For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఆటగాళ్లు’ మూవీ రివ్యూ, రేటింగ్

  By Bojja Kumar
  |
  Aatagallu Movie Review ఆటగాళ్లు సినిమా రివ్యూ

  Rating:
  2.0/5
  Star Cast: నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్
  Director: పరుచూరి మురళి

  కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేని నారా రోహిత్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో రోటీన్‌కు భిన్నమైన కథలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు ఈ నారా వారి హీరో. జగపతి బాబు లాంటి వెర్సటైల్ యాక్టర్ కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి ఆడిన ఆట ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో ఓసారి సమీక్షిద్దాం.

  కథ ఏమిటంటే...

  కథ ఏమిటంటే...

  సిద్ధార్థ్ (నారా రోహిత్) టాలీవుడ్లో అపజయం ఎరుగని టాప్ ఫిల్మ్ డైరెక్టర్. అంజలి(దర్శన బానిక్) అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనుకోని సంఘటన.... తమ ఇంట్లోనే అంజలి హత్య చేయబడుతుంది. సిద్ధార్థ్ మీద అనుమానంతో పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు. సిద్ధార్థ్ లాయర్‌ను పెట్టుకోకపోవడంతో ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ క్రిమినల్ లాయర్ వీరేంద్ర(జగపతి బాబు) టేకప్ చేస్తాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా హంతకుడు సిద్దార్థ్... కాదని, గతంలో అంజలిని ప్రేమించాలని వెంటపడ్డ మున్నా ఈ దారుణానికి ఒడిగట్టాడని తేల్చేసి... అతడికి ఉరిశిక్ష పడేలా చేసి కేసు ఫినిష్ చేస్తాడు.

   అసలు ఆట ఇప్పుడు మొదలైంది

  అసలు ఆట ఇప్పుడు మొదలైంది

  తనను కేసులో గెలిపించిన వీరేంద్రకు సిద్ధార్థ్ ఖరీదైన కారును గిఫ్టుగా పంపిస్తాడు. తనకు ఇలాంటివి తీసుకోవడం ఇష్టం ఉండదని, న్యాయం ఎటు వైపు ఉంటే అటు తాను వైపే ఉంటానని చెప్పి ఆ బహుమతిని తిరిగి ఇచ్చేస్తాడు. తిరిగి వెళుతున్న సమయంలో వీరేంద్రకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ హత్య చేసింది మున్నా కాదని, సిద్ధార్థ్ ఈ కేసు నుండి బయట పడటానికి తనను పావులా వాడుకున్నాడని తెలుసుకున్న తర్వాత సినిమాలో అసలు ఆట మొదలవుతుంది.

  ఆటగాళ్లు...

  ఆటగాళ్లు...

  అసలు సిద్ధార్థ్ తన భార్యను చంపడానికి కారణం ఏమిటి? న్యాయాన్ని గెలిపించడానికి సీఎంను సైతం ఎదిరించే వీరేంద్ర... ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉచ్చులో ఎలా పడ్డాడు? ఒక లాయర్‌కు, హంతకుడికి మధ్య జరిగిన ఆటలో చివరికి ఎవరు పైచేయి సాధించారు అనేది మిగతా కథ.

  పెర్ఫార్మెన్స్ పరంగా నారా రోహిత్

  పెర్ఫార్మెన్స్ పరంగా నారా రోహిత్

  నారా రోహిత్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. మంచి ప్రేమికుడిగా, భర్తగా, దర్శకుడిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోకి మారే క్రమంలో వేరియేషన్స్ ప్రదర్శించడంలో కాస్త తడబడ్డ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఒక హీరో స్థానంలో ఉండి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఒప్పుకున్న నారా రోహిత్‌ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

  జగపతి బాబు పెర్ఫార్మెన్స్ మేజర్ హైలెట్

  జగపతి బాబు పెర్ఫార్మెన్స్ మేజర్ హైలెట్

  నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండే క్రిమినరల్ లాయర్ పాత్రలో.... న్యాయాన్ని గెలిపించడానికి సీఎంను సైతం ఎదురించగల ధైర్యం ఉన్నవాడిగా జగపతి బాబు అదరగొట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే అతడి పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్.

  ఇతర నటీనటులు

  ఇతర నటీనటులు

  హీరోయిన్‌గా దర్శన బానిక్‌ లుక్ పరంగా ఫర్వాలేదు. ఆమె పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో ఆకట్టకుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుబ్బరాజు, కామెడియన్‌గా బ్రహ్మానందం వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

   టెక్నికల్ అంశాల పరంగా...

  టెక్నికల్ అంశాల పరంగా...

  సాయి కార్తీక్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా ఏమీ లేదు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో మార్తాండ్ కె వెంకటేష్ ఇంకాస్త్ షార్ప్‌గా ఉంటే సినిమా చూసిన వారికి మరీ సాగదీసిన ఫీలింగ్ కలిగేది కాదేమో? నిర్మాణ విలువలు ఫర్వాలేదు. అక్కడక్కడ డైలాగులు బావున్నాయి.

  దర్శకుడి గురించి...

  దర్శకుడి గురించి...

  ఈ చిత్రానికి దర్శకత్వం, స్క్రీప్లే అందించి పరుచూరి మురళి.... ఎంచుకున్న కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేసే విధానంలో తడబడ్డాడు. ముఖ్యంగా నేరేషన్ చాలా స్లోగా ఉంది. థ్రిల్లర్ కాన్సెప్టులకు స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉన్నపుడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అక్కడక్కడ కాస్త బోర్ ఫీలింగ్ కలగడానికి కారణం అందులోని లోపాలే అని భావించాలి. క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు ఫర్వాలేదు.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  • మేజర్ ప్లస్ పాయింట్ జగపతి బాబు
  • నారా రోహిత్
  • మైనస్ పాయింట్స్

   • స్లో నేరేషన్
   • మ్యూజిక్
   • స్క్రీన్ ప్లే
   • చివరగా..

    చివరగా..

    ‘ఆటగాళ్లు' కాన్సెప్టు కొత్తగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు తడబడ్డాడు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి స్లో నేరేషన్‌ను భరించగలిగే ఓపిక కూడా ఉంటే వెళ్లి చూడొచ్చు.

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు, టెక్నీషియన్స్

    నటీనటులు: నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు.

    మాటలు: గోపి
    కెమెరా: విజయ్.సి.కుమార్
    మ్యూజిక్: సాయికార్తీక్
    ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
    ఆర్ట్: ఆర్.కె.రెడ్డి
    నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర,
    స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి
    విడుదల తేదీ: ఆగస్టు 24, 2018

  English summary
  Director Parachuri Murali's latest movie Aatagallu starring Nara Rohith, Jagapati Babu and Darshana Banik, has released today. Aatagallu is a murder mystery movie that is based on mind games played between the culprit and the investigators. Parachuri Murali has written the script for the film, which has been produced by Vasireddy Ravindra Nath, Vasireddy Sivaji Prasad, Makkena Ramu and Vadlapudi Jithendra under the banner Friends Movie Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X