For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  30 రోజుల్లో ప్రేమించటం ఎలా? రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.0/5
  Star Cast: ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, భద్రం
  Director: మున్నా

  బుల్లితెర మీద టాప్ యాంకర్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ప్రదీప్ మాచిరాజు వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. అయితే యాంకర్ ప్రదీప్ ఈ చిత్రంలో ఎలా నటించాడు? హీరోగా చేసిన ప్రయత్నం ఎంత సఫలమైంది. ఆయనకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రాన్ని సమీక్షించాల్సిందే.

  కథ విషయానికి వస్తే

  కథ విషయానికి వస్తే

  కిక్ బాక్సర్‌గా రాణించాలనుకొనే అర్జున్ (ప్రదీప్ మాచిరాజు), అక్షర సహ విద్యార్థులు. అయితే వారిద్దరికి ఒకరంటే మరొకరికి ఏ విషయంలో పడదు. పరిచయమైన రోజు నుంచే ఒకర్నికొరు ద్వేషించుకొంటారు. వారిద్దరు ద్వేషించుకోవడానికి గత జన్మ తాలుకు ప్రభావమే అని తెలుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల వారి అర్జున్ శరీరంలోకి అక్షర ఆత్మ, అక్షర శరీరంలోకి అర్జున్ ఆత్మ చేరుతుంది.

  30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ట్విస్టులు

  30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ట్విస్టులు

  గత జన్మలో అర్జున్, అక్షర జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గత జన్మలో వారి ప్రేమ ఫలించిందా? ఈ జన్మలో వారిద్దరూ ద్వేషించుకోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుత జన్మలో వారిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఆత్మలు తారుమారు కావడమనే సమస్యకు పరిష్కారం ఎలా లభించింది? వారిద్దరి మధ్య ద్వేషం తగ్గి ప్రేమ ఎలా చిగురించింది అని తెర మీద కలిగే ప్రశ్నలకు సమాధానమే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  పూర్వ జన్మ బ్యాక్ డ్రాప్‌గా సాగే ప్రేమ కథతో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మొదలవుతుంది. 1947 నాటి కాలం కథతో గ్రామీణ వాతావరణంలో అబ్బాయి గారు, అమ్మాయి గారు పాత్రలతో ప్రేమ సాగుతుంది. అయితే ఈ కీలకమైన పాయింట్ కారణంగా వారిద్దరూ తన ప్రేమను సఫలం చేసుకోలేకపోతారు. ఆ తర్వాత అర్జున్, అక్షర‌గా జన్మిస్తారు. ఒకే కాలేజీలో చదువుకోవడం వల్ల ఒకరికొకరు చేరువ అవుతారు. అయితే కథ విషయానికి వస్తే ఫీల్‌గుడ్ పాయింట్ అనిపిస్తుంది. కాకపోతే నాసిరకం కామెడీ, పేలవమైన సన్నివేశాలు తొలిభాగంలో చికాకు కలిగించేలా ఉంటాయి. దర్శకుడు మున్నా కథ, కథనాలపై పట్టు కోల్పోయారనే ఫీలింగ్ కలుగుతుంది.

  సెకండాఫ్ గురించి

  సెకండాఫ్ గురించి

  కనీసం రెండవ భాగంలో కూడా ఫీల్‌గుడ్ లవ్ స్టోరిని తెరకెక్కించే అవకాశం ఉన్నప్పటికి అనవసరమైన సన్నివేశాలతో సాగదీయడం అసలు కథ మరుగున పడినట్టు కనిపిస్తుంది. ఆత్మలు తారుమారు కావడం అనే పాయింట్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. కాకపోతే సెకండాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు, సెంటిమెంట్ సీన్లు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. అతిగా సాగదీత కొనసాగిన తర్వాత ఆదరాబాదరగా కథను ముగించాలనే విషయం గుర్తొచ్చి.. కిక్ బాక్సింగ్ ఎపిసోడ్‌ను క్లైమాక్స్‌కు అతికించినట్టు కనిపిస్తుంది. దాంతో కథ, కథనాలపై ఫోకస్ లేకపోవడంతో మంచి ప్రేమ కథను అందించే అవకాశం చేజారిందే అనే ఫీలింగ్ కలుగుతుంది.

   హీరోగా మెప్పించిన ప్రదీప్ మాచిరాజు

  హీరోగా మెప్పించిన ప్రదీప్ మాచిరాజు

  పూర్వజన్మలో అబ్బాయి గారు, ప్రస్తుత జన్మలో అర్జున్ అనే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో ప్రదీప్ మాచిరాజు ఒదిగిపోయారు. గ్రామీణ యువకుడిగా, అర్బన్ కాలేజ్ స్టూడెంట్‌గా మంచి వేరియేషన్‌ను చూపించడంలో తన సత్తాను చాటుకొన్నారు. కొన్ని సెంటిమెంట్ సీన్లలో ప్రదీప్ నటన బాగుంది. పాటలు, ఫైట్స్ చాలా ఈజ్‌తో చేశారు. సినిమా భారాన్ని తన భుజాలపై మోస్తూ మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కథ, కథనాల్లో ఉండే లోపాలు ఆయన ప్రయత్నానికి అడ్డుకట్టవేశాయనిపిస్తుంది.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో

  హీరోయిన్ అమృత అయ్యర్ కొంత మేరకు ఆకట్టుకొన్నారు. ఆత్మలు తారుమారైన తర్వాత అమృత యాక్టింగ్ చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. హర్షా వైవా, భధ్రం కామెడీ ఆకట్టుకోలేకపోయింది. పోసాని మురళి, హేమ, మిగితా పాత్రల్లో నటించిన వారు వారి పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

  ఆకట్టుకొన్న మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  ఆకట్టుకొన్న మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నీలి నీలి ఆకాశం పాట ఇప్పటికే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెర మీద కూడా పాట ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ కలిగిస్తుంది. అలాగే మాస్ బీట్‌తో సాగే మామ పాట కూడా ఆకట్టుకొంటుంది. అనూప్ రూబెన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫి సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఎడిటింగ్ విషయానికి వస్తే కార్తీక్ శ్రీనివాస్ ఇంకా చేతినిండా పని ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

  ఇక ఫైనల్‌గా

  ఇక ఫైనల్‌గా

  30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా విషయానికి వస్తే ఎక్కడా కూడా జస్టిఫికేషన్ ఉన్నట్టు అనిపించదు. నాసిరకమైన కథ, కథనాలతో రెండు గంటలపాటు సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. ప్రదీప్ మాచిరాజు యాక్టింగ్, అనూప్ రూబెన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫి తప్ప మిగితా అంతా భరించలేని విధంగా ఉంటుంది. కేవలం ప్రదీప్ మాచిరాజు కోసం తప్ప.. ఈ సినిమా చూడటానికి మరో బలమైన పాయింట్ ఎంత వెదికినా కనిపించదు. కథ, కథనాలపై మరింత ఫోకస్ పెట్టి ఉంటే మంచి ప్రేమ కథగా మారే అవకాశం ఉండేది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లాస్ పాయింట్స్
  మ్యూజిక్
  ప్రదీప్ మాచిరాజు యాక్టింగ్

  మైనస్ పాయింట్స్
  పేలవమైన కథ, కథనాలు
  ఆకట్టుకోని కామెడీ
  మితీ మీరిన సాగదీత

  నటీనటులు:

  నటీనటులు:

  ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, పోసాని కృష్ణ మురళి, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్
  దర్శకత్వం: మున్నా
  నిర్మాత‌: ఎస్.వి.బాబు
  సంగీత దర్శకుడు: అనుప్ రూబెన్స్
  సినిమాటోగ్రఫీ : దాశరధి శివేంద్ర
  ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్
  బ్యానర్: ఎస్‌వీ ప్రొడక్షన్స్
  రిలీజ్ డేట్: 2021-01-29

  English summary
  30 Rojullo Preminchadam Ela is a romanctic film directed by debutant Munna Dhulipudi and starring TV anchor Pradeep Machiraju and actress Amritha Aiyer in the lead role. The film is based on the theme of Reincarnation.This movie hit Theatres on on 29 January 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X