For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ZEE5's Hooked అంగరంగవైభవంగా ఈవెంట్.. ఒకేసారి 11 వెబ్ సిరీస్‌లను ప్రకటించిన జీ5

  |

  దేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫాం ZEE5, ZEE5 100+ విభిన్నమైన కంటెంట్‌పై దృష్టి సారించింది. 5 లక్షల గంటలకుపైగా కంటెంట్, 160+ లైవ్ టీవీ ఛానెల్‌తో ZEE5 దూసుకెళ్తున్నది. 3500కి పైగా సినిమాలు, 1750 టీవీ కార్యక్రమాలు, 700 ఒరిజినల్‌తో కూడిన గొప్ప లైబ్రరీతో ZEE5 12 భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది: ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ భాషల్లో కంటెంట్‌ను అందిస్తున్నది.

  తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి ఎంతో మంది వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఇటీవల జీ5లో విడుదలైన ఒక చిన్నా ఫ్యామిలీ స్టోరీ, నెట్, లూజర్, గాలివాన లాంటి వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభించింది. తాజా విజయాలు అందించిన ఉత్సాహంతో 2022 సంవత్సరంలో ప్రేక్షకులను రంజింప చేసే అద్భుతమైన లైనప్‌తో వస్తున్నది. తాజాగా 11 ఒరిజినల్స్‌తో కూడిన పవర్ ప్యాక్ట్ కంటెంట్‌ను ప్రముఖ దర్శకులు, సినీ ప్రముఖులు హరీష్ శంకర్, ప్రవీణ్ సత్తారు, శరత్ మరార్, కోన వెంకట్, నిహారిక, సుస్మిత కొణిదెల, సుశాంత్, ఆది సాయికుమార్, రాజ్ తరుణ్ సమక్షంలో వెబ్ సిరీస్‌లను ZEE5 గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

  శివ బాలాజీ, శ్రీరామ్, ధన్య బాలకృష్ణ, రాజేశ్వరి నాయర్, ఆడుకాలం నరేన్, శరణ్య ప్రదీప్, సమ్మెట గాంధీ, ఈస్టర్ నొరోన్హా నటించిన మల్టీస్టారర్ థ్రిల్లర్ రెక్కీ వెబ్ సిరీస్, సుశాంత్ నటించిన మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ జీ5లో రిలీజ్ అవుతున్నది. ఈ కార్యక్రమంలోనే సుబ్బరాజు, పృథ్వీ, వీజే సన్నీ నటించిన ATM ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.

  ZEE5 Hooked event come up with 11 Originals and Web series

  సినీతారల సమక్షంలో సాగిన Hooked కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. యువ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా ఆహా నా పెళ్లంట వెబ్ సిరీస్‌లోని లిరికల్ వీడియోను ఆవిష్కరించారు- జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఒక వ్యక్తి చేసిన విఫల ప్రయత్నానికి సంబంధించిన సరదా రొమాంటిక్ వెబ్ సిరీస్‌గా రూపొందింది. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నది.

  ఒక చిన్న ఫామిలీ స్టోరీ సక్సెస్ తర్వాత ఎలిఫెంట్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదల నిర్మించిన హలో వరల్డ్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న మిషన్ తషాఫీ, వెబ్ సిరీస్ పరువు , బహిష్కరణ , ది బ్లాక్ కోట్ , ప్రేమ విమానం, హంటింగ్ ఆఫ్ ది స్టార్స్ వెబ్ సిరీస్‌లకు సంబంధించిన వివరాలను వేదికపైన సంబంధింత యూనిట్ సభ్యులు, నటీనటులు వెల్లడించారు.

  ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ మనీష్ కల్రా మాట్లాడుతూ, "ZEE5లో మాకు సౌత్ ఒక ముఖ్యమైన మార్కెట్. ఈ మార్కెట్‌లో వీక్షకుల ఆదరణ పొందడానికి తెలుగు ప్రేక్షకులకు అవసరమైన కంటెంట్‌ను అందించే ప్రయత్రం చేస్తున్నాం అని అన్నారు.

  ZEE ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, కంటెంట్ & ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ మిస్టర్. పునీత్ మిశ్రా మాట్లాడుతూ.. ఇటీవ భారతీయ ప్రేక్షకుల వీక్షణ విధానాలలో గణనీయమైన మార్పును చూశాము,. OTT ప్లాట్‌ఫామ్‌లో విభిన్న శ్రేణి కంటెంట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మంచి కంటెంట్ ను ఆదరిస్తున్నారు. తెలుగులో మా కంటెంట్ కొత్తగా ఉండేలా కొత్త కథలను అన్వేషిస్తూ ప్రేక్షకులను వినోదభరితంగా ఉంచడానికి నిరంతరం కృషి చేస్తాం అని అన్నారు.

  ZEE5 Hooked event come up with 11 Originals and Web series

  శ్రీమతి అనురాధ గూడూరు, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ZEE తెలుగు మార్కెట్లో చాలా బలంగా స్థిరపడింది. ZEE5లో మంచి కంటెంట్‌తో సక్సెస్ సాధించడమే మా లక్ష్యం. తాజా 11 కొత్త ఒరిజినల్ కథలు, ఐకానిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తునాం అని అన్నారు.

  ఈ కార్యక్రమంలో నసీరుద్దీన్ షా, అదితి రావ్ హైదరీ నటించిన ఎపిక్ మొఘల్ టేల్ తాజ్, సోనాలి బింద్రె నటించిన బ్రోకెన్ న్యూస్ ప్రివ్యూలను ప్రదర్శించారు. త్వరలోనే కార్తికేయ-2, హనుమాన్ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది.

  English summary
  ZEE5 says CHOOSTUNE UNDIPOTAARU (Dekhtey Reh Jaogey) as it reveals a power-packed line-up of 11 originals across a gamut of genres in the presence of industry stalwarts such as Harish Shankar, Praveen Sattaru, Kona Venkat, Niharika and Sushmita Konidela.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X