»   » హారర్ తక్కువైనా కామెడీ వర్కౌట్ అయింది (‘అభినేత్రి’ రివ్యూ)

హారర్ తక్కువైనా కామెడీ వర్కౌట్ అయింది (‘అభినేత్రి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

హైదరాబాద్: ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్‌లో ఎఎల్ విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌లో నిర్మిస్తున్నారు. హిందీలో సోనూ సూద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూడు బాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజైంది.

తారాగణంం: ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌
సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
సంగీతం: సాజీద్‌-వాజీద్‌.. జీవీ ప్రకాశ్‌- విశాల్‌
సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌
ఎడిటింగ్‌: ఆంటోనీ
ఆర్ట్‌: వైష్ణరెడ్డి


కథ

కథ

ముంబై లో ఉద్యోగం చేసే కృష్ణ (ప్రభుదేవా) అందంలో, యాటిట్యూడ్ లో మోడ్రన్ గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితులతో కుటుంబపరమైన ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా పల్లెటూరి అమ్మాయి దేవి(తమన్నా)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత ఆమెను ముంబై తీసుకొచ్చి ఓ పాత అపార్టుమెంటులో కాపురం పెడతాడు కానీ తాను పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే పరువు పోతుందనే భయంతో పెళ్లి విషయం ఎవరికీ తెలియనివ్వడు.


ఆత్మ

ఆత్మ

దేవిని ఎలాగైన ఒప్పించి ఊరికి పంపించాలనుకుంటున్న కృష్ణ...ఆమె ప్రవర్తనలో మార్పును గమనిస్తాడు. తాము ఉంటున్న ఇంట్లో అంతకు ముందు రూబి(తమన్నా) అనే అమ్మాయి ఉండేదని, సినిమా హీరోయిన్ అవ్వాలనే కోరిక తీరక మరణించిందనే విషయం తెలుస్తుంది. దేవి ప్రవర్తనలో మార్పు కారణం రూబీ ఆత్మ ఆమెలో చేరడమే అని తెలుసుకుని షాకవుతాడు.


అభినేత్రి

అభినేత్రి

దేవి శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ తన కోరికను నేరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె స్టార్‌ హీరో రాజీవ్‌(సోనూసూద్‌) కంట్లో పడుతుంది. రాజీవ్ దేవిని ఇష్టపడుతుంటాడు. మరి... ఆత్మ నుండి, రాజీవ్ నుండి కృష్ణ తన భార్యను ఎలా కాపాడుకున్నాడనే అనేది తర్వాతి స్టోరీ.


పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

కృష్ణ పాత్రలో ప్రభుదేవా ఆకట్టుకున్నాడు. నటనతో పాటు కామెడీ టైమింగ్, డాన్సింగ్ తో అలరించాడు. తమన్నా... దేవి, రూబీ రెండు విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. రెండు పాత్రల్లో వేరియేషన్స్ అద్భుతంగా ప్రదర్శించింది. ప్రభుదేవాతో పోటీ పడి నటించింది. సినీ స్టార్ పాత్రలో సోనూసూద్‌ ఓకే. సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.


టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

మనీష్‌ నందన్‌ సినిమాటోగ్రఫీ బావుంది. సాజీద్‌-వాజీద్‌.. జీవీ ప్రకాశ్‌- విశాల్‌ అందించిన మ్యూజిక్ బాగోలేదు. హిందీ అనువాద సాంగులు కావడం వల్ల సెట్ వినసొంపుగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదరగొట్టాడు. ఎడిటింగ్ బాగోలేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.


దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

దర్శకుడు ఎఎల్. విజయ్ సినిమాను బాగా హ్యాండిల్ చేసాడు. కథను నేరేట్ చేసిన విధానం బావుంది. కథకు ఎంత అవసరమో అంతే హారర్ ఎలిమెంటును జోప్పించారే తప్ప కావాలని అనవసరమైన హారర్ సీన్లు, భయపెట్టే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టలేదు. హారర్ తక్కువైనా కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో సఫలం అయ్యాడు.


మరిన్ని విషయాలు

మరిన్ని విషయాలు

హారర్ సినిమాల్లో సాధారణంగా దెయ్యం పగ తీర్చుకునే సన్నివేశాలుంటాయి. ఇందులో అలా పెట్టకుండా ఆత్మ హీరోయిన్ కావాలనే ఒక లక్ష్యంతో కనిపిస్తుంది. అయితే కథనం ఆకట్టుకునే విధంగా లేదు. సెకండాఫ్ సాగదీసినట్లు ఉండటం, లాజిక్ లేని కొన్ని సీన్లు మైనస్ అనిపిస్తాయి.


చివరగా

చివరగా

కథ, కథనం కొత్తగా లేక పోయినా.... సస్పెన్స్, ట్విస్టులు కనిపించక పోయినా సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ జోడించి వినోదాత్మకంగా నడిపించడం వల్ల ప్రేక్షకులు బోర్ పీలవ్వరు.


English summary
Check out Abhinetri Telugu Movie Review, Rating.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu