»   » రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ రివ్యూ...

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి. ఆయన ఈ మధ్య వరుసగా చెత్త సినిమాలు తీస్తున్న ఆయన సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ప్రేక్ష వర్గం కూడా ఒకటుంది. బహుషా ఆయన కెరీర్లో తీసిన బెస్ట్ సినిమా‘శివ'తో పాటు మనీ మనీ, మరికొన్ని మంచి సినిమాల ప్రభావమే కాబోలు.

ఎవరూ ఊహించని విధంగా వర్మ ఈ సారి ఓ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన కెరీర్లో మొట్ట మొదటిసారిగా చేసిన రొమాంటిక్ లవ్ స్టొరీ ‘365 డేస్'. నందు - అనైక సోఠి జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కథాంశంతో వర్మ ఫస్ట్ అటెంమ్ట్ ఎలా ఉందినేది చూద్దాం..

365 Days movie Review

కథలోకి వెళితే...ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అపూర్వ్(నందు) తనకి నచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఒక రోజు తన ఫ్రెండ్ ప్రశాంత్(కృష్ణుడు) ఇచ్చిన ఫ్యామిలీ పార్టీలో అనైక సోఠిని చూసి ప్రేమలో పడతాడు. నందు సిన్సియారిటీ చూసి అనైక కూడా పడిపోతుంది. వీరి రొమాంటిక్ లవ్ పెద్దల అంగీకారంతో పెళ్లికి దారి తీస్తుంది. పరిచయం అయిన 100వ రోజు పెళ్లితో ఒక్కటవుతారు. పెళ్లి తర్వాత 46 రోజులు ఫుల్ హ్యాపీ. 47వ రోజు నుండి వీరి కాపురంలో సమస్యలు. ఎంతో గొప్పగా ప్రేమించుకున్న వీరి మధ్య గొడవలు. పెళ్లి కి ముందే లైఫ్ బావుందనే భావన. ఒకరు లేకుండా ఒకరు ఉండలేమనుకునే స్థాయి నుండి కలిసి బ్రతకడం అసాధ్యం అనే స్థాయి వెళతారు. వీరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? వారు ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చారు అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ప్రేమికుడిగా, మొగుడిగా నందు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అనైక సోటి నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది. పోసాని కృష్ణ మురళి తనదైన పాత్రతో ఆకట్టుకున్నాడు. నవ్వించాడు కూడా. కృష్ణుడు, సత్య కృష్ణ, సురేఖ వాణి, గీతాంజలి వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నకల్ అంశాల విషయానికొస్తే...విజయ్ సినిమాటోగ్రఫీ బావుంది. ఎం.ఎస్.ప్రేమ్, నాగ్ శ్రీవాస్తవ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. రెండు పాటలు కూడా వినడానికి బావున్నాయి. ఎడిటింగ్ యావరేజ్.

సినిమా కథ చాలా చిన్నది. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే ప్రేమ.... పెళ్ళికి ముందే ఉంటుంది, పెళ్ళికి తర్వాత ఉండదు అని చెప్పాలనుకోవడమే ఈ సినిమా కథ. ఇలాంటి సింపుల్ కథలు ఎంచుకున్నపుడు స్క్రీన్ ప్లేతో ఆకట్టకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇందులో అలాంటి దేమీ కనిపించలేదు. సినిమాలో ఎంటర్టెన్మెంట్ అనేది మిస్సయింది.

సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటి యువతకి బాగా నచ్చిన ప్రేమ అనే పాయింట్ తో కాస్త రొమాంటిక్ గా తీయడం వలన బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లెంగ్త్ తక్కువ కావడం కూడా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన రొమాంటిక్ ట్రాక్ యువతకు బాగానే కనెక్ట్ అవుతుంది. కథలో గానీ, కథనంలో గానీ ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశం, వారు ఊహించలేని అంశం అంటూ ఏదీ లేదు. దీంతో సినిమా కాస్త బోరింగ్ గా తయారైంది. అయితే కొత్తగా ప్రేమించిన పెళ్లైన వారు ఈ సినిమాలో తమను తాము చూసుకోవడానికి అవకాశం ఉంది.

English summary
The movie “365 days” is directed by the great director Ram gopal varma.He is vary confidently directed this movie,is making a comeback to romance genre with his upcoming movie 365 days.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu