హాజరైన ఈ ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో వరుసగా ఎపిసోడ్స్ ను వదిలారు. అందులో యంగ్ హీరోల నుంచి సీనియర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పొలిటిషియన్స్ ఇలా ఎంతోమంది వచ్చి అలరించారు.

రెండు రోజుల్లో 30 మిలియన్స్
అన్‌స్టాపబుల్ 2వ సీజన్ లో ఇప్పటివరకు 5 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఐదో ఎపిసోడ్ లో ప్రముఖ దర్శక నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ కూడా పలు రికార్డులు సృష్టించింది. రెండు రోజుల్లో 30 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించి రికార్డు కొట్టింది. ఇక దీని తర్వాత వచ్చే ఆరో ఎపిసోడ్ పై ఫుల్ బజ్ క్రియేట్ అయింది.

ప్రభాస్, గోపీచంద్ తో బాలయ్య..
అన్‌స్టాపబుల్ గా సాగుతున్న ఈ షోకి ఆరో ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు అతని అత్యంత సన్నిహితుడు గోపీచంద్ కూడా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన మొదటి ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. ఈ ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్ లతో బాలకృష్ణ సందడి చేశారు. నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలని బాలయ్య అంటే సరే డార్లింగ్ సార్ అని ప్రభాస్ అన్నాడు.
|
అందం, అభినయం కలగలిపిన..
ఇక అన్‌స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ కు ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ రానున్నారు. అలనాటి అందాల తార జయప్రద, సహజ నటి జయసుధ, గ్లామర్ బ్యూటి రాశీ ఖన్నాతో బాలయ్య బాబు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆహా ప్రకటించింది. అందం, అభినయం కలగలిపిన సహజనటి జయసుధ గారు.. మల్టీ టాలెంటెడ్ జయప్రద గారు.. రావిషింగ్ రాశీ ఖన్నా అంటూ చేసిన ఆహా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వీటిలో ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య సరదాగా ముచ్చటించడంతోపాటు డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

నరసింహతో సహజ నటి అంటూ..
ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ కు వచ్చే గెస్ట్ లను గెస్ చేయమంటూ ఆహా ట్విటర్ లో కొన్ని హింట్స్ ఇచ్చింది. వాటిలో ఒక ఫోటోలో నరసింహతో సహజ నటి అని తెలియజేయగా మరొక ఫోటోలో అన్ స్టాపబుల్ లో సాగర సంగమం అని ఇచ్చారు. తర్వాత మూడో పిక్ లో ఇక సందేహం లేదు ఈమె మీ ఊహలతో గుసగుసలాడుతుంది.. అని మరొక హీంట్ ఇచ్చారు. ఈ ముగ్గురు ఎవరో కనిపెట్టాలి అని ఆహా సోషల్ మీడియాలో కొంత బజ్ అయితే క్రియేట్ చేసింది.