For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఓటీటీలో విశ్వక్ సేన్ మూవీ: విడుదలైన 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. తద్వారా టాలీవుడ్‌లో తమదైన మార్కును చూపిస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ కుర్రాడు విశ్వక్ సేన్ ఒకడు. 'వెల్లిపోమాకే' అనే సినిమాతో హీరోగా పరిచయమైన అతడు.. 'ఫలక్‌నామాదాస్' చిత్రంతో చాలా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో మెరిశాడు. ఆ తర్వాత 'హిట్'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. తద్వారా రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

  HBD Sudigali Sudheer: ఒక్కో షోకు సుధీర్ ఎంత తీసుకుంటాడో తెలుసా? అతడి ఏడాది సంపాదన తెలిస్తే షాకే!

  గత ఏడాది 'పాగల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. అది విజయం సాధించకపోవడంతో నిరాశగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసమే 'అశోక వనములో అర్జున కళ్యాణం' అనే సినిమాను చేశాడు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను విద్యా సాగర్ చింతా అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా విడుదలకు ముందు ఇది అంతే రీతిలో అంచనాలను కూడా ఏర్పరచుకుంది.

  విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే దీనికి మంచి టాక్ దక్కింది. ఫలితంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ నుంచి ఈ సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చింది. దీంతో తొలి వారంలో కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. అయితే, ఆ తర్వాత కొన్ని భారీ చిత్రాలు విడుదల కావడంతో విశ్వక్ సేన్ సినిమాకు ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ ఉన్నంతలోనే ఇది మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునేందుకు దగ్గరగా వచ్చేసింది.

  యాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవ

  Vishwak Sens Ashoka Vanamlo Arjuna Kalyanam Streaming From May 27th

  క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ థియేటర్లలో బాగానే సందడి చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని ఓటీటీలోకి తీసుకు రాబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా సంస్థ.. దీన్ని మే 27వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 'అశోక వనములో అర్జున కళ్యాణం' మూవీ విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చినట్లు అవుతుంది.

  టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రమే 'అశోక వనములో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింతా తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. జై క్రిష్ దీనికి సంగీతం సమకూర్చారు. ఈ మూవీని ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. ఇందులో రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలను చేశారు.

  English summary
  Vishwak Sen Did Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Under Viday Sagar Chinta Direction. This Movie Streaming From May 27th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X