»   » పూర్వజన్మ, పునర్జన్మ కథతో.. ( చిత్రాంగద మూవీ రివ్యూ)

పూర్వజన్మ, పునర్జన్మ కథతో.. ( చిత్రాంగద మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

గీతాంజలి లాంటి హారర్ చిత్రాల్లో కనిపించిన అందాల తార అంజలి మరోసారి హారర్ థ్రిల్లర్ చిత్రాంగద చిత్రం ద్వారా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్వ జన్మ, పునర్జన్మ కథాంశంగా రూపొందిన ఈ చిత్రం సినీ అభిమానులను ఏ మేరకు సంతృప్తి పరిచిందోననే అంశాలను తెలుసుకొనే ముందు కథ ఎంటో తెలుసుకుందాం.

కథ ఇది..

కథ ఇది..

చిత్రాంగద ఓ అనాధ. ఓ బాలికల హాస్టల్ చదువుకొని అదే కాలేజీకి ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ప్రకృతికి విరుద్ధంగా అమ్మాయిలపై మోజు పడటమనే విచిత్ర లక్షణాన్ని కలిగి ఉంటుంది. చిత్రాంగద ప్రవర్తన తీరు వివాదాస్పదంగా ఉండటం మూలాన అందరూ ఆమెను ఈసడించుకొంటారు. ఇదిలా ఉండగా 25 ఏండ్ల క్రితం రవివర్మ అనే వజ్రాల వ్యాపారి అమెరికాలోని ఓ సరస్సులో దారుణహత్యకు గురవుతాడు. ఆ సంఘటనే కలగా ఆమెను వెంటాడుతుంటుంది.

ఆ ప్రశ్నలకు సమాధానమే..

ఆ ప్రశ్నలకు సమాధానమే..

ఇంతకీ ఆ కల, చిత్రాంగద జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? తాను అనాధగా మారడానికి రవివర్మ హత్య కారణమైందా? చిత్రాంగద తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నది? ఇలాంటి కొన్నిప్రశ్నలకు సమాధానమే చిత్రాంగద సినిమా.

పునర్జన్మ అంశంతో అల్లుకొన్న కథ,

పునర్జన్మ అంశంతో అల్లుకొన్న కథ,

దానికి తగినట్టు అందమైన లొకేషన్లు బాగా ఉన్నాయి. అయితే కథనంలోనే కొంత గందరగోళం కనిపిస్తుంది. అనవసరమైన కామెడీ, పాత్రలు కథ వేగానికి అడ్డుపడినట్టు అనిపిస్తుంది. అంతేకాక చిత్ర నిడివి కూా ఎక్కువగా ఉండటం కొంత విసుగు తెప్పించే అంశం. నటీనటుల క్యారెక్టరైజేషన్ పేలవంగా ఉంది. అందుకు ఉదాహరణ సుడిగాలి సుధీర్, జయప్రకాశ్ పాత్రలు.

ప్రథమార్థంలో కొంత ఆరంభం,

ప్రథమార్థంలో కొంత ఆరంభం,

ద్వితీయార్థంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. అంజలి పాత్రను తీర్చిదిద్దడంలో దర్శకుడు అశోక్ మరింత దృష్టిపెట్టినట్లయితే చిత్రాంగత హారర్ చిత్రాల్లో మరో భారీ హిట్‌గా నిలిచేది. హారర్ అంశాలను ఎలివేట్ చేయడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. కథ కోసం చేసిన పరిశోధన అభినందనీయం.

కథ, కథనం డిమాండ్

కథ, కథనం డిమాండ్

మేరకు పర్వాలేదనిపించే స్థాయిలో సెల్వ గణేశ్, స్వామినాథన్ సంగీతం అందించారు. పాటలు అంతగా ఆకట్టుకొనేలా లేవు. ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకా పనిపెడితే చిత్రం మరింత క్రిస్ప్‌గా ఉండేది. అమెరికాలోని అందమైన లోకేషన్లను బాల్ రెడ్డి చక్కగా తెరకెక్కించారు.

ఈ చిత్ర భారాన్ని

ఈ చిత్ర భారాన్ని

మొత్తం అంజలి స్వయంగా మోసింది. కథానాయికలకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో అంజలికి దొరికిన గొప్ప అవకాశం చిత్రాంగద. కీలక సన్నివేశాల్లో ఆమె బాగా నటించింది. నటిగా ఇంకా ప్రూవ్ చేసుకొనే అవకాశం ఈ చిత్రంలో ఉన్నా సరైన స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయిందనిపిస్తుంది. బరువైన పాత్రలను పోషించే నాయికల్లో అంజలి ఒకరనే అభిప్రాయం కొంత కలుగుతుంది. యాక్షన్, హారర్ సీన్లలో పర్వాలేదనిపించింది.

హీరోయిన్ ఓరియెంటెడ్‌గా

హీరోయిన్ ఓరియెంటెడ్‌గా

రూపొందిన చిత్రాంగద కోసం అంజలి బాగానే శ్రమించినట్టు, ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలలో అమెరికా షూటింగ్ సందర్భంగా మైనస్ 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అంజలి కొన్ని సన్నివేశాల్లో నటించింది.

తెలుగు చిత్రాల్లో

తెలుగు చిత్రాల్లో

ఇటీవల తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తున్న కమెడియన్ సప్తగిరి ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్‌లో నటించాడు. అయితే సన్నివేశాల చిత్రీకరణ చాలా పేలవంగా ఉండటంతో హాస్యం అభాసుపాలైంది. అయితే అక్కడకక్కడ తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు.

వజ్రాల వ్యాపారి

వజ్రాల వ్యాపారి

రవివర్మగా దీపక్ మరోసారి తెలుగు తెరపై మరోసారి కనిపించారు. రాజా రవీంద్ర, సింధూ తులానీ, సుడిగాలి సుధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్రతిభావంతులైన నటులు,

ప్రతిభావంతులైన నటులు,

సాంకేతిక వర్గం అండ, మంచి కథతో చిత్రాంగదలోని ప్రతి సన్నివేశం విజువల్ వండర్‌‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రాన్ని బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడాన్ని బట్టి చిత్రాంగద విజయం ఆధారపడి ఉంటుంది.

ప్లస్ పాయింట్స్
అంజలి యాక్టింగ్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్
కథనం
థర్డ్ క్లాస్ కామేడి
చిత్ర నిడివి

నటీనటులు: చిత్రాంగద, అంజలి, సప్తగిరి, రాజా రవీంద్ర, రక్ష, సాక్షి గులాటి, సింధూ తులానీ
నిర్మాత: గంగపట్నం శ్రీధర్, రహ్మాన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ జీ
సంగీతం: సెల్వ గణేశ్, స్వామినాథన్
ఫొటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిడివి: 144 నిమిషాలు

English summary
Chitrangada is said to be a horizontal horror thriller released on March 10. Anjali acted main lead. The movie has also stars like Saptagiri, Raja Ravindra, Raksha, Sakshi Gulati and Sindhu Tolani in important roles. It is produced by Gangapatnam Sridhar and the music is composed by Selva Ganesh and Swaminathan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu