India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  10th class diaries movie ఫీల్‌గుడ్ లవ్ స్టోరి.. స్కూల్‌ లైఫ్‌ను గుర్తుకు తెచ్చే ఎమోషనల్ డ్రామా!

  |

  Rating: 2.75/5

  పాఠశాల విద్య అనేది జీవితంలో ఎమోషనల్ పాయింట్. చివరి శ్వాస వరకు ఆ మెమొరీస్ వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. స్కూల్, కాలేజీ స్టడీస్ తర్వాత విద్యార్థులందరూ మళ్లీ కలుసుకోవడమనే కథా నేపథ్యంతో ఇప్పటి వరకు ఆటోగ్రాఫ్, జాను లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం (రీయూనియన్) పాయింట్‌తో తాజాగా థియేటర్లలో రిలీజైన చిత్రం 10th class dairies. నటుడు, నిర్మాత వెన్నెల రామారావు, 50కిపైగా చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించిన గరుడవేగ అంజి దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఎమోషనల్, ఫీల్‌గుడ్ అంశాలతో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకొందాం..

  కథ ఏమిటంటే?

  కథ ఏమిటంటే?

  సోము అలియాస్ సోమయాజి (శ్రీరాం) అమెరికాలో స్వయంకృషితో ఎదిగి కంపెనీకి సీఈవోగా సేవలందిస్తుంటాడు. కానీ జీవితంలో సుఖసంతోషాలకు దూరంగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో సైక్రియాటిస్టు వద్దకు వెళితే.. నీవు అన్ని రకాలుగా సంపాదించావు. కానీ నీ జీవితంలో ఫన్ లేదని చెబుతాడు. అయితే తన జీవితంలో ఎప్పుడో వదిలేసిన ఫన్‌ను వెతుక్కొనే ప్రయత్నంలో పడి తన పదో తరగతి క్లాస్‌ మెట్స్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రాజమండ్రికి చేరుకొంటారు.

  మూవీలో ట్విస్టులు ఇలా..

  మూవీలో ట్విస్టులు ఇలా..


  రాజమండ్రికి చేరుకొన్న తర్వాత సోముకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చిన్నతనంలో తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చాందినీ (అవికా గోర్) ఏమైంది? చిన్నతనంలో చాందినీ ప్రేమను తెలుసుకొన్న తండ్రి (నాజర్) ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? తండ్రి తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం చాందినీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనైంది. చాందినీని సోము కలుసుకొన్నాడా? చాందిని పరిస్థితి ఏమైంది? చాందిని జాడ కోసం వెతికే క్రమంలో స్నేహితులు సౌమ్య (అర్చన వేద), నాగలక్ష్మి (హిమజ), హాఫ్ బాయిల్డ్ (శ్రీని వాస్ రెడ్డి), గౌరవ్ (వెన్నెల రామారావ్) ఎలాంటి సహాయం చేశారు? చాందిని, సోము ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే 10th class dairies సినిమా కథ.

  సినిమా ఎలా ఉందంటే?

  సినిమా ఎలా ఉందంటే?

  అమెరికాలో టాప్ బిజినెస్‌మెన్‌గా ఎదిగి.. వైవాహిక జీవితంలో వైఫల్యం చెందిన సోము లైఫ్‌తో కథ ఎమోషనల్‌గా మారుతుంది. సైక్రియాటిస్ట్ చెప్పిన పాయింట్ సోమును ఎమోషనల్‌గా టచ్ చేయడంతో రాజమండ్రికి చేరుకోవడం, స్నేహితులతో కలిసి సరదాగా గడపడం లాంటి సన్నివేశాలు చకచకా సాగిపోతాయి. అయితే తొలిభాగంలో బలమైన సన్నివేశాలు, ఎమోషనల్ పాయింట్స్‌తో కథను నడిపి ఉంటే.. సినిమా నెక్ట్స్ లెవల్‌‌కు వెళ్లే అవకాశం ఉండేది. అయితే సెకండాఫ్‌లో కథను నడిపించిన తీరు చాలా ఎమోషనల్‌గా ఉంది. పాత్రల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. సినిమా చివరి 20 నిమిషాలు హైలెట్‌గా మారడమే కాకుండా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఎమోషనల్‌గా టచ్ చేసే పాయింట్‌ హృదయానికి భారంగా మారుస్తుంది.

