twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అడవి' లో ప్రేక్షకుడి బలి

    By Staff
    |
    Adavi
    Rating
    సంస్థ: యుటీవి మోషన్ పిక్చర్స్ మరియు విశాఖ టాకీస్
    నటీనటులు: నితిన్, ప్రియాంక కొఠారి, గౌతమ్ రోడ్, రసికా దుగ్గల్,
    ఇస్తేయాక్ ఖాన్, ఇస్రాత్ అలీ, రవి కాలె, హార్వే రోస్మేయర్,
    కాలి ప్రసాద్ ముఖర్జీ, జాయ్ ఫెర్నాండెజ్ తదితరులు.
    పాటలు: కలువ సాయి
    సంగీతం: బాపి-టూటుల్, ఇమ్రాన్ విక్రమ్
    దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
    నిర్మాతలు: రానీ స్ర్కువాల్, రామ్ గోపాల్ వర్మ

    జనాన్ని భయపెట్టడమే తన లక్ష్యంగా హారర్ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ తాజాగా నితిన్, ప్రియాంక కొఠారి ల కాంబినేషన్ లో తీసిన ద్విభాషా చిత్రం అడవి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం హైలెట్ గా మంచి అంచనాలతో ఈ రోజే విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో తెలియాలంటే ఇంకా ఓ వారం ఆగాల్సిందే...

    ఇక కథ విషయానికి వస్తే ఓ సినిమా బృందం షూటింగ్ కని ఓ అడవికి వెళ్తారు. ఇందులో దర్శకుడు జె.జె (హార్వే రోస్మేయర్) తానో 'స్టీఫెన్ స్పీల్ బర్గ్' వంటి దర్శకున్ని అనుకొంటూ వుంటాడు. ఇక మిగితా వారి విషయానికి వస్తే శర్మన్(గౌతమ్ రోడ్) హీరో, ఆశా(ప్రియాంక కొఠారి) హీరోయిన్ కాగా అడవి సినిమా అసలైన హీరో నితిన్ అసిస్టెంట్ డైరెక్టర్ సుజన్ పాత్రలో కనిపిస్తారు. సమీర(రసికా దుగ్గల్) సుజన్ దగ్గర అసిస్టెంట్. స్టంట్ మాస్టర్ రాకా(రవి కాలె), సినిమాటోగ్రఫర్ లక్ష్మన్(ఇస్తేయాక్ ఖాన్), నిర్మాత మూర్తి(ఇస్రాత్ అలీ) కూడా ఈ బృందంలో వుంటారు. ఓ సారి ఆ భయంకరమైన అడవిలో షూటింగ్ చెయ్యడానికి భయపడి శర్మన్ వెళ్లిపోజూసినా అక్కడ నుండీ విమాన సర్వీసు రెండు వారాలకొకసారే వుండటంతో ఆగిపోతాడు. సినిమా షూటింగ్ స్పాట్ కు చేరుకున్నాకా కెమెరా పాడవడంతో రెండు రోజుల పాటు షూటింగ్ ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఈ బృందం ఫారెస్టు గైడ్ శేతు(జాయ్ ఫెర్నాండెజ్) సాయంతో అడవి చూడటానికి వెళ్తారు. అంతా ఆహ్లాదంగా వుంటుంది. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి లేవగానే, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన ఫారెస్టు గైడ్ సేతు భయంకరంగా చంపబడి ఉంటాడు. ఫారెస్టు గైడ్ చనిపోవడంతో దారి తెలీయక ప్రాణభయం తో పారిపోతున్నవారిలో ఒకొక్కరే ఆ అదృశ్య శక్తి బలైపోతూవుంటారు. ఇక హీరో హీరోయిన్లు ఎలా ప్రాణాలతో బయటపడారన్నది మిగిలిన కథ...

    కథ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా చక్కటి స్ర్కీన్-ప్లే తో ఆసక్తి రేపడంలో దర్శకుడు విజయవంతం అయినప్పటికీ, చివరికి ఎవరు చంపుతున్నారో చెప్పకుండా సీక్వెల్ కై ఎదురుచూడండి అంటూ సినిమా ముగిసిపోవడంతో ప్రేక్షకుడు అసహనానికి లోనవుతాడు. దర్శకుడికి కథను ఎలా ముగించాలో తెలీయక అలాగే వదిలేసినట్టు అనిపిస్తుంది.

    ఇక హీరో నితిన్ నటన ఫర్వాలేదు....హీరోయిన్ ప్రియాంక అందాల ఆరబోతకే పరిమితమైనట్టుఅనిపిస్తుంది. నిర్మాత మూర్తి పాత్రధారి "అయ్యోడ" మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం ఫర్వాలేదు. పాటల చిత్రీకరణ, ప్రియాంక అందాలు యువతను ఆకట్టుకుంటాయి. రామ్ గోపాల్ వర్మ చిత్రంలో మామూలుగా కనిపించే రీ-రికార్డింగ్, కెమెరా జిమ్మిక్కులు ఈ చిత్రంలోనూ కనిపిస్తాయి........

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X