For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable 2: ఆ హీరోపై మనసు పడ్డ రాశీ ఖన్నా.. ఆమె కాబోయే గర్ల్ ఫ్రెండ్ అంటూ బాలకృష్ణ!

  |

  నందమూరి నటసింహం హోస్ట్ అవతారమెత్తి రికార్డ్స్ సృష్టిస్తున్న అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ఎంతో సందడిగా కొనసాగుతోంది. స్టార్ సెలబ్రిటీ గెస్టులతో హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సందడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ సీజన్ లోని ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటోంది. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలతో కూడా బాలయ్య బాబు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇంకా ప్రభాస్ ఎపిసోడ్ పూర్తి కాకముందే మరో ఎపిసోడ్ కు వచ్చే అతిథులను ప్రకటించారు. మొదట హింట్స్, తర్వాత ఫొటోలతో క్యూరియాసిటీ పెంచిన ఆహా తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ వదిలింది.

  యంగ్ నుంచి సీనియర్ పొలిటిషియన్స్ వరకు..

  యంగ్ నుంచి సీనియర్ పొలిటిషియన్స్ వరకు..

  'Unstoppable with NBK 2' షో మొదటి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేసి సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఈ ప్రముఖ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హాజరైన ఈ ఫస్ట్ ఎపిసోడ్ యూట్యూబ్ లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో వరుసగా ఎపిసోడ్స్ ను వదిలారు. అందులో యంగ్ హీరోల నుంచి సీనియర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పొలిటిషియన్స్ ఇలా ఎంతోమంది వచ్చి అలరించారు.

  ముందుగా ట్విటర్ వేదికగా హింట్స్..

  ముందుగా ట్విటర్ వేదికగా హింట్స్..

  అన్‌స్టాపబుల్ 2 కొత్త ఎపిసోడ్ కు వచ్చే గెస్ట్ లను గెస్ చేయమంటూ ఆహా ట్విటర్ లో కొన్ని హింట్స్ ఇచ్చింది. వాటిలో ఒక ఫోటోలో నరసింహతో సహజ నటి అని తెలియజేయగా మరొక ఫోటోలో అన్ స్టాపబుల్ లో సాగర సంగమం అని ఇచ్చారు. తర్వాత మూడో పిక్ లో ఇక సందేహం లేదు ఈమె మీ ఊహలతో గుసగుసలాడుతుంది.. అని మరొక హీంట్ ఇచ్చారు. ఈ ముగ్గురు ఎవరో కనిపెట్టాలి అని ఆహా సోషల్ మీడియాలో కొంత బజ్ అయితే క్రియేట్ చేసింది.

  హీరోయిన్లతో బాలయ్య డ్యాన్స్..

  హీరోయిన్లతో బాలయ్య డ్యాన్స్..

  ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగే అన్‌స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ కు ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ రానున్నారని తెలిసిందే. అలనాటి అందాల తార జయప్రద, సహజ నటి జయసుధ, గ్లామర్ బ్యూటి రాశీ ఖన్నాతో బాలయ్య బాబు సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఫొటోలతో ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ ఆహా ఇటీవల ప్రకటించింది. అందం, అభినయం కలగలిపిన సహజనటి జయసుధ గారు.. మల్టీ టాలెంటెడ్ జయప్రద గారు.. రావిషింగ్ రాశీ ఖన్నా అంటూ చేసిన ఆహా పిక్స్ షేర్ చేసింది. వీటిలో ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య సరదాగా ముచ్చటించడంతోపాటు డ్యాన్స్ చేశాడు.

  ముగ్గురు హీరోయిన్లతో సందడి..

  ముగ్గురు హీరోయిన్లతో సందడి..

  ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా తాజా ఎపిసోడ్ కు సంబంధించిన హింట్స్, ఫొటోలతో క్యూరియాసిటీ పెంచేసిన ఆహా తాజాగా గ్లింప్స్ వదిలింది. ఇందులో ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య బాబు సందడి చేశాడు. క్లిష్టమైన ప్రశ్నలను కూడా సింపుల్ గా, క్యాజువల్ గా అడిగి వాళ్లను ఇరకాటంలో పెడతాడు. బాలకృష్ణ తనదైన స్టైల్ లో అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీ స్టార్స్ కూడా తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు.

  కాంపిటీషన్ కట్ చేద్దామనేగా..

  కాంపిటీషన్ కట్ చేద్దామనేగా..

  ఇక ఎపిసోడ్ గ్లింప్స్ విషయంలోకి వెళితే.. ముందుగా జయసుధ, జయప్రద ఎంట్రీ ఇవ్వగా వాళ్లతో కలిసి డ్యాన్స్ చేశాడు బాలయ్య. ఒకటి క్రష్.. ఇంకొటి ఏమో క్రష్ మా క్రష్ అని బాలకృష్ణ అన్నాడు. తర్వాత నా షూటింగ్ స్టాప్ చేసి.. తనను (జయసుధ) పెళ్లి కూతురుని చేయడానికి వెళ్లాను నేను అని జయప్రద చెప్పారు. దీనికి కాంపిటీషన్ కట్ చేద్దామనేగా అని బాలకృష్ణ చమత్కరించారు. దీంతో అంతా నవ్వేశారు.

  కాబోయే గర్ల్ ఫ్రెండ్..

  తర్వాత బ్యూటిఫుల్ రాశీ ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు నువ్ యాక్ట్ చేసిన హీరోలలో ఎవరిపైనా క్రష్ ఉంది అని రాశీ ఖన్నాను బాలకృష్ణ అడిగాడు. అందుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పింది రాశీ ఖన్నా. ఇప్పుడు ఈ అమ్మాయేమో కాబోయే గర్ల్ ఫ్రెండ్ అని మరోసారి అందరిని నవ్వించాడు బాలకృష్ణ. తర్వాత ముగ్గురు హీరోయిన్లతో కలిసి బాలయ్య డ్యాన్స్ చేశాడు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న స్ట్రీమింగ్ కానుంది. అంటే ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ (డిసెంబర్ 30) కంటే ముందే ఈ ఎపిసోడ్ ను టెలీకాస్ట్ చేయనున్నారు.

  English summary
  Tollywood Star Heroine Jayasudha Jayaprada Rashi Khanna With Nandamuri Balakrishna In Unstoppable 2 Latest Episode. And Rashi Khanna Reveals Her Crush Is Vijay Devarakonda.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X