  దర్శకుడు అంజి ప్రతిభ గురించి

  దర్శకుడు అంజి ప్రతిభ గురించి


  నిర్మాత వెన్నెల రామారావు జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా మారారు. తొలి చిత్ర దర్శకుడు అయినప్పటికి అనుభవం ఉన్న డైరెక్టర్‌గా డీల్ చేయడంలో అంజి సఫలమయ్యారు. సెకండాఫ్‌లో కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. అద్బుతమైన లొకేషన్లలో చిత్రీకరణతో సన్నివేశాలు తెరపైన పెయింటింగ్‌గా అనిపిస్తాయి.

  శ్రీరాం, అవికా గోర్ ఫెర్ఫార్మెన్స్

  శ్రీరాం, అవికా గోర్ ఫెర్ఫార్మెన్స్


  సోముగా శ్రీరాం తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో తన క్యారెక్టర్‌ను ఫన్ రైడ్‌లా ముందుకు తీసుకెళ్లగా.. సెకండాఫ్‌లో మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. క్లైమాక్స్‌లో శ్రీరాం నటన బాగుంది. ఇక ఈ సినిమాలో చాందిని పాత్రలో కొత్త అవికా గోర్‌ను చూస్తాం. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను తన భుజాలపై నడిపించింది. అవికా గోర్ పాత్ర గుండెను పిండేసేలా ఉంటుంది.

  మిగితా నటీనటులు గురించి

  మిగితా నటీనటులు గురించి


  ఇక నిర్మాత వెన్నెల రామారావు గౌరవ్‌గా, హాఫ్ బాయిల్డ్ పాత్రలో శ్రీనివాస్‌రెడ్డి సెన్సిబుల్‌గా హాస్యాన్ని పండించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు కెమిస్ట్రీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తనదైన శైలిలో హాస్యాన్ని పండించిన వెన్నెల రామారావుకు నటుడిగా మంచి ఆఫర్లు రావడం ఖాయం. ఇప్పటి వరకు హిమజకు డిఫరెంట్ ఇమేజ్ ఉండేది. కానీ నాగలక్ష్మి పాత్రలో హిమజ కలెక్టర్‌గా హుందాగా కనిపించింది. అర్చన వేద కూడా తన పాత్రతో ఆకట్టుకొన్నారు. నాజర్ ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారు.

  టెక్నికల్ విభాగాల గురించి

  టెక్నికల్ విభాగాల గురించి


  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమా సన్నివేశాలను హైలెట్‌ చేయడంలో సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. ఫస్టాఫ్‌లో పాటలు జోష్‌గా సాగితే.. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా ఉంటాయి. చిన్నా రీరికార్డింగ్ బాగుంది. శృతి కార్తీక్ అందించిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. నిర్మాత వెన్నెల రామారావు, రవితేజ మన్యం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన విధానం సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలిపింది. సినిమా, కథా పరిధి, స్క్రిప్టు డిమాండ్ మేరకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా ఎలా ఉందంటే?


  10th క్లాస్ డైరీస్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఇప్పటి వరకు వచ్చిన రీయూనియన్ సినిమాకు భిన్నంగా ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొత్త పాయింట్‌తో సినిమాను ఎమోషనల్‌గా మార్చారు. అవికా గోర్, శ్రీరాం నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. కామెడీ సీన్లు, ఫన్ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యాయి. స్కూల్, కాలేజీ జీవితంలోని అనుభవాలను ఈ సినిమా గుర్తు చేసేలా ఉంటుంది. వారాంతంలో ఫీల్‌గుడ్, ఎమోషనల్ సినిమాలను చూడాలనే వారికి 10th క్లాస్ డైరీస్ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

  పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
  తెర వెనుక, తెర ముందు..

  తెర వెనుక, తెర ముందు..


  నటీనటులు: శ్రీరామ్, అవిక గోర్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, సత్యం రాజేశ్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, గీతా సింగ్, జబర్దస్త్ రొహిణి తదితరులు
  నిర్మాత: పీ అచ్యుత రామారావు, రవితేజ మన్యం
  దర్శకత్వం: సినిమాటోగ్రఫి: గురుడవేగ అంజి
  సహ నిర్మాత: రవి కొల్లిపార
  సమర్పణ: అజయ్ మైసూర్
  కథ: రామారావు
  డైలాగ్స్, స్క్రీన్ ప్లే: శృతి కార్తీక్
  సాహిత్యం: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ బొబ్బిలి
  కొరియోగ్రఫి: శేఖర్ వీజే, విజయ్ బిన్ని, సన్నీ
  ఫైట్స్: స్టంట్ జాషువా
  ఎడిటర్: ప్రవీణ్ పూడి
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా
  మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
  రిలీజ్ డేట్: 2022-07-01

  English summary
  10th class dairies movie set to release on july 1st 2022. Here is exclusive review from the Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X