Don't Miss!
- Sports
పోలీస్ ఆఫీసర్గా మహేంద్ర సింగ్ ధోనీ
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- News
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: ప్రభాస్ ఎపిసోడ్ తో దారుణంగా నష్టపోయిన ఆహా.. వాళ్ళ వళ్ళనే నష్టాలు!
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ భారీ స్థాయిలో ఆదరణ పెరగడానికి కారణం అన్ స్టాపబుల్ షో అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ వ్యవహరిస్తున్న ఈ టాక్ షో మొదటి సీజన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడంతో సబ్ స్క్రైబర్స్ కూడా భారీగా పెరిగారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ తో మరింత ఎక్కువ స్థాయిలో సబ్ స్క్రైబర్స్ నుంచి ఆదాయం వస్తున్న తరుణంలో ఊహించిన విధంగా ఒక దెబ్బ పడింది. కొందరి వల్ల ఆహా తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటుంది. ప్రభాస్ ఎపిసోడ్ ను అసలు ఆహా పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది అనే చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్ డిమాండ్ మేరకు
అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారామ్ స్థాయిని మరో లెవల్ కు పెంచింది. మొదటి సీజన్ కు మంచి క్రేజ్ రావడంతో రెండవ సీజన్ కూడా అదే అంతకుమించి అనేలా క్రేజ్ అందుకుంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫాన్స్ అయితే ఏ స్థాయిలో ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎపిసోడ్ ముందుగానే స్ట్రీమింగ్ అయ్యేలా చూడాలి అని ఫాన్స్ నుంచి డిమాండ్ రావడంతో. 31వ తేదీన స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్ ఒకరోజు ముందే స్ట్రీమింగ్ అయింది.

ఆహా క్రాష్
అయితే ఆహా సబ్ స్క్రిప్షన్ కోసం గత రాత్రి చాలామంది పోటీపడ్డారు. ప్రభాస్ ఎపిసోడ్ ప్రీమియర్స్ వీక్షించేందుకు జనాలు అందరూ ఒకేసారి ఆహా యాప్ ను ఓపెన్ చేయడంతో సర్వర్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. ఆహా కొన్ని గంటల వరకు పనిచేయని విషంగా క్రాష్ అయిపోయింది. 9 గంటలకు స్ట్రీమింగ్ కావాల్సిన ఎపిసోడ్ ను కొంతమంది అయితే 12 గంటల తర్వాత కూడా చూడని పరిస్థితి ఏర్పడింది.

ఆహా వైపు ఎవరు చూడలేదు
అయితే ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి కంటే తీసుకోలేని వారే ముందుగా ఈ ఎపిసోడ్ ను ఎక్కువ స్థాయిలో వీక్షించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అప్పటికే మేటర్ మొత్తం లీక్ కావడంతో జనాలు పైరసీ వెబ్ సైట్స్ నుంచి ఆహా ఎపిసోడ్ ను ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇక సోషల్ మీడియాలో ఆ న్యూస్ వైరల్ కావడంతో మళ్లీ ఆహా వైపే ఎవరు కూడా తిరిగి చూడలేదు.
టెక్నీకల్ టీమ్ పొరపాటు
అసలు ప్రభాస్ లాంటి స్టార్ హీరో షోలోకి వస్తున్నాడు అంటేనే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా యాప్ పై ప్రభావం పడుతుంది అని టెక్నికల్ టీం ముందుగానే ఒక అంచనా వేసుకుని ఉండాలి. కానీ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా ఆహా టీం ఎప్పటిలానే పనిని కొనసాగించింది. దీంతో ఒక్కసారిగా లిమిట్ కంటే ఎక్కువ స్థాయిలో జనాలు సబ్ స్క్రిప్షన్ తీసుకోవడానికి రావడంతో ఆహా బ్యాలెన్స్ చేయలేక క్రాష్ అయిపోయింది.

ఫ్రీగా చూసేశారు
ఆలస్యంగా స్ట్రీమింగ్ చేసిన కూడా అయిపోయేది కానీ ఆహా యాప్ 9 గంటలకు అనుకున్న సమయానికి ఎపిసోడ్ ను యాప్ లో అప్లోడ్ చేసేసింది. అయితే అందరికీ అది దక్కలేదు. కానీ కొంతమంది దాన్ని పైరసీ చేసేసి టెలిగ్రామ్ యాప్ లో అలాగే ఇతర పైరసీ వెబ్ సైట్స్ లో అప్లోడ్ చేసేసరికి అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఇక 12 గంటలైనా కూడా ఎపిసోడ్ కనిపించలేదు. కానీ చాలామంది 10 గంటలకే ఉచితంగా టెలిగ్రామ్ యాప్ ల నుంచి డౌన్లోడ్ చేసుకోవడం మొదలు పెట్టేశారు.

పవన్ ఎపిసోడ్ పై ప్రభావం?
టెలిగ్రామ్ యాప్ అలాగే పైరసీ వెబ్ సైట్స్ కారణంగా ఆహా యాప్ ప్రభాస్ ఎపిసోడ్ తో దారుణంగా నష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సబ్ స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన వారు మళ్ళీ వెనుకడుగు వేశారు. ఇక ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు కూడా సబ్ స్క్రిప్షన్ తీసుకోకుండా పైరసీ మీద ఆధారపడితే మాత్రం ఆహా ప్లాన్ మొత్తం కూడా వృధా అయినట్లే.