twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్ము రేపుతున్న రెక్కీ.. ఐదురోజుల్లోనే 40 మిలియన్ వ్యూస్

    |

    నిజానికి ఓటీటీలు మనదేశంలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చాయి కానీ కరోనా లాక్ డౌన్ వల్ల వాటి వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే విదేశీ కంటెంట్ కు ఏమాత్రం తగ్గకుండా దేశీ కంటెంట్ రూపొందించే పనిలో పడ్డారు మన మేకర్స్. ఇప్పటికే బాలీవుడ్ నుంచి వచ్చిన పలు వెబ్ సిరీస్ లు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు తెలుగు మేకర్స్ కూడా కొన్ని మంచి సిరీస్ లు చేస్తున్నారు. మన తెలుగు ఒరిజినల్స్ లోనూ క్వాలిటీ బాగా పెరిగింది. అలాంటి కోవలోనే ZEE 5 లో రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు వెబ్ సిరీస్ 'రెక్కీకి మంచి స్పందన లభిస్తోంది..

    మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త దర్శకుడు పోలూరు కృష్ణ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌గా విడుదలైన ఈ సిరీస్ లో ఒకప్పటి హీరో శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించగా.. ఆడుకాలం నరేన్, సమ్మెట గాంధీ, శివబాలాజీ, రాజశ్రీ నాయర్, ఎస్తేర్, సూర్యతేజ, శరణ్య ప్రదీప్, జీవా, కోటేశ్వరరావు, ధన్య బాలకృష్ణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

    ZEE5 Recce web series clocks 40 million streaming minutes

    అయితే ఈ వెబ్ సిరీస్ లో అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది పరదేశీ అనే పాత్ర పోషించిన సమ్మెట గాంధీ అంటూ చర్చ జరుగుతోంది. రాజకీయ హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ 7వ ఎపిసోడ్ ఎండింగ్ లో దీనికి రెండో సీజన్ ఉంటుందనే హింటిచ్చాడు దర్శకుడు. రాయలసీమలోని తాడిపత్రి అనే ఒక ఊరి నేపథ్యంలో నడిచే కథ ఇది. అక్కడ మున్సిపల్ చైర్మన్ ని, అతని కొడుకును కొందరు మర్డర్ చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఓ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. కొద్దిరోజుల ఇన్వెస్టిగేషన్ లో ఈ మర్డర్స్ కు సూత్రధారి ఎవరో తెలుస్తుంది. అయితే దర్యాప్తులో అతనికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి.

    ఇంతకీ ఆ మర్డర్స్ ను ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది చాలా ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. మొత్తం 7 ఎపిసోడ్స్ లోనూ అడుగడుగునా ఉత్కంఠ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అందుకే జూన్ 17న విడుదలైన ఈ సిరీస్ అప్పుడే 40 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుని హాట్ టాపిక్ గా మారింది. ఈ సిరీస్ లో పోలీస్ అధికారి లెనిన్ గా శ్రీరామ్, చలపతిగా శివ బాలాజీ, గౌరిగా ధన్య బాలకృష్ణ, వరదరాజులుగా ఆడుకలం నరేన్, రేఖగా ఎస్టర్ నొరోన్హా, ఎమ్మెల్యేగా జీవా, బుజ్జమ్మ గా శరణ్య ప్రదీప్, దేవకమ్మగా రాజశ్రీ నాయర్, రామరాజుగా రంగనాయకులు నటించారు. కుళ్లాయప్పగా తోటపల్లి మధు, పోలీసు అధికారిగా సమీర్, పరదేశిగా సమ్మెట గాంధీ, బాషాగా ఉమా దానం కుమార్, సుబ్బడుగా కృష్ణకాంత్, బసవగా మురళి, ఈ.ఓ, మణిగా సూర్య తేజ వంటి వారు నటించారు.

    English summary
    ZEE5 Recce web series clocks 40 million streaming minutes in only 5 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X