»   » రాజకీయాల్లోకి మరో హీరోయిన్, గొడవలొచ్చేస్తాయేమో?

రాజకీయాల్లోకి మరో హీరోయిన్, గొడవలొచ్చేస్తాయేమో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగులూరు: కన్నడ రాజకీయాలు సినీ రంగానికి చెందిన తారల రాకతో మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అక్కడ పలువురు స్టార్లు రాజకీయ తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు రమ్య,పూజాగాంధీ, రక్షిత తదితరులు రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. వీరంతా గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసి పరాజయం పొందారు. ఇపుడు మరో సినీనటి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ శాండల్ వుడ్ నటి ప్రియా హాసన్ త్వరలో పొలిటికల్ సర్కిల్ లోకి ఎంటరవుతున్నట్లు సమాచారం. యాక్షన్ చిత్రాల ద్వారా శాండల్ వుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రియా హాసన్...బిందాస్ హుడుగి, జంభద హుడుగి చిత్రాల ద్వారా ఆమె కన్నడ ప్రేక్షకులకు చేరువైంది.

Priya Hassan Ready to Enter in Politics

కాగా ప్రియా హాసన్ నటించిన 'స్మగ్లర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె సన్నద్ధం అవుతోంది.

కాగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియా హాసన్ బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో హీరోయిన్ రమ్య ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకురాలిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రియా హాసన్ రావడం చర్చనీయాంశం అయింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఒదగడం ఎంత కష్టమో...ఒకే పార్టీలో ఇద్దరు హీరోయిన్లు రాణించడం అంతే కష్టం. మన్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

English summary
Sandalwood Actress Priya Hassan Ready to Enter in Politics.
Please Wait while comments are loading...