twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    777 Charlie Review: మూగ జీవితో రక్షిత్ శెట్టి ప్రయాణం.. ఎలా ఉందంటే?

    |

    నటీనటులు: రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా తదితరులు..
    దర్శకుడు : కిరణ్ రాజ్
    సంగీత దర్శకుడు : నోబిన్ పాల్
    సినిమాటోగ్రఫి : అరవింద్ కశ్యప్
    నిర్మాతలు : రక్షిత్ శెట్టి - జి.ఎస్.గుప్తా
    నిర్మాణ సంస్థ : పరమావ్ స్టూడియోస్


    రక్షిత్ శెట్టి హీరోగా కంటే తెలుగు వారికి రష్మిక మందన్నా మాజీ ప్రియుడుగానే పరిచయం. గతంలో అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాతోనే గతంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆయన తాజాగా 777 Charlie అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 777 Charlie ట్రైలర్ పెట్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్లో అసలు కుక్కలు అంటే ఇష్టంలేని వ్యక్తి చార్లీ అనే కుక్కతో మనిషి ప్రయాణం ఎలా జరిగిందనే విషయాన్ని చూపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రానా రిలీజ్ చేస్తున్నాడు అనగానే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    777 Charlie కథ:

    777 Charlie కథ:

    చిన్నప్పుడే తల్లిదండ్రులు, చెల్లిని ఓ యాక్సిడెంట్లో కోల్పోయి.. ఒంటరిగా పెరుగుతాడు ధర్మ (రక్షిత్ శెట్టి). ఇల్లు, ఫ్యాక్టరీ తప్ప మరో లోకం ఏమీ తెలియకుండా, అందరికీ పగవాడిగా బ్రతికేస్తుంటాడు. అలా ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్న ధర్మ జీవితంలోకి సడన్ ఎంట్రీ ఇస్తుంది ఒక లాబ్రడార్ జాతి కుక్క. ఇక దానికి తనకు ఇష్తమైన చార్లీ చాప్లిన్ లోని చార్లీ అనే పేరు పెడతాడు. ఇక ఆ చార్లీ ఎంట్రీతో ధర్మ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ధర్మ-చార్లీతో కలిసి ఏం చేశాడు? చివరికి చార్లీ వల్ల ధర్మ ఏం తెలుసుకున్నాడు? అనేదే "777 Charlie" కథాంశం.

    సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే

    సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే

    సినిమా మొదటి భాగం అంతా కూడా ధర్మ అనే పాత్ర పరిచయానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు.. చిన్నప్పుడే తల్లిదండ్రులను, చెల్లిని కోల్పోయిన ధర్మ దేవుడికి, మిగతా మనుషులకు దూరంగా తన ప్రపంచంలో తాను బతుకుతుంటాడు. కేవలం ఇల్లు, ఫ్యాక్టరీ, తిండి లోకంగా బతుకుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక బ్రీడర్ నుంచి తప్పించుకున్న చిన్న కుక్క పిల్ల యాదృచ్చికంగా ధర్మ ఇంటికి చేరుతుంది. తొలుత దాన్ని చీదరించుకుంటూ ఎన్నోసార్లు వదిలించుకోవాలని చూసినా అది వదలక పోవడంతో నెమ్మదిగా దానికి అలవాటు పడి దానితో ప్రేమలో పడి చార్లీ అనే పేరు పెడతాడు ధర్మ. అదే సమయంలో దానికి ఒక నయం కాని జబ్బు ఉందన్న విషయం తెలుసుకుని దానికి బాగా ఇష్టమైన ఒక చోటికి తీసుకు వెళ్లాలని ఫిక్స్ అవుతాడు.

    సెకండాఫ్ విషయానికి వస్తే

    సెకండాఫ్ విషయానికి వస్తే


    మొదటి భాగమంతా ఓకే ఊరిలో ఒక కాలనీ చుట్టూ తిరుగుతూ ఉంటే రెండో భాగం మాత్రం ధర్మ -చార్లీ ప్రయాణంతో సాగుతుంది. చార్లీ ఎక్కువ రోజులు బతకదనే విషయం తెలుసుకున్న ధర్మ దానికి బాగా ఇష్టమైన ఒక ప్రాంతానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వారి ఇద్దరి మధ్య అనేక ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. ఎన్నో కష్టనష్టాలు పడిన తరువాత ధర్మ ఎట్టకేలకు చార్లీని తీసుకు వెళ్లాల్సిన చోటికి తీసుకు వెళ్తాడు. ఈ మధ్యలో పరిచయమైన అనేకమంది కూడా వారికీ మంచి స్నేహితులుగా మిగిలిపోతారు. సినిమా మొత్తం మీద పెద్దగా ట్విస్టులు ఏమీ లేవు కానీ ప్రతి సీన్ కూడా ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

    నటీనటుల పనితీరు:

    నటీనటుల పనితీరు:

    ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు రక్షిత్ శెట్టి. రక్షిత్ శెట్టి మంచి యాక్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో తన ఎమోషన్స్ ను ఒక డాగ్ తో కలిసి పండించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే.. ఎంత ట్రైనింగ్ ఇచ్చిన డాగ్ అయినా.. కెమెరా ముందు చెప్పినట్లుగా వినాలంటే చాలా కష్టం. సో, దర్శక బృందంతో పాటు, సదరు శునకంతో కుస్తీ పడుతూ నటించిన రక్షిత్ శెట్టికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక చిన్న పాత్ర అయినప్పటికీ.. హీరోయిన్ సంగీత ఆకట్టుకుంది. రాజ్ బి శెట్టి పెట్ డాక్టర్ గా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. బాబీ సింహా చాలా తక్కువ సమయమే కనిపించినా అలరించాడు. ఇక కేజీఎఫ్ శెట్టిని ఒకే సీన్ కు పరిమితం చేసి కామెడీ పండించారు.

    టెక్నికల్ టీమ్ పనితీరు విషయానికి వస్తే:

    టెక్నికల్ టీమ్ పనితీరు విషయానికి వస్తే:

    దర్శకుడు కిరణ్ రాజ్ దర్శకత్వ ప్రతిభ వరకు వెళ్ళే కంటే ముందు ఇలాంటి ఒక సబ్జెక్ట్ అనుకుని అది కూడా రియల్ డాగ్ తో సినిమా చేయడం అంటే ఆయన ఎంత కష్ట పడి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక డైరెక్టర్ అండ్ టీమ్ అంత కష్టపడింది కాబట్టే ఈ సినిమా సినిమాలా కాకుండా ఒక నిజ జీవిత ఘటన మన కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తుండు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త నెమ్మదించినా దర్శకుడిగా మాత్రం తన మార్క్ చూపాడు కిరణ్ రాజ్. సంగీత దర్శకుడు నోబిన్ నేపథ్య సంగీతంతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ కొన్ని సీన్స్ లో తేలిపోయేలా ఆర్ఆర్ ఇచ్చాడు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ పాయింట్. చాలా సీన్స్ భలే హృద్యంగా బంధించాడు. ఇక సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. తెలుగు రచయిత విజయ్ కుమార్ డైలాగ్స్ బాగా నప్పాయి.

    Recommended Video

    Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
    ఫైనల్ గా చెప్పాలంటే:

    ఫైనల్ గా చెప్పాలంటే:

    ట్రైలర్ చూసి ఈ సినిమా కేవలం జంతు ప్రేమికులను ఆకట్టుకుంటుంది అనుకుంటారు కానీ ఈ సినిమా ప్రతి ఒక్కర్నీ విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పచ్చు. అయితే కుక్కలను లేదా మరేదైనా జీవులను పెంచుకునే వారు అయితే ఖచ్చితంగా ఏడవకుండా సినిమా చూడలేదు. సినిమా మొత్తం మీద చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ చార్లీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తేనే ఆ గ్రాండ్ నెస్ ఉంటుంది.

    English summary
    here is Rakshit Shetty starrer 777 Charlie Review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X