»   » స్టెప్స్ అదిరాయి: ‘ఎబిసిడి 2’ మూవీ రివ్యూ...

స్టెప్స్ అదిరాయి: ‘ఎబిసిడి 2’ మూవీ రివ్యూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
హైదరాబాద్: బాలీవుడ్లో గతంలో వచ్చిన డాన్స్ ప్రధానంగా సాగే ‘ఎబిసిడి' చిత్రం మంచి విజయం సాధించింది. కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారిన రెమో డిసౌజా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. పెద్ద స్టార్లు లేక పోయినా మంచి స్క్రిప్టు, డైరెక్షన్, డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. సినిమా హిట్టయింది.

తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘ఎబిసిడి 2' మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా ముఖ్య పాత్రలు పోషించారు. డాన్స్ కాన్సెప్టు సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి 3డి ఎఫెక్టు కూడా తోడు కావడంతో సినిమాపై యూత్ లో ఆసక్తి పెరిగింది.

ABCD 2 Movie Review

తారాగణం: వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా
ఎబిసిడి 2: రెమో డిసౌజా

కథ విషయానికొస్తే...
సురేష్(వరుణ్ ధావన్) అతని ట్రూప్ డాన్స్ కాంపీటీషన్లో పాల్గొనడంతో సినిమా మొదలవుతుంది. వీరు పిలప్పీన్స్ డాన్స్ ట్రూపును కాపీ కొట్టినట్లు జడ్జిల నుండి ఆరోపణలు ఎదుర్కొంటారు. ప్రముఖ డాన్సర్ కొడుకు అయి ఉండి ఇలాంటి పని ఎలా చేసావ్ అంటూ జడ్జిలు అతన్ని నిలదీస్తారు. సురేష్ తల్లి ప్రముఖ డాన్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత. తన కొడుకు వరల్డ్ డాన్స్ కాంపిటీషన్ విజేత కావాలని ఆమె డ్రీమ్.

సురేష్ ప్రియురాలు విన్ని(శ్రద్ధా కపూర్) కూడా అతని డాన్స్ ట్రూపులోనే ఉంటుంది. ఎలాగైనా ఈ సారి వరల్డ్ డాన్స్ కాంపిటీషన్ నెగ్గాలని, తన తల్లి ఆశయం నెరవేర్చాలని కసిగా ఉంటాడు సరేష్. ఈ క్రమంలోనే విష్ణు సర్(ప్రభుదేవా)ను కలిసి తమ గ్రూపుకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పిస్తాడు.

ఎంట్రీ లెవల్లో.... వీరి గ్రూపు చీటర్స్ గా పేరు తెచ్చుకుంటారు. అయితే విష్ణు సర్ వారిని కన్విన్స్ చేసి మరో ఛాన్ష్ ఇవ్వాలని అడుగుతాడు, వాస్తవానికి విష్ణు లాస్ వెగాస్ వచ్చింది తన కొడుకును కలవడానికి. అతని కొడుకు ఎవరు అనేది ఆసక్తిరమైన పాయింట్. ఇక సురేష్ అండ్ ట్రూపు ఇతర గ్రూపులను ఎలా బీట్ చేసారు, కాంపిటీషన్లో వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, సురేష్-విన్ని రొమాన్స్ తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్...
వరుణ్ ధావన్ తన గత సినిమా ‘ఎబిసిడి' సినిమాలోనే అద్భుతమైన డాన్సింగ్ పెర్పార్మెన్స్ చూపించాడు. తాజాగా ‘ఎబిసిడి 2'లో మరింత పరిణితి చెంది మైడ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో సూపర్బ్ అనిపించాడు.

శ్రద్ధా కపూర్ వరుణ్ కు పోటీగా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ షాక్ కు గురి చేసింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు కూడా అదరిపోయాయి. అయితే సినిమాలో ఆమెకు డాన్స్ పరంగానే తప్ప యాక్టింగ్ పరంగా నిరూపించుకునే అవకాశం రాలేదు. ప్రభుదేవా తన సహజసిద్దమైన నటనతో ఆకట్టుకున్నాడు.

టెక్నికల్..
ఈ చిత్రానికి సచిన్-జిగర్ అందించిన సంగీతం ఇప్పటికే మంచి హిట్టయింది. రెమో డిసౌజా డైరెక్షన్ బావుంది. అయితే డ్రమటిక్ సీన్స్ పర్ఫెక్టుగా తీయలేక పోయాడు. సినిమాలో చెప్పుకోదగ్గ స్టోరీలైన్ ఏమీ లేదు. కేవలం డాన్స్ పెర్ఫార్మెన్స్ లే మిమ్మల్ని ఎంటర్టెన్ చేయడంతో పాటు థ్రిల్లింగ్ కు గురి చేస్తాయి. డాన్స్ సీక్వెన్స్ లో 3డి ఎపెక్టు చాలా బావుంది.

చివరగా...
డాన్సింగ్ ఇష్టపడే వారికి... ఈ వీకెండ్ లో చూడటానికి ఎబిసిడి 2 బెస్ట్ మూవీ. 3డి ఎఫెక్టు బాగా ఎంజాయ్ చేస్తారు.

English summary
ABCD 2 is a great movie for the weekend watch, irrespective of the age, you can enjoy this good 3D dance movie and have a smile on your face through out. Filmibeat verdict says, ABCD 2 is a must watch on this great weekend.
Please Wait while comments are loading...