twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి బోర్ కొట్టించిన సుశాంత్ (అడ్డా రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కాళిదాసు, కరెంట్ చిత్రాలతో పెద్దగా నిలదొక్కుకోలేక పోయిన హీరో సుశాంత్ కొంతకాలం గ్యాప్ తీసుకుని......ప్రేక్షకులను మెప్పించాలని చాలా ప్రిపేర్ అయి 'అడ్డా' చిత్రంతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన జి.కార్తీకరెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ నాగ సుశీల నిర్మించారు. మరి ఈ సారైనా సుశాంత్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

    కథ విషయానికొస్తే...ప్రేమించుకుని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి వచ్చే లవర్స్‌ను విడగొట్టడంలో అభి(సుశాంత్) స్పెషలిస్ట్. పిల్లల ప్రేమ వ్యవహారాలతో మనో వేదన పడే తల్లిదండ్రుల కోసం ఈ పనులు చేస్తుంటాడు అభి. అందుకోసం కొంత ఫీజు తీసుకుంటాడు. అభి విషయం తెలుసుకున్న ప్రియ(శాన్వి) తన అక్క ప్రేమ వ్యవహారాన్ని చెడగొట్టేందుకు అతని సహాయం తీసుకుంటుంది. ఈ క్రమంలో అభి ప్రియపై మనసు పారేసుకుంటాడు. ఓ సంఘటన వల్ల అభిని ప్రియ ద్వేషిస్తుంది. మరి ఆ కారణం ఏమిటి? కథ చివరకు ఎలా మలుపు తిరిగింది? అనేది తర్వాతి కథ!

    Adda

    సుశాంత్ గత సినిమాలతో పోలిస్తే అతని పెర్ఫార్మెన్స్‌లో పెద్దగా ఇంప్రూమెంట్ ఏమీ కనిపించలేదు. మూడో సినిమా అయినా కొత్తవాడిలా, అనుభవం లేని వాడిలా నటించాడు. డాన్స్, ఫైట్స్, నటన విషయాల్లో హీరోలో కనిపించాల్సిన పర్‌ఫెక్ట్‌నెస్ సాధించలేక పోయాడు. శాన్వి గ్లామర్ పరంగా, అభినయం పరంగా ఓకే. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    దర్శకత్వ శాఖలో పని చేసినా... కార్తీకరెడ్డిలో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనబడింది. పైగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే లాంటి అంశాలను కూడా తానే హ్యాండిల్ చేసి చేయి కాల్చుకున్నాడు. ముఖ్యంగా దర్శకుడికి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఆర్టిస్టులను పర్ ఫెక్టుగా వాడుకోవడం, వారి నుంచి తనకు వాల్సిన అంశాలను రాబట్టి సీన్లను పర్ ఫెక్టుగా తీయడం. ఈ విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడని చెప్పక తప్పదు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఫర్వాలేదు. సినిమా మొదటి సగభాగం టైమ్ పాస్ అవుతుంది. రెండో భాగం చివరి వరకు చూడటం కష్టమే. సాంకేతిక విభాగాల్లో అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఒక్కటే సినిమాకు బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ ఫర్వా లేదు. ఇతర విభాగాలు అంతంత మాత్రంగానే పని చేసాయి.

    ఫైనల్‌గా చెప్పాలంటే....కొత్తదనం లేని కథ, కథనం, ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే వెరసి బోర్ ఫీలవ్వడం ఖాయం.

    English summary
    Nagarjuna’s nephew Sushanth 'Adda' is hit the screens today (15th August). The film directed by G.Karthik Reddy and jointly produced by Chintalapudi Srinivasarao and A.Naga Susheela on Sri Nag Corporation banner. Gajjala 
 Sai Reddy, who earlier associated with Puri Jagannath, is making debut as director with this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